By: ABP Desam | Updated at : 28 Mar 2023 07:23 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
ఖుషి పాయసం చేసి ముందుగా యష్ కి తినిపిస్తుంది. అది టేస్ట్ చేసి పాయసం ఎలా చేయాలో తన కూతురి దగ్గర చూసి నేర్చుకోమని అంటాడు. యష్ కి పాయసం తినిపించమని చిత్ర వాళ్ళు అంటారు. తన భర్తకి భార్య తినిపించడంలో ఒక తృప్తి ఉంటుంది. భర్త కడుపు నిండితే భార్య కడుపు నిండుతుందని మాలిని అంటుంది. దీంతో వేద భర్తకి తినిపిస్తుంది. భర్త చేతి ముద్దు భార్యకి అమృతంతో సమానమని అనేసరికి యష్ కూడా పెళ్ళానికి ప్రేమగా తినిపిస్తాడు. మీ ఇద్దరూ సంతోషంగా ఉంటే మేమందరం ఎంత సంతోషంగా ఉన్నాం. భార్యాభర్తలు ఒకరికొకరు సాయం చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి. నువ్వు నీ భార్య మనసుతో చూడు. ఖుషికి అమ్మ స్థానంలో వచ్చి వేద నీకు గిఫ్ట్ ఇచ్చింది. నీ భార్య స్థానం ఇచ్చి నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నీ ఫస్ట్ మ్యారేజ్ సక్సెస్ కాలేదు అది తప్పు కాదు. కానీ రెండో మ్యారేజ్ సక్సెస్ అవకపోతే అది నీ తప్పు. మాళవిక నీ విషయంలో చేసిన తప్పు నువ్వు వేద విషయంలో చేయొద్దని మాలిని కొడుక్కి చెప్తుంది.
Also read: ప్రియ మెడలో తాళి కట్టిన సంజయ్- దివ్య జీవితం నాశనం చేసేందుకు లాస్య స్కెచ్
నా భార్యని గుండెల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇస్తున్నానని యష్ తల్లితో చెప్తాడు. చిత్ర కోపంగా అభిమన్యు దగ్గరకి వచ్చి అరుస్తుంది. నెక్లెస్ ఇచ్చి తీసుకోమని అంటాడు. మాళవిక కోసమని చెప్పి నాకు ఇస్తున్నావా అని తిడుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఫస్ట్ టైమ్ నిన్ను చూసినప్పుడే నీ అందానికి ఫ్లాట్ అయిపోయాను. నీలాంటి అమ్మాయి వసంత్ తో చీప్ బతుకు బతకడం అవసరమా. ఐ లవ్యూ.. ఐ లవ్యూ నిన్ను ఒక మహారాణిలా చూసుకుంటాను. చెప్పాల్సింది చెప్పాను ఆడగాల్సింది అడిగాను. ఛాయిస్ ఈజ్ యువర్స్ చిత్ర డార్లింగ్ అని అభిమన్యు చెప్తాడు. నీ డబ్బు హోదా ఆస్తి నా కాలి గోటితో సమానం. నీకు ఎన్ని గుండెలు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి. నిన్ను ఎంత గుడ్డిగా నమ్ముతుంది మాళవిక, అలాంటి దాన్ని మోసం చేస్తావా అని నిలదీస్తుంది.
Also Read: ధర్మరాజుకి రిషి కూల్ వార్నింగ్- రిషిధారగా ఒక్కటయ్యేందుకు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
వేద రెడీ అవుతుంటే విన్నీ ఫోన్ చేస్తాడు. ముంతాజ్ బేగం అని పిలుస్తాడు. నేను షాజహాన్ అయితే నువ్వు ముంతాజ్ బేగం అవుతావ్ కదా అంటే వేద ఆపుతావా నువ్వు కాదు నా భర్త షాజహాన్ అవుతాడని అంటుంది. నువ్వు రాంగ్ షాజహాన్ గొప్ప ప్రేమికుడు నాలాగా అని మనసులో ఉన్న మాట బయటపెట్టేస్తాడు. అనుమానపడిన వేద ఏంటి తేడాగా ఉందని అంటుంది. ఈ షాజహాన్ ముంతాజ్ ని ఆటపట్టిస్తున్నాడని అంటే ఇదంతా ఆపమని వేద అంటుంది. యష్ కి గిఫ్ట్ ఇవ్వాలని అడుగుతుంది. నేను నీకు గిఫ్ట్ పంపిస్తాను అది నువ్వు యష్ కి ఇవ్వమని చెప్తాడు. నువ్వు ట్రూ ఫ్రెండ్ అని వేద అంటే ఫ్రెండ్ కాదు కాబోయే హజ్బెండ్ ని హబ్బీనని అనుకుంటాడు. వేద తలకి సాంబ్రాణి వేసుకుంటుంటే యష్ వచ్చి తనే వేస్తాడు.
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్‌పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా
Jogi Ramesh: డర్టీ బాబు, టిష్యూ మేనిఫెస్టో - మంత్రి వ్యాఖ్యలు, చించేసి చెత్తబుట్టలో వేసి మరీ
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్మెంట్ రేపే!