Trinayani Serial December 9th Episode - 'త్రినయని' సీరియల్: గాయత్రీ పేరు మార్చేందుకు తిలోత్తమ స్కెచ్.. బలి తప్పదన్న గురువుగారు!
Trinayani Today Episode : విశాల్‌ను ఎదిరించి మరీ గాయత్రీ పాప పేరు మార్చేందుకు తిలోత్తమ సిద్ధమవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది
Trinayani Telugu Serial Today Episode
విక్రాంత్: ఈ గాయత్రీకి వచ్చింది జ్వరం.. గాయత్రీ పెద్దమ్మకు వచ్చేది గండం.. పేర్లు ఒకటే కానీ వేర్వేరు కదా
హాసిని: ఇక్కడే లోతుగా ఆలోచించాలి విక్రాంత్ వారు వీరు అవ్వొచ్చు.. వీరు వారు అవ్వొచ్చు
నయని: ఎలా అవుతారు అక్క
హాసిని: బిడ్డకు ఏమవుతుందా అనే టెన్షన్‌లో నువ్వున్నావ్ కాబట్టి నీకు అర్థం కావడం లేదు. శివభక్తురాలు డమ్మక్క ఏం చెప్పింది.. పేర్లు పోలి ఉండడం వల్ల పోలికలు ఉన్నాయో లేవో అవి వేరే సంగతి కానీ అదీ ఇదీ అనీ ఏదో చెప్పబోతే విక్రాంత్ అడ్డుకుంటాడు..
నయని: అక్క నన్ను నవ్వించాలి అని నువ్వు ఏదో చెప్తున్నావ్ కానీ గాయత్రీకి నయం అయ్యేవరకు నాకీ కంగారు పోదు
హాసిని: నువ్వు విచారించకు నయని మీ ఆయనకు ఏం చేయాలో స్పష్టంగా తెలుసు అంటున్నాడు కదా.. ఆపద వస్తే అమ్మగా ఆదుకోవడానికి నువ్వు ఉన్నావు. కష్టం వస్తే గట్టెక్కించడానికి నాన్నగా విశాల్ ఉన్నాడు.
విశాల్: నయని పాపకు విశాలాక్షి అమ్మవారి విభూది రాయు.. ఏం చేయాలో తెల్లవారి చెప్తాను.
అఖండ స్వామి దగ్గరకు తిలోత్తమ, వల్లభ వస్తారు.
అఖండ: పరమేశ్వరుని పాదాలను అంటిన పూలమాలతో మూలాలను బయటపెడదామంటే విరుద్ధంగా జరిగింది. పొడి ఇచ్చి గాయత్రీ దేవి జాడ నీడ చూడమంటే అది మీ ఇంట్లో ఉన్న గాయత్రీ మీద పడింది అంటే ఏంటి దాని అర్థం.
తిలోత్తమ: అర్థమై ఉంటే ఇప్పుడు మిమల్ని ఇబ్బంది పెట్టేవాళ్లం కాదు స్వామి
అఖండ: నాకెందుకో నయని వాళ్లు దత్తత తీసుకున్న అనాధ పిల్ల గురించి తెలుసుకొని తర్వాత మిగతా పనులు చేపడితే మంచిది అనిపిస్తుంది.
వల్లభ: స్వామి, అమ్మ మీరిద్దరూ ఒకసారి నా మాట వినండి.. గాయత్రీ పెద్దమ్మకు గండం అన్నారు కానీ ఆ పేరు పెట్టుకున్న జోగయ్య శాస్త్రిగారి మనవరాలికి గండం పట్టుకుంటుంది అని ఇంట్లో వాళ్లు గాభరా పడుతున్నారు. పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆ పిల్ల పెద్దమ్మ అయితే అయిపోదు కదా
తిలోత్తమ: రేయ్ తలా తోక లేకుండా మాట్లాడకు
అఖండ: నీ కొడుకు అర్థవంతంగానే మాట్లాడాడు తిలోత్తమ. ఇప్పుడు మీరు చేయాల్సింది అల్లా ఒక్కటే గాయత్రీని మార్చడం
తిలోత్తమ: పిల్లని మార్చాలా స్వామి. నయని కవల పిల్లల్ని కన్నప్పుడు గాయత్రీ అక్క జీవాన్ని ఎత్తుకుపోమని పురమాయించాం. అనుకున్నట్లు అయింది
వల్లభ: ఇప్పుడు మాత్రం ఎలాంటి సంబంధం లేని ఈ పిల్లని ఎత్తుకుపోమని చెప్తే విశాల్ వాళ్లకు అనుమానం రాదా..
