Guppedanta Manasu March 27th: ధర్మరాజుకి రిషి కూల్ వార్నింగ్- రిషిధారగా ఒక్కటయ్యేందుకు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
Guppedantha Manasu March 27th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
ధర్మరాజు గదిలోకి వచ్చేసరికి వసు ఎదురుగా ఉంటుంది. షాకైన ధర్మరాజు కళ్ళు నులుముకుని మళ్ళీ చూసేసరికి వసుని రిషి కర్టన్ వెనక్కి లాగేస్తాడు. దీంతో వసు రిషి మీద పడిపోతుంది. ఇది భ్రమ నా భ్రమ అనుకుంటూ ధర్మరాజు బెడ్ మీద పడిపోతాడు. వసు మెల్లగా లేచి చూసి పడుకున్నాడని చెప్పేసరికి వసు, రిషి తప్పించుకుంటారు. కాలేజ్ లో మిస్ అయిన బండిల్స్ తీసేసుకుని వాటి ప్లేస్ లో వేరేవి పెట్టాలని రిషి అంటాడు. వెస్ట్ పేపర్స్ చేసిన బండిల్స్ అసలు వాటి స్థానంలో పెట్టి వాటిని తీసుకుని రిషి వాళ్ళు మెల్లగా జారుకుంటారు. స్పాట్ వాల్యుషన్ దగ్గరకి స్క్వాడ్ ని తీసుకుని ధర్మరాజు వస్తాడు. కాలేజ్ లో ఏవో అవకతవకలు జరిగాయని ఎవరో అజ్ఞాతవ్యక్తి కాల్ చేసి చెప్పారంట అందుకే స్క్వాడ్ వచ్చిందని అంటాడు.
Also Read: రాజ్ కి మందు తాగిచ్చి కావ్య మీదకి రెచ్చగొట్టిన రాహుల్- నిజం తెలుసుకున్న అప్పు
అందరూ రూమ్ దగ్గరకి వచ్చేసరికి గదికి సీల్ వేసి ఉండటం చూసి ధర్మరాజు షాక్ అవుతాడు. కానీ పైకి మాత్రం ఆన్సర్ షీట్స్ లేవు కదా అని అనుకుంటాడు. స్క్వాడ్ లోపలికి వెళ్ళి జగతి ఇచ్చిన లిస్ట్ ప్రకారం ఉన్నాయో లేదో చెక్ చేయడానికి ఆఫీసర్స్ లోపలికి వెళతారు. మూడు బండిల్స్ మిస్ అయ్యాయని చెప్తారు అప్పుడు రెచ్చిపోదామని అనుకుంటాడు. కానీ చెక్ చేసి వచ్చిన ఆఫీసర్స్ అంతా ఒకే అని చెప్పేసరికి ధర్మరాజు బిత్తరపోతాడు. అంతా ఒకేనా అనేసరికి ఎందుకు అంతగా రియాక్ట్ అవుతున్నారని వసు అంటుంది. ధర్మరాజు కూడ వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి మూడు బండిల్స్ చూస్తాడు. నేను తీసుకెళ్లిన బండిల్స్ ఇక్కడికి ఎలా వచ్చాయ్ అక్కడ ఉన్నవి అలాగే ఉన్నాయి కదా అని మనసులో అనుకుంటాడు. వసు, రిషి మెల్లగా నవ్వుకుంటారు. ఇబ్బంది కలిగించినందుకు సోరి చెప్పేసి ఆఫీసర్స్ వెళ్లిపోతారు. ఆయనే కొట్టేసారని ఎలా తెలుసుకున్నారని వసు రిషిని అడుగుతాడు. మీ రూమ్ లోనుంచి వస్తూ వస్తూ ధర్మరాజు షేక్ హ్యాండ్ ఇచ్చి దొరికిపోయాడని రిషి చెప్తాడు. అప్పుడే అతని చేతికి ఉన్న సబ్బు రిషి చేతికి అంటుకుంటుంది.
ధర్మరాజుని అంతా ఈజీగా వదలనని రిషి చెప్తాడు. మూడు బండిల్స్ ఎలా వచ్చాయని తెగ ఆలోచిస్తున్నారు కదా. అవి దొంగతనం చేసింది మీరే, స్క్వాడ్ ని పిలిపించింది మీరే అని తెలుసు. మీరు దాచిన మూడు బండిల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కష్టమని అనుకుంటున్నారా? మీరు ఎలా దొంగతనం చేశారో మేము కూడా మీలాగా మీ ఇంటికి వచ్చి దొంగతనం చేశామని రిషి చెప్తాడు. డీబీఎస్టీ కాలేజ్ ని బ్లేమ్ చేయించడం కోసం మీతో ఎవరో ఈ పని చేయించారు పోలీస్ కేసు పెట్టొచ్చు కానీ నేను ఆ పని చేయను. మీరు లెక్చరర్ హోదాలో ఉన్నారు. అలాంటి మీరు అరెస్ట్ అయి జైలుకి వెళ్తే మీ దగ్గర చదువుకున్న వాళ్ళ ముందు పరువు పోతుందని స్టైలిష్ గా వార్నింగ్ ఇస్తాడు. స్పాట్ వాల్యుయేషన్ స్కృటినైజర్ గా తప్పుకుంటున్నానని ధర్మరాజు వెళ్ళిపోతాడు. కాలేజ్ గౌరవాన్ని కాపాడినందుకు అందరూ రిషికి థాంక్స్ చెప్తారు.
Also Read: వేదకి ఐలవ్యూ చెప్పిన యష్- సెలెబ్రేషన్స్ లో నిప్పు పెట్టేసిన విన్నీ
రిషి, వసు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటారు. ఇద్దరం ఒకే చెట్టు నీడన ఉన్నాం చెయ్యి చాచితే అందేంత దూరంలో ఉన్నావ్ కానీ అందనంత దూరంలో ఉన్నావ్ అని ఫీల్ అవుతాడు. నిజానికి మనల్ని వేరు చేస్తుంది గదిలో గోడలు కాదు మన ఆలోచనలు, అభిప్రాయాలని వసు అంటుంది. మన మధ్య దూరాన్ని తొలగించాలని అనుకుంటున్నా మునుపటి రిషిధారలా ఉంటే బాగుండని అనుకుంటున్నా. అందుకు ఏం చేయాలి. మనల్ని వేరు చేస్తూ మన మధ్య దూరాన్ని చెరిపేయాలంటే ఏం చేయాలి. ఏం చేస్తే ఈ బాధ తొలగిపోతుందని ఎమోషనల్ అవుతాడు. వసు దగ్గరగా జరిగి రిషి చేతిని పట్టుకుని మిమ్మల్ని బాధపెడుతున్నా దాని నుంచి బయట పడాలంటే ఏం చేయాలో చెప్పమని వసు అడుగుతుంది.