Ammayi garu Serial Today September 24th: అమ్మాయిగారు సీరియల్: దగ్గరవుతున్న సూర్యప్రతాప్, విరూపాక్షి! బిత్తరపోయిన విజయాంబిక!
Ammayi garu Serial Today Episode Sep 24th విరూపాక్షి, సూర్య ప్రతాప్‌ని రాజు, రూపలు కలపాలి అనుకొని ప్రయత్నాలు చేయడం సూర్యప్రతాప్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode మందారం సూర్యప్రతాప్‌కి చెందిన ఫొటోలు, షీల్డ్‌లు, మెడల్స్ అన్నీ క్లీన్ చేస్తుంటే విరూపాక్షి వచ్చి సూర్యకి సేవ చేసే అదృష్టం లేదు కనీసం సూర్య వస్తువులకు అయినా సేవ చేయనీ మందారం అని తను తీసుకొని హ్యాపీగా క్లీన్ చేస్తుంది.
విజయాంబిక, దీపక్‌లు విరూపాక్షి సూర్యప్రతాప్ వస్తువులు క్లీన్ చేయడం చూస్తారు. విరూపాక్షి సూర్యప్రతాప్‌కి దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తుందని అందుకే ఇలా అన్నీ క్లీన్ చేస్తుందని ఎలాంటి పరిస్థితుల్లోనూ విరూపాక్షి మీ మామయ్యకి దగ్గర కాకూడదని అంటుంది. అత్తయ్య ఏ చిన్న అవకాశం కూడా మనకు ఇవ్వడంలేదు కదా అని దీపక్ అంటాడు. విరూపాక్షి కుర్చీ ఎక్కి సూర్యప్రతాప్ పెద్ద ఫొటోని తుడుస్తూ ఉంటుంది. విజయాంబిక అది చూసి వెంటనే మీ మామయ్య జాగింగ్ నుంచి వచ్చే టైం అయింది.. మీ మామయ్యకి బాగా నచ్చే ఫొటో ఒకటి ఉంది.. దానికి ఏమైనా అయితే మీ మామయ్య తట్టుకోలేడు.. మీ మామయ్య వచ్చే టైంకి అది విరూపాక్షి చేత పగలగొట్టి చూపిస్తే మీ మామయ్య కోపంతో చిరెత్తుకుపోతాడు.. విరూపాక్షిని దూరం పెడతాడని అంటుంది.
విరూపాక్షి దగ్గరకు బంటీ వస్తాడు. తాతయ్య గురించి మాట్లాడుతూ షీల్డ్ పట్టుకుంటే విరూపాక్షి వద్దని అవన్నీ మీ తాతయ్యకి ఇష్టమైనవి పగిలిపోతే కోప్పడతారని అంటుంది. అయితే టచ్ చేయను అని బంటీ వెళ్లిపోతాడు. ఇంతలో విజయాంబిక వెళ్లి విరూపాక్షిని కిందకి లాగేస్తుంది. టేబుల్ కూడా లాగేయడంతో సూర్యప్రతాప్‌కి ఎంత ఇష్టమైన షీల్డ్‌లు పగిలిపోతాయి. ఫొటోలు పగిలిపోతాయి. ఏం తెలీనట్లు విజయాంబిక ఏ విరూపాక్షి నువ్వేం చేశావ్ నా తమ్ముడికి ప్రాణం అయిన ఫొటోలు పాడు చేశావ్ అని రచ్చ చేస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. ఇవన్నీ నీకు ఎవరు చేయమని అన్నారు. నా తమ్ముడికి దగ్గర అవ్వాలని ఇవన్నీ చేస్తున్నావ్ అని అంటుంది. నీ తప్పుడు ప్రవర్తనతో నా తమ్ముడి మనసు ముక్కలు చేశావ్ ఇప్పుడు నా తమ్ముడి జ్ఞాపకాలు ముక్కలు చేశావ్ నీకు ఇంకేం పని లేదా అని అరుస్తుంది.
ఇంతలో సూర్యప్రతాప్ వస్తాడు. విరిగిపోయిన అతని జ్ఞాపకాలను చూసి షాక్ అయిపోతాడు. విజయాంబిక తమ్ముడితో విరూపాక్షి ఎంత ఘోరం చేసిందో చూడు తమ్ముడు అని తగిలిస్తుంది. విరూపాక్షి వణికిపోతుంది. నేను వాటిని పడేయలేదు సూర్య విజయాంబిక అబద్ధం చెప్పిందని అంటుంది. నువ్వే కదా వాటిని తుడిచావ్ నువ్వు తప్ప ఇంకెవరూ అక్కడ లేరు కదా నీకు నా తమ్ముడే బుద్ధి చెప్తాడు అని శిక్ష వేయమని అంటుంది.
సూర్యప్రతాప్ మౌనంగా ఉంటాడు. వాటిని చూస్తూ ఏ పనిలో అయినా చిన్న చిన్న పొరపాటులు జరుగుతూ ఉంటాయి.. ఇక మీద నుంచి ఇలాంటి పొరపాటులు జరగకుండా చూసుకుంటే మంచిది అని విరూపాక్షి విషయంలో మొదటి సారి చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అవుతాడు. విరూపాక్షిని ఏం అనకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రూప, రాజు, చంద్ర, సుమ, మందారం చాలా సంతోషపడితే విజయాంబిక, దీపక్ బిత్తరపోతారు. ఎవ్వరం అస్సలు ఊహించలేదు.. నీ దయతోనే ఇలా జరిగింది