Brahmamudi September 2nd: రాజ్ మూర్ఖత్వం, కావ్య మనసుకి గాయం- ఇక ఈ భార్యాభర్తలు కలిసేది ఎప్పుడు!
కావ్య వరలక్ష్మీ వ్రతం చేసుకుంటుంది. కానీ రాజ్ మాత్రం తనని భార్యగా ఎప్పటికీ అంగీకరించేది లేదని మరోసారి తెగేసి చెప్పాడు.
Brahmamudi Serial September 2nd :వరలక్ష్మీ వ్రతం బాధ్యతలు ఇంద్రాదేవి కావ్యకి అప్పగిస్తుంది. దీంతో అపర్ణ రగిలిపోతూ ఉంటుంది. మరొక సారి కోడలి మీద ఉన్న అసహ్యాన్ని చూపిస్తుంది. ఎన్ని చేసిన ఏం చేసినా కూడా తను ఎప్పటికీ ఇంటి కోడలిగా అంగీకరించేది లేదని తన కొడుకు కూడా భార్యగా అంగీకరించడని నోటికొచ్చినట్టు మాటలు అంటుంది. అత్తా కోడళ్ళ మధ్య జరిగే సవాల్ మొత్తం రాజ్ వింటాడు. వ్రతం చేసుకో ఫలితం ఇస్తానని కావ్యతో చెప్తాడు. సీతారామయ్య రాజ్ కి భార్యని బాగా చూసుకోమని తనని కష్ట పెట్టొద్దని ఎంతగా చెప్పినా కూడ రాజ్ తన బుద్ధి మార్చుకోలేదు సరి కదా తన మనసుని మరింత గాయపరిచి అందరి ముందు అవమానించాడు.
ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కావ్య చక్కగా వరలక్ష్మీ వ్రతం పూర్తి చేసుకుంటుంది. పూజ పూర్తయిన తర్వాత పంతులు భర్త కాళ్ళకి నమస్కారం చేసి అక్షింతలు వేయించుకుని ఆశీర్వాదం తీసుకుంటే వ్రత ఫలితం దక్కుతుందని చెప్తాడు. దీంతో కావ్య రాజ్ దగ్గరకి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేయబోతుంటే వెనక్కి జరుగుతాడు. చేతిలోని అక్షింతలు కూడా నేలమీద పడేస్తాడు. దీంతో ఇంట్లో అందరూ షాక్ అవుతారు. అపర్ణ మాత్రం తన కొడుకు చేసిన పనికి గర్వంగా పొంగిపోతూ చూస్తుంది. రాజ్ చేసిన పనికి కావ్య గుండె ముక్కలవుతుంది.
Also Read: ముకుంద ప్లాన్ తిప్పికొట్టిన మధుకర్, కృష్ణకి ప్రేమ సంగతి చెప్పాలని సైకో ప్రేయసి ప్రయత్నం
నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సీతారామయ్య రాజ్ కి భార్యని బాగా చూసుకోమని తనని కష్టపెట్టొద్దని చెప్తాడు. కానీ రాజ్ మాత్రం తాతయ్య మాటలు విని మౌనంగా ఉంటాడు. ఇక ఇంద్రాదేవి కనకానికి ఫోన్ చేసి ఇంట్లో వరలక్ష్మీ వ్రతం కావ్య చేస్తుందని రమ్మని ఆహ్వానిస్తుంది. కూతురు వ్రతం చేసుకుంటుంటే కనీసం పట్టు చీర అయినా పెట్టకపోతే బాగోదని కృష్ణమూర్తితో అంటుంది. దీంతో ఎలాగోకలా డబ్బులు సర్దు బాటు చేస్తానని చెప్తాడు. కావ్య వ్రతం చేయడం ఇష్టం లేదని తను ఆశీస్సులు ఇవ్వనని అపర్ణ మరోసారి తెగేసి చెప్తుంది. కిచెన్ లో నుంచి కావ్య వస్తుండగా అపర్ణ ఎదురుపడుతుంది.
అపర్ణ: నిన్ను ఈ ఇంట్లో వాళ్ళు ఒక మనిషిగా గుర్తించి విలువ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం ఎప్పటికీ నిన్ను ఇంటి కోడలిగా అంగీకరించను, బాధ్యతలు అప్పగించను. నా కొడుకు కూడ నిన్ను భార్యగా అంగీకరించడు
కావ్య: మీరు నాతో సవాలు చేసిన ప్రతిసారీ నాకు మంచే జరుగుతుంది అత్తయ్య. నన్ను ఇంట్లోకి కోడలిగా అడుగు పెట్టనివ్వకూడదని అనుకున్నారు కానీ జరగలేదు. పుట్టింటికి సాయం చేయనివ్వకుండా అడ్డుకోవాలని అనుకున్నారు అదీ జరగలేదు. మీ అబ్బాయి నన్ను చీకట్లో బయటకి గెంటేస్తే రానని అనుకున్నారు కానీ అదీ ఆపలేకపోయారు. ఇది కూడా అంతే ఏమో మీ అబ్బాయి మీ మనసు మార్చవచ్చు
అపర్ణ: వాడు నా కొడుకు.. నాకు ఎదురు సమాధానం చెప్పినందుకే నిన్ను బయటకి గెంటేసి తలుపులు వేశాడు. నువ్వు వ్రతం చేసినా నేను నిన్ను ఆశీర్వదించను. నా కొడుకు నీ తల మీద అక్షింతలు వేయడు అంటుంది.
Also Read: వావ్ ఇది కదా సీన్ అంటే.. లాస్యని గెంటేసిన రాజ్యలక్ష్మి- ఏడిపించేసిన లక్కీ
వీళ్ళ మాటలన్నీ రాజ్ వింటూనే ఉంటాడు. కావ్య గదిలోకి వెళ్లబోతుంటే వ్రతం నువ్వు చెయ్యి ఫలితం నేను ఇస్తానని చెప్తాడు. ఏం చేస్తారని కావ్య అంటే వెయిట్ అండ్ సీ అనేసి వెళ్ళిపోతాడు. ఇక తెల్లారిన తర్వాత కావ్య ఇంట్లో వ్రతానికి సంబంధించి ఏర్పాట్లు అన్నీ ఒక్కతే చేసుకుంటూ ఉంటుంది. అమ్మవారిని ప్రతిష్టించి చక్కగా చీర కట్టి అలంకరిస్తుంది. దీని కొనసాగింపు ఈ ప్రోమో.
View this post on Instagram