అన్వేషించండి

Brahmamudi December 9th Episode: ‘బ్రహ్మముడి’ సీరియల్‌ : కళ్యాణ్‌కు కనకం, కనకానికి కావ్య.. షాకుల మీద షాకులు

Brahmamudi Serial Today Episode: కళ్యాణ్ నాటిన మొక్కను పీకేసి వాడిపోయిన మొక్కను నాటుతుంది కనకం.కనకం నాటిన మొక్కను పీకేసి పచ్చగా ఉన్న మొక్కను కావ్య నాటడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఎంతో ఆసక్తి గా జరిగింది.

Brahmamudi Telugu Serial Today Episode: హాల్లో అందరూ కూర్చుని ఆలోచిస్తుంటారు. ధాన్యలక్ష్మీ బాధపడుతుంది. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చాలా గ్రాండ్‌గా చేద్దామనుకుంటే ఇలా జరుగుతుందేంటి? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నువ్వు ఇలాంటివన్నీ నమ్ముతావా? అంటూ రుద్రాణి ఓదారుస్తుంది. జాతకాలను ఎందుకు తప్పు పడతావు రుద్రాణి అంటూ వాళ్ల అమ్మ వారిస్తుంది.  

రుద్రాణి: లేదమ్మా రేపొద్దున ఆ మొక్క వాడిపోతే  ఇక పెళ్లి ఆపేస్తారా?

అనగానే అందరూ షాకింగ్‌ చూస్తుంటారు. దూరంగా కూర్చుని కూరగాయలు కట్‌ చేస్తున్న కనకం నీ నోటి వాక్కే అలానే జరుగుతుంది అని మనసులో అనకుంటుంది. ఏం మాట్లాతున్నావు అంటూ అపర్ణ కోప్పడుతుంది.  పచ్చగా ఉండదు వెచ్చగా ఉండదు ఈ కనకం ఒక మొక్కను హత్య  చేయబోతుంది అని కనకం మనసులో అనుకుంటుంది.

రుద్రాణి: వదినా నాకైతే ఈ జాతకాల మీద నమ్మకమే లేదు.

అపర్ణ: ఎందుకు లేదు.

రుద్రాణి: నా పెళ్లికి నువ్వే జాతకాలు చూపించి లగ్నబలం దివ్యంగా ఉందని మా పెళ్లి చేశావు. అది కాస్త పెటాకులైపోయింది కాబట్టి.

అపర్ణ: నువ్వు నీ కోపాన్ని , ఆవేశాన్ని కాస్త తగ్గించుకుని ఉంటే నీ కాపురం కూడా నిలబడి ఉండేంది.

  అనగానే రుద్రాణి చెప్పిందికూడా నిజమే కదా అక్కా అంటూ బాధపడుతుంది ధాన్యలక్ష్మీ, ఒక్కగానొక్క కొడుకు. వాడి పెళ్లి చాలా గ్రాండ్‌గా చేద్దామనుకుంటే ఇలాంటి అపశకునాలు అడ్డొస్తున్నాయి. వాడి అదృష్టం ఎలా ఉందో.. అనగానే కనకం మనసులో ఎవరి అదృష్టం ఎలా ఉన్నా నా కూతురు అదృష్టం బాగుండాలి.  అనామిక వాళ్ల అమ్మానాన్నపెళ్లి ఆగిపోతుందేమోనన్న భయంతో ఇద్దరూ బాధపడుతుంటారు. ఈ పెళ్లి జరిగితే అనామికను అడ్డుపెట్టుకుని మన అప్పులన్నీ తీర్చుకుందామంటే ఇలా జరిగిందేంటి అని బాంబ్‌ పేలుస్తారు. లోపల అనామిక బాధతో కూర్చుని ఉంటే ఆమె దగ్గరకు వెళ్లి కళ్యాణ్‌ నిన్ను నిజంగా ప్రేమించిన వాడే అయితే ఇలా జాతకాల పేరు చెప్పి పెళ్లి చెడగొట్టడు కదా అని చెప్పి వెళ్లిపోతారు. అనామిక వెంటనే సీరియస్‌గా కళ్యాణ్‌కు ఫోన్‌ చేసి మొక్క చనిపోతే మన పరిస్థితి ఏంటని నిలదీస్తుంది. ఈ పెళ్లి ఆగిపోతే నువ్వు చూసేది నా శవాన్నే అంటూ ఫోన్‌ పెట్టేస్తుంది. రాజ్‌ సీరియస్‌గా ఆలోచిస్తూ బెడ్‌రూంలో కూర్చుని ఉంటాడు. అక్కడికి కావ్య వస్తుంది.

కావ్య: ఏంటిది ఎం పట్టనట్లు కూర్చున్నారు.

రాజ్‌:  మరి ఏం చేయాలి.

కావ్య: కవి గారి పెళ్లి గురించి ఏదో ఒకటి చేయాలిగా..

రాజ్‌: నేనేం చేస్తాను. చెస్‌ బోర్డు మీద కాయిన్స్‌ మార్చినట్లు గ్రహాలను మార్చి రావాలా?

కావ్య: ఒకవేళ పంతులు గారు చెప్పినట్లు ఆ మొక్క వాడిపోతే నిర్ధాక్షిణంగా ఆ ప్రేమికులను విడదీస్తారా అండి. అప్పుడు కవిగారు ఏమై పోతారో మీరు ఆలోచించారా?

రాజ్‌: అవును వాడసలే చాలా సెన్సిటివ్‌.. లవ్‌లో ఫెయిల్‌ అయితే దాన్ని ఎలా తట్టుకుంటాడో నాకు అర్థం కావడం లేదు.

కావ్య: నేను కూడా అందుకే భయపడుతున్నాను. మధ్యలో ఈ జాతక దోషాలేంటండి.

అంటూ కావ్య ఏదో ఒకటి చేయండి అంటూ రాజ్‌ను తిడుతూ బయటకు వెళ్తుంది. ఇదేంటి నన్ను తిడుతుంది అనుకుంటాడు రాజ్‌. అందరూ పడుకున్నాక కనకం దొంగచాటుగా వెళ్లి నిమ్మ చెట్టును పీకి దాని స్థానంలో వాడిపోయిన నిమ్మ మొక్కను నాటుతుంది. అప్పుడు కళ్యాణ్‌ బయటికి వస్తాడు. డోర్‌ సౌండ్‌ విన్న కనకం పక్కకు వెళ్లి దాక్కుంటుంది. కళ్యాణ్‌ మొక్క దగ్గరకు వచ్చి వాడిపోయిన మొక్కను చూసి బాధపడతాడు.

అప్పు మూడు మొక్కలు తీసుకొచ్చిన విషయం గుర్తుకు వచ్చి మొక్కను మారుద్దామనుకుంటాడు. మళ్లీ ఇంట్లో వాళ్లకు ప్రాబ్లమ్‌ అని పంతులు చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ఆగిపోతాడు. కట్‌ చేస్తే ఉదయం కనకం లేట్‌గా లేస్తుంది. సడెన్‌గా నిద్రలేచి కంగారుగా హాల్లోకి వస్తుంది. ఎవ్వరూ కనిపించకపోవడంతో బయటకు వస్తుంది. ధాన్యలక్ష్మీని ఒదారుస్తున్నట్లుగా వస్తూ.. చెట్టును చూడగానే ఆది పచ్చగానే ఉంటుంది. కనకం షాక్‌ అవుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు.

అనామిక వాళ్ల ఇంట్లో అందరూ టెన్షన్‌ పడుతుంటే కళ్యాణ్‌ ఫోన్‌ చేసి చెట్టు బతికే ఉందని చెప్పగానే అందరూ హ్యాపీగా ఫీలవుతారు.  అనామిక అక్కడి నుంచి వెళ్లగానే వాళ్ల అమ్మా నాన్న తమ అప్పులు ఇక తీరినట్లేనని ఇక వీలైనంత త్వరగా పెళ్లి చేయాలని డిసైడ్‌ అవుతారు. పెళ్లి కాగానే కళ్యాణ్‌ను ఎలాగైనా ఇక్కడకు వచ్చేలా చేయాలని అప్పుడు కళ్యాణ్‌ ఆస్థి మన చేతికి వస్తుందని ప్లాన్‌ వేస్తారు. కళ్యాణ్‌, కావ్య దగ్గరకు వెళ్లి థాంక్స్‌ చెప్తాడు. వాడి పోయిన మొక్కను పీకేసి కొత్త మొక్కను మీరే నాటారని నాకు తెలసని చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ అయిపోతుంది.

Also Read: త్రినయని సీరియల్: గాయత్రీ పేరు మార్చేందుకు తిలోత్తమ స్కెచ్.. బలి తప్పదన్న గురువుగారు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Embed widget