అన్వేషించండి

Prema Entha Madhuram September 19th: ఛాయాదేవికి ఆర్య వార్నింగ్ అదిరింది, అంజలిని ఇంట్లోంచి వెళ్లిపోమన్న మాన్సీ!

అను ఇంటికి రావాలంటే నువ్వు ఇంటి బయట ఉండాలి అని అంజలీకి మాన్సి వార్నింగ్ ఇవ్వడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema entha madhuram september 19th: అనుని రౌడీలు కొడుతున్న వీడియో చూస్తారు ఆర్య, జెండేలు.

జెండే: అనుకేమైనా జరగాలి ఆర్య చేతుల్లో నీ ప్రాణం పోవడం ఖాయం.

ఛాయాదేవి: అను ప్రాణాలు నా చేతిలో ఉండగా మీరు నన్ను ఏం చేయలేరు అని నాకు తెలుసు.

ఆర్య: నీకేం కావాలి?

ఛాయాదేవి: నాకేం కావాలో నీకు తెలుసు. నన్ను పెళ్లి చేసుకోవాలి. నేను చెప్పిన ప్లేస్ కి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటే నేను అనుని వెంటనే వదిలేస్తాను అని అనగా జండే, ఆర్యలు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఛాయాదేవి చెప్పిన చోటికి ఆర్య వస్తాడు అక్కడ ఛాయాదేవి పెళ్లికూతురు గెటప్ లో ఉంటుంది.

ఛాయాదేవి: నాకు తెలుసు ఆర్య, నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకునే రోజు వస్తుంది అని. నేను ఎంతో ప్రేమతో పెళ్లి చేసుకుంటాను అని అన్నాను కానీ నువ్వు వద్దన్నావు. ఆ మొండితనానికి నాకు కోపం వచ్చి అనుని కిడ్నాప్ చేసేసాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న వెంటనే అనుని వదిలేస్తాను.

Also Read: బిడ్డ పుట్టుకవెనుక గుట్టువిప్పిన పెద్దబొట్టమ్మ - పాముని గదిలో పెట్టి తాళం వేసిన సుమన!

ఆర్య: ఈ పెళ్లి జరుగుతుంది.

ఛాయాదేవి: నువ్వు మరీ ఇంతలా మారిపోతావు అని  నేను అనుకోలేదు. బయట ఎవరెవరో అను మీద నీకున్న ప్రేమ గురించి చెప్తుంటే వింటూ ఉన్నాను, కానీ ఈ రోజు నా కళ్ళారా చూశాను, నువ్వు అసలైన ప్రేమికుడివి. వెంటనే వెళ్లి పెళ్లి కొడుకు ముస్తాబులో తయారవ్వు.

ఆర్య: నేను అన్ని ఏర్పాట్ల తోనే వచ్చాను అని చెప్పి చిటుకు వేయగా వెనకనుంచి ఒక అతను పెళ్ళికొడుకుని ముస్తాబులో అక్కడికి వస్తారు. అది చూసిన ఛాయాదేవి కోపంతో రగిలిపోతుంది.

ఛాయాదేవి: ఆర్య వర్ధన్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు? అను ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి మర్చిపోయావా? 

ఆర్య: జస్ట్ షట్ అప్. అసలు ఆ వీడియోలో ఉన్నది అనునే కాదు.ఈ విషయం నాకు అప్పుడే తెలిసిన కూడా ఇక్కడ వరకు ఎందుకు వచ్చానో తెలుసా? నీకు వార్నింగ్ లు ఇస్తూ ఉండిపోతే నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా ఓర్పు మితిమీరితే ఎలా ఉంటదో చూపిద్దామని వచ్చాను.

 నీ పక్కన ఉన్న ఆ మనిషికి ఐదు మర్డర్ కేసులు, లాండ్ కబ్జా కేసులు, కిడ్నాపింగ్ కేసులు చాలానే ఉన్నాయి. నీకు సరైన జోడి అందుకే తీసుకుని వచ్చాను. నేను ముందే చెప్పాను నా జోలికి వచ్చినా సహిస్తాను కానీ నా కుటుంబం జోలికి ముఖ్యంగా నా అను జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదు. మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆర్య.

ఆ తర్వాత సీన్లో అంజలి తన ఇంట్లో ఉండగా మాన్సి అక్కడికి వస్తుంది. మాన్సి నీ చూసిన అంజలి పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది.

అంజలి: అసలు ఇక్కడ ఏం చేస్తున్నావ్?

మాన్సి: నా ఇంటికి నేను వస్తే అడగడానికి నువ్వెవరు?

అంజలి: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని బాగా వచ్చావు. ఇదే మాట ఎవరైనా ఉంటే అను. ఇది ఒకప్పటి నీ ఇల్లు ఇప్పుడు నా ఇల్లు. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అనగా మాన్సి తన ఫోన్ లో నుంచి అను ఫోటోని అంజలికి చూపిస్తుంది.

Also Read: అనుని భయపెట్టిన ఛాయాదేవి.. అను వీడియో చూసి భయంతో ఆర్య??

