News
News
వీడియోలు ఆటలు
X

BB Jodi Grand finale: ‘BB జోడీ’ గ్రాండ్ ఫినాలే - రూ.25 లక్షల ప్రైజ్ మనీ కోసం 5 జంటల మధ్య పోటీ, గెలిచేదెవరు?

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో అదిరిపోయే డ్యాన్స్ షో నిర్వహిస్తోంది స్టార్. ఆయా బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న వారిని జంటలుగా ఏర్పాటు ఈ షో రన్ చేస్తోంది. త్వరలో ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది.

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ కంటెస్టెంట్లతో స్టార్ మా నిర్వహిస్తున్న బీబీ జోడీ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. అద్భుతంగా అలరించిన 5 జంటలు గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టాయి. తాజాగా ఈ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. పలు జంటలు అదిరిపోయే డ్యాన్స్ అలరించారు. ఇక బీబీ జోడీలో గెలుపొందిన జోడీకి రూ. 25 లక్షలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు నిర్వాహకులు.

అదరిపోయే డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న జోడీలు

ఇక బీబీ జోడీ గ్రాండ్ ఫినాలేలో ఐదు జంటలు అదిరిపోయే డ్యాన్స్‌తో ట్రోపీని సొంతం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నాయి. వాసంతి-అర్జున్ కల్యాణ్, అరియానా-అవినాష్, ఆర్జే సూర్య-ఫైమా, ఆర్జే చైతు-ఆర్జే కాజల్, మెహబూబ్-శ్రీసత్య జోడీలు  టైటిల్‌ కోసం ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం.. గ్రాండ్ ఫినాలేలో ఒకరికి మంచి మరొకరు అన్నట్లుగా పోటీ పడ్డారు. వాసంతి - అర్జున్ కల్యాణ్ ఎప్పటిలాగే దుమ్మురేపే డ్యాన్స్ తో అదరగొట్టారు. ఇప్పటి వరకు బీబీ జోడీలో బెస్ట్ జోడీగా ఉన్న వీళ్లు, ఫైనల్ లోనూ అదుర్స్ అనిపించారు. ఇక మెహబూబ్-శ్రీసత్య జోడీ సైతం కళ్లు చెదిరే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వాస్తవానికి మెహబూబ్ మంచి డ్యాన్సర్. దానికి తోడు సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొట్టాడు. ఇక మెహబూబ్  డ్యాన్స్ తో పాటు ఆయన బాడీ చూసి సదా తెగ సిగ్గుపడిపోయింది. అంతేకాదు, సిక్స్ ప్యాక్ మిస్ అవుతున్నా అని చెప్పింది. వెంటనే శేఖర్ మాస్టర్ కలుగజేసుకుని, ఫర్లేదు వీడియోకాల్ చేయమని సలహా ఇస్తాడు. అదే సమయంలో గ్రూప్ కాల్ లో నన్ను కూడా యాడ్ చేయమని రాధ చెప్తుంది. దీంతో షోలో నవ్వుల పువ్వులు పూశాయి.

టైటిల్ కొట్టే జోడీ ఎవరంటే?   

అటు ఆర్జే కాజల్-ఆర్జే చైతు సైతం బాగానే డ్యాన్స్ చేశారు. చక్కటి కాన్సెప్ట్ తో అదుర్స్ అనిపించారు. ఇక అరియానా-అవినాష్ సైతం డ్యాన్స్ తో అదుర్స్ అనిపించారు. ఇక  ఆర్జే సూర్య, ఫైమా అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఓరేంజిలో డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చి, అందరినీ అబ్బుర పరిచారు. గ్రాండ్ ఫినాలే బెస్ట్ డ్యాన్స్ జోడీల్లో ఈ టీమ్ కూడా ఒకటిగా ఉంది.  ఇక తాజా ప్రోమోను బట్టి చూస్తే, అర్జున్ కల్యాణ్-వాసంతి,  ఫైమా-ఆర్జే సూర్య సూపర్ గా ఆకట్టుకున్నారు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ‘బీబీ జోడీ’ టైటిల్ అందుకోనున్నారు. అంతేకాదు. రూ.25 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తోది.   

ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్ లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గెస్టుగా పాల్గొన్నారు. ఆయన ఎంట్రీ సందర్భంగా డోంట్ స్టాప్ డ్యాన్సింగ్ అంటూ స్టెప్పులు వేసి బీబీ జోడీ సెట్స్ లో పూనకాలు లోడయ్యేలా చేశారు. షో అంతా అదిరిపోయే పంచులతో అందరినీ ఆకట్టుకున్నారు.  బీబీ జోడీ ఫినాలే ఎపిసోడ్స్ మార్చి 25, 26 నాడు రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్నాయి.   

View this post on Instagram
 
A post shared by STAR MAA (@starmaa)

Read Also: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

Published at : 20 Mar 2023 07:47 PM (IST) Tags: BB Jodi BB Jodi Promo BB Jodi Grand Finale

సంబంధిత కథనాలు

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Anasuya Wedding Anniversary : మేం పర్ఫెక్ట్ జంట కాదు కానీ - మమ్మల్ని చికాకు పెట్టాలని చేశారు, బలంగా ఉన్నాం : అనసూయ 

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Kevvu Karthik Marriage : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

Kevvu Karthik Marriage : త్వరలో  పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Guppedanta Manasu Rishi Re-Entry: జైల్లోంచి విడుదలైన రిషి - మూడేళ్లలో ఏం జరిగింది - మరింత ఇంట్రెస్టింగ్ గా 'గుప్పెడంతమనసు'

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్