అఖండ: నేను అన్నది గాయత్రీని మార్చమని.. గాయత్రీ అన్న పేరును మార్చి చూడమని చెప్తున్నాను. వివరంగా చెప్పాలంటే కేవలం ఆ పేరు వల్ల లేక ఆ ఇంట్లో ఈ పసి బిడ్డ ఉండటం వల్ల ఇలా జరిగిందా అని ప్రస్ఫుటం అవుతుంది. ఒకవేళ పేరు మార్చాక ఆ బిడ్డకు ఏం కాలేదు అంటే గండం అసలు సిసలైన గాయత్రీ దేవికే మళ్లిందని అర్థం చేసుకోవాలి.
మరోవైపు నయని గురువుగారి దగ్గరకు వస్తుంది. గాయత్రీ పాప రోజంతా తినకుండా ఉందని.. ఆ పాప పరిస్థితి విషమించకుండా ఉంటుందా అని అడుగుతుంది. గండ ప్రభావం వల్ల గాయత్రీ పాప విధిరాత అమలయ్యే వరకు ఓపిక పట్టాలని స్వామి అంటారు. ఆ పాపకు ఏమీ కాదు కదా అని నయని అడిగితే.. అవ్వకూడదు అని కోరుకుందాం అని అయినా జరగాల్సింది జరుగుతుందని గురువుగారు అంటారు.
నయని: గండం ఎలా వస్తుందో తెలిస్తే నా సాయశక్తులా ప్రయత్నిస్తాను.
గురువుగారు: నయని శుక్రవారం వరకు నేను ఏం చెప్పలేను. ఆ తర్వాత జరిగే పరిణామాలకు నువ్వు సాక్ష్యంగా ఉంటావు.
నయని: పరిస్థితి నా చేయి జారిపోతే ఎలా స్వామి
గురువుగారు: రక్తాన్ని కాపాడుకోవడానికి ఇంకొకరి రక్తం అవసరం పడుతుంది.
నయని: అంటే మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు స్వామి
గురువుగారు: నా మాటకు రేపు నీకు సూచన ప్రాయంగా తెలుస్తుంది. ఆ తర్వాత నీ ఆరాటమే విధి రాతను అమలయ్యేలా చేస్తుంది. వెళ్లు తల్లీ.. (చాటుగా ఉన్న విశాల్‌తో) నీ భార్య వెళ్లిపోయిందిలే విశాలా
విశాల్: స్వామి నయని కంగారు పడుతుంటే నా బిడ్డకు ఏం జరుగుతుందో అనే కంగారు కంటే తనే మా అమ్మ అని తెలుసుకుంటుందేమో అనే ఒత్తిడి పెరిగిపోతుంది.
గురువుగారు: నయని నిదానంగా ఆలోచిస్తే గాయత్రీ పాపనే మీ అమ్మ అని గుర్తు పట్టడం పెద్ద కష్టమేమీ కాదు. నువ్వే ఆలోచించు నయని కనుక ఆ బిడ్డకు వచ్చే ఆపదలు నాకెందుకు తెలీయడం లేదు అనే విషయం పసిగడితే చాలు కదా.
విశాల్: నిజమే స్వామి తనకు కానీ, తను కన్న బిడ్డలకు కానీ ఏదైనా ఆపద వస్తే నయని కనిపెట్టలేదన్న సంగతి గుర్తొస్తే నాకు అర్థమైపోతుంది.
గురువుగారు: కానీ గుర్తుకురాదు. అమ్మ కాబట్టి. ఆలోచనల్ని ఆరాటం కప్పేస్తుంది
విశాల్: నయని అడిగిన ప్రశ్నలకు మీరు సూటిగా సమాధానం చెప్పలేదు. నాకు అయినా చెప్పండి స్వామి నా రక్తం అంటే గాయత్రీ పాప.. ఇంకొకరి రక్తం అంటే రక్తదానం చేయాలా
గురువుగారు: దానం కాదు విశాలా బలి.. రేపు నీ భార్యకు తెలిస్తే నీకు చెప్తుంది. తను గుర్తించకపోతే చివరి క్షణం వరకు భయాందోళనకు గురి కావాల్సిందే.
విశాల్: స్వామి పాపకు తగ్గిపోవాలి అనుకుంటే ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి.
గురువుగారు: అంతా అమ్మవారి లీల విశాలా
హాల్‌లో విక్రాంత్, సుమన, పావనామూర్తి, ఆయన భార్య ఉంటే అక్కడికి నయని గాయత్రీ పాపను తీసుకొని వస్తుంది. ఇక నయనితో పావనామూర్తి భార్య గాయత్రీ పాపకు నిన్నటి నుంచి బాలేకపోతే ఎందుకు ఇంకా హాస్పిటల్‌కి తీసుకెళ్లకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అని మా అనుమానం అని అడుగుతుంది.
నయని: తెంచుకోలేని బంధం నెలలు బిడ్డగా ఉన్నప్పుడే ఏర్పడింది సుమన
పావనామూర్తి: కన్నకూతురు గానవికి పాలు సరిపోతాయో లేదో అని ఆలోచించకుండా ఈ పాపకు పాలు ఇచ్చావు కదమ్మా
విశాల్: మీకే గుర్తుండాలి.. మొదటి నాలుగు నెలలు గానవి సుమన దగ్గరే ఉండేది తన బిడ్డగా
విక్రాంత్: సారీ బ్రో ఆ పాపం నాదే
సుమన: పిల్ల నా దగ్గర ఉన్నందుకు పాలు సరిపోయావి అని చెప్తున్నారు విశాల్ బావగారు పాప గురించి కాకుండా మీరు పాపాల గురించి మాట్లాడకపోతే మంచిది
పావనా భార్య: విస్.. శుక్రవారం వరకు మీరు ఏదైతే అది అయిందని గాయత్రీకి అమ్మవారి తీర్థాన్నిమాత్రమే పట్టిస్తున్నారు ఇలా అయితే ఎలా
విశాల్: నయని నమ్మకం కోసం ఆగిపోయాను అత్తయ్య
వల్లభ: మీరందరూ గాయత్రీ పాప కోసమే వర్రీ అవుతున్నారు కదా నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఒకటి ఉంది. డమ్ము నువ్వు చెప్పు
డమ్మక్క: వల్లభ, వాళ్ల అమ్మ ఈ గాయత్రీ పాపకే గండం వచ్చిందేమో అన్న అనుమానంతో అఖండ స్వామిని కలిశారు. వారిచ్చిన సలహా పాటించాలి అని ఏర్పాట్లు చేస్తున్నారు.
వల్లభ: నేను నాగులాపురం పెట్టెను ఇక్కడికి పట్టుకొని వస్తాను
ఏం జరుగుతుంది అని నయని అడిగితే తిలోత్తమ నేను చెప్తా అంటుంది. అప్పుడే హాసిని చాటలో బియ్యం, కప్పులో కుంకుమ తీసుకొని వస్తుంది. ఏంటిది అని అడిగితే గాయత్రీ పాప సమస్యకు ఇది పరిష్కారమట అని హాసిని అంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇక వల్లభ నాగులాపురం పెట్టెను కర్రతో తోసుకుంటూ వస్తాడు. ఏం చేస్తున్నారో చెప్పండి అని నయని అడిగితే.. నువ్వు ఎత్తుకున్న దత్త పుత్రికకు పేరు పెడుతున్నామని తిలోత్తమ చెప్తుంది.
ఎక్కడో ఉన్న గాయత్రీ దేవికి రావాల్సిన గండం ఇక్కడున్న గాయత్రీ పాప వస్తుందేమో అని ఈ పాప పేరు మారుస్తామంటారు. దీంతో విశాల్ కోపంతో మా అమ్మ పేరు మారుస్తారా అంటు అనేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. వెంటనే హాసిని కవర్ చేస్తుంది. పెద్దత్తయ్య పేరిట ఉన్న గాయత్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు మారదు. ఆమె పేరిట ఉన్న సంస్థలు, ఆమె పేరిట ఉన్న ఏ ఆస్తుల పేర్లు మారవు అని హాసిని అంటుంది. పిల్ల పేరు బావగారు తల్లి పేరు మార్చబడదు అని హాసిని అంటుంది. ఇంతలో రెండూ ఒకటి కాదు అని డమ్మక్క అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘బ్రహ్మముడి’ సీరియల్ : కళ్యాణ్‌కు కనకం, కనకానికి కావ్య.. షాకుల మీద షాకులు