మాన్సి: పాపం ఈ ఇంటి పెద్ద కోడలు ది గ్రేట్ ఆర్యవర్ధన్ భార్య అయిన అను రోడ్లమీద దిక్కు దివానం లేకుండా తిరుగుతుంది. నేను వాళ్ళింటికి కూడా వెళ్లి వచ్చాను. వాళ్ళ పిల్లలు తిండి తిప్పలు లేకుండా భోజనం దొరకడమే గొప్ప అనుకున్నట్టు బతుకుతున్నారు.

అంజలి: నిజంగా ఇక్కడ ఉన్నది అను నేనా. అయినా నేను నమ్మను అను ఎంత కష్టపడినా పిల్లలకి ఏ సమస్య రాకుండా చూస్తుంది.

మాన్సి: మగదిక్కు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించు. అందరి దగ్గర నిందలు పడుతూ పిల్లల్ని ఎలా పెంచుతుందో పాపం చూస్తే నాకే జాలి వేస్తుంది.

అంజలి: నో. ఆర్య వర్ధన్ పిల్లలు అలా పెరగడానికి వీలులేదు. వాళ్ళు గొప్పగా పెరగాలి దయచేసి అను వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు.

మాన్సి: చెప్తే నాకేంటి లాభం?

అంజలి: ఏం కావాలి ఎంత ఆస్తి కావాలన్నా ఇచ్చేస్తాను, అను ఎక్కడుందో చెప్పు.

మాన్సి: నాకు కావలసింది ఆస్తి కాదు నాకు నా స్థానం కావాలి. నీరజ్ భార్య గా ఈ ఇంటి కోడలు స్థానం నాకు కావాలి. నువ్వు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే ఆ స్థానం నాకు తిరిగి వస్తుంది. నువ్వు యూఎస్ కి వెళ్ళిపో అప్పుడే అను ఇంటికి వస్తుంది. అని అనగా ఆ మాటలకి అంజలి ఆశ్చర్య పోతుంది. కొంచెం సేపు ఆలోచిస్తుంది

అంజలి: నేను వెళ్లిపోయిన తర్వాత అను ఇంటికి  వస్తుంది అన్న గ్యారెంటీ ఏంటి?

మాన్సి: గుడ్ క్వశ్చన్. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ కోడలు స్థానానికి వస్తాను. అప్పుడు అను లేకపోతే ఈ ఇంటి పెద్ద కోడలుగా ఛాయాదేవికి వస్తుంది. అది ఎలాంటిదో నాకు బాగా తెలుసు దానికన్నా అను ఉంటేనే నాకు ఈజీగా ఉంటుంది. 

అందుకే నా స్వార్థం కోసం అనుని తీసుకొని వస్తాను. ఇంకొక విషయం ఈ సంగతులు ఏవైనా బ్రో ఇన్ లా కి తెలిస్తే నా మనుషులు అను చుట్టూ ఉంటారు, అసలు ఈ లోకంలోనే లేకుండా చేస్తాను జాగ్రత్త. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా గడప దాటుతున్నప్పుడు ఆర్య, నీరజ్ లు ఎదురుపడతారు.

నీరజ్: అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని నిప్పులు పొంగేలా అరుస్తాడు నీరజ్.

మాన్సి: నా వస్తువులు ఉండిపోతే తీసుకోవడానికి వచ్చాను.

నీరజ్: ఇక్కడ నీ వస్తువులు ఏమీ లేవు ముందు బయటకు పదా అని అనగా మాన్సి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత నీరజ్ లోపలికి వచ్చి అంజలితో తనని ఎందుకు లోపలికి రానిచ్చావు అని అంటాడు. 

ఎవరికి చెప్పొద్దు అని మాన్సి బెదిరించిన బెదిరింపులు గుర్తొచ్చిన అంజలి నేను రానివ్వలేదు తనే వచ్చింది ఏదో చెత్త వాగుడు వాగి వెళ్లిపోయింది. అది వదిలేయండి మీరిద్దరూ ఫ్రెష్ అయితే నేను భోజనం ఏర్పాటు చేస్తాను అని అంటుంది అంజలి. అప్పుడు ఆర్య, నీరజ్ లు ఎవరు గదులలోకి వాళ్ళు వెళ్ళిపోతారు.

ఆ తర్వాత సీన్లో అను పిల్లలతో పడుకుని ఉండగా తనకి ఛాయదేవి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఉలిక్కిపడి లెగుస్తుంది. వెంటనే పిల్లలు అని గట్టిగా అరవడంతో పిల్లలు ఇద్దరు లేచి అనుని హద్దుకుంటారు.

అభయ్: ఏమైందమ్మా?

అను: ఏమీ లేదు నాన్న పీడకల వచ్చింది. అని అనగా అక్కి అనుకి మంచినీళ్లు ఇస్తుంది. మంచినీళ్లు తాగినాను ఒకేసారి ఏడ్చేస్తుంది.

అభయ్: నీకు బ్యాడ్ డ్రీమ్ వచ్చినట్టుందమ్మ. నేను సూపర్ హీరోగా మారి నీ డ్రీమ్ లో ఉన్న డెవిల్స్ అన్నిటిని చంపేస్తాను నువ్వు భయపడొద్దు మేమున్నాము కదా. అని అంటాడు

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Embed widget