News
News
వీడియోలు ఆటలు
X

Ravanasura – Sushanth: సుశాంత్‌కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్, విలన్ పాత్రలో అదుర్స్ అనిపించాడుగా!

రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ’రావణాసుర’. ఏప్రిల్ 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ మూవీలో సుశాంత్ విలన్ గా నటిస్తున్నాడు. ఆయన బర్త్ డే సందర్భంగా అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేశారు.

FOLLOW US: 
Share:

బీభత్సమైన సినీ బ్యాక్‌ గ్రౌండ్ ఉన్నా, సోలో హీరోగా రాలేకపోతున్నాడు సుశాంత్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించినా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయాడు. ఆయన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో కీలక పాత్ర చేసి ఫర్వాలేదు అనిపించాడు. ప్రస్తుతం ‘రావణాసుర’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.  

సుశాంత్ కు ‘రావణాసుర’ టీమ్ అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

‘ధమాకా’ లాంటి సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ హీరోగా ‘రావణాసుర’ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రవితేజ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సుశాంత్ అదిరిపోయే క్యారెక్టర్ చేబోతున్నారు.  ఏప్రిల్ 7, 2023న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సుశాంత్ బర్త్ డే కావడంతో తాజాగా గ్లింప్స్ విడుదల చేసింది సినిమా యూనిట్. ఇందులో సుశాంత్ పాత్రను పరిచయం చేసింది.  

View this post on Instagram
 
A post shared by Sushanth A (@iamsushanth)

అంచనాలు పెంచేసిన ‘రావణాసుర’ టీజర్

ఇక ఇప్పటికే విడుదలైన ‘రావణాసుర’ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ కట్ రిలీజ్ చేశారు. ఇందులో  వ‌రుస హ‌త్య‌ల‌కు కార‌ణ‌మైన ఓ ప‌వ‌ర్ ఫుల్ క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా ర‌వితేజ దర్శనం ఇస్తాడు.  అదిరిపోయే  బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో పాటు ఆకట్టుకునే విజువ‌ల్స్‌ తో టీజ‌ర్ వారెవ్వా అనిపించేలా ఉంది. ఈ టీజర్ సుశాంత్ విల‌న్‌గా కనిపించాడు. సుశాంత్ లుక్, స్టైల్  చాలా కొత్తగా అనిపించింది. ఈ టీజర్ సినిమాపై అంచనాలను బాగా పెంచింది. “సీత‌ను తీసుకువెళ్లాలంటే స‌ముద్రం దాటితే స‌రిపోదు, రావ‌ణుడిని కూడా గెల‌వాలి” అని ర‌వితేజ చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.  

అలరించనున్న ఐదుగురు ముద్దుగుమ్మలు

ఇక ఈ సినిమాలో  ర‌వితేజ‌ హీరోగా చేస్తుండగా, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దివ్యాంశ కౌశిక్, పూజిత పొన్నాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావు రమేష్,  మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీరోల్స్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హర్షవర్దన్ రామేశ్వర్,  భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.  

‘భోళా శంకర్’లో సుశాంత్ కీలక పాత్ర

అటు మెగాస్టార్‌ చిరంజీవి, మెహర్‌ రమేష్ కాంబోలో రూపొందుతున్న ‘భోళా శంకర్‌’ చిత్రంలో సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నాడు.  సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ సంస్థతో కలసి అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరు సరసన తమన్నా హీరోయిన్‌ గా నటిస్తోంది. మెగాస్టార్‌ చెల్లెలు క్యారెక్టర్ లో కీర్తి సురేష్ యాక్ట్ చేస్తోంది.  

View this post on Instagram
 
A post shared by Sushanth A (@iamsushanth)

Read Also: ఉగాది కానుకగా థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!

Published at : 20 Mar 2023 05:18 PM (IST) Tags: Ravanasura Team Sushanth glimpse Sushanth birthday

సంబంధిత కథనాలు

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

OTT Releases in June: ఈ వారం ఓటీటీ, థియేటర్‌లలో రిలీజయ్యే మూవీస్ ఇవే

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?