అన్వేషించండి

Brahmamudi March 28th: కావ్యని బంధించిన అపర్ణ- తప్పతాగి కళావతి గదిలో దూరిన రాజ్

రాజ్, కావ్య పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కనకం పాల గ్లాసు పట్టుకుని సిగ్గు పడుతూ గదిలోకి వచ్చేసరికి కృష్ణమూర్తి బిత్తరపోతాడు. ఏమైందని అడిగేసరికి పాలు అందిస్తుంది. ఏంటిది అనేసరికి కావ్యకి ఇవాళ శోభనం జరిపిస్తున్నారంట అని చెప్తుంది. నా కూతురి బతుకు పండించుకోవాలి, దుగ్గిరాల వంశానికి వారసుడిని ఇవ్వాలని అనుకుంటుంది. అటు రాజ్ గది మొత్తం పూలతో అలంకరిస్తారు. అది చూసి రాజ్ బిక్కమొహం వేసి అటు ఇటూ తిరుగుతూ ఉంటే కావ్య పాల గ్లాసు పట్టుకుని గదిలోకి అడుగుపెడుతుంది. సిగ్గు పడుతూ ఉంటే నా పాదాలకు నమస్కారం చేస్తావా అని తెగ ఎక్స్ పెక్ట్ చేస్తాడు. కానీ కావ్య వెళ్ళి బెడ్ మీద మధ్యలో కూర్చుని స్వీట్స్ తింటుంది. ఇది శోభనం గది కాస్త సిగ్గుపడు అంటాడు. కాసేపు ఇద్దరూ సరదాగా వాదించుకుంటారు.

రాజ్-కావ్య: పొగరబోతు పోట్లగిత్త అని తిడతాడు. అయితే ఇగోతో పోట్లగిత్తకి శోభనమా. ముందు గదిలో నుంచి బయటకి వెళ్ళమని అంటాడు. సరే తాతయ్య దగ్గరకి వెళ్ళి చెప్పనా మిమ్మల్ని ఏదైనా హాస్పిటల్ లో చూపించమని చెప్తాను. ఏయ్ ఛీ ఛీ నాకు అలాంటివి ఏమి లేవు. రాజ్ మీద మీదకి వెళ్తూ ఆట పట్టిస్తుంది. ఏమో అనుకున్నా నీలోనూ ఒక రౌడిబేబీ ఉందని అంటాడు. మరి ఆలస్యం ఎందుకు లైట్ ఆపేసి పని కానిచేద్దామని రాజ్ ని బెడ్ మీదకి తోసేసి లైట్ ఆపేసరికి గట్టిగా అరుస్తాడు. దీంతో అది కల అనుకుని వామ్మో కలలోనే ఇలా ఉందంటే నిజంగా చేసినా చేస్తుందని శోభనం జరగకూడదని అనుకుంటాడు.

Also Read: పెళ్లిరోజు యష్, వేద క్యూట్ రొమాన్స్- చిత్రకి ఐలవ్యూ చెప్పిన అభిమన్యు

రుద్రాణి-రాహుల్: ఈ జంట శోభనం గదిలో కాంప్రమైజ్ అయిపోతే పెళ్లి చేసిన పర్పస్ పోతుంది. ఈ శోభనం జరగకూడదు. వాళ్ళు ఇద్దరూ ఉప్పు నిప్పులాగా ఉండాలి. అది జరగకుండా ఉంటే ఇలాంటి కోడలు వచ్చినందుకు అపర్ణ, భార్య వచ్చినందుకు రాజ్ కుమిలిపోవాలి. నీ తెలివితేటలు ఉపయోగించి రాజ్ ని రెచ్చగొట్టి శోభనం జరగకుండా చేయమని చెప్తుంది. స్వప్నని రెచ్చగొట్టి పెళ్లి జరగకుండా చేశాను అలాంటిది ఇది చేయలేనా అని మనసులో అనుకుంటాడు.

కావ్య దిగులుగా కూర్చుంటే అపర్ణ కోపంగా వస్తుంది. శోభనం పెళ్లి కూతురిలాగా రెడీ అయి ఉండటం చూసి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. పెళ్లి నీకిష్టం లేకుండానే జరిగిందని అన్నావ్ మరి ఈ వేషం, ఈ అలంకారం ఏంటని అంటుంది. అమ్మమ్మ వచ్చి రెడీ చేశారని కావ్య చెప్తుంది. మీ అబ్బాయి తరఫున ఇష్టం లేదని చెప్పిన మీరు నా అభిప్రాయం అడిగారా? నా ఇష్టాఇష్టాలు కనుక్కోరా? భర్తని మాత్రమే అడిగి భార్యని ఎందుకు వదిలేశారని కావ్య నిలదీస్తుంది. నన్ను నేను కించపరుచుకుని బతకలేను, మీ అబ్బాయికి నేనంటే ఇష్టం లేదు భార్యగా ఒప్పుకోని మనిషి దగ్గరకి అలంకరించుకుని వెళ్తే ఏం మాట్లాడతారో ఊహించగలరా? నేను ఊహించాను. ఆయనకి ఎలాగైతే ఇష్టం లేదో అలాగే నాకు ఇష్టం లేదని చెప్తుంది. మీరంతా అబద్ధాలు ఆడిన వాళ్ళు, అబద్ధాలు చెప్పే నీకు వ్యక్తిత్వం ఉంటుందా నిన్ను అసలు మనిషిలాగే గుర్తించలేదు అందుకే నిన్ను పట్టించుకోలేదని అంటుంది. కావ్య గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది. బలవంతంగా పంపించిన సరే ఆ గదిలోకి వెళ్లనని కావ్య కోపంగా చెప్పేస్తుంది.

Also read: ప్రియ మెడలో తాళి కట్టిన సంజయ్- దివ్య జీవితం నాశనం చేసేందుకు లాస్య స్కెచ్

ఇష్టం లేదని అన్నావ్ కదా భద్రంగా లోపలే ఉండమని చెప్పి అపర్ణ కావ్య గదికి గడియ పెట్టేసి వెళ్ళిపోతుంది. పెళ్లి విషయంలో మీ నిర్ణయం గౌరవించాను కానీ భార్యగా అంగీకరించలేనని రాజ్ తన తాతయ్య వాళ్ళతో అంటాడు. ఈ కార్యం చేసుకోవడం తన వల్ల కాదని చెప్పేస్తాడు. మనసులు లేని మనువు ఇంతే వదిలేయమని సీతారామయ్య అంటాడు. వాళ్ళు వెళ్లిపోగానే రాజ్ కోపంగా శోభనం లేదు తొక్కా లేదని బెడ్ మీద పూలన్నీ చిందరవందర చేసేస్తాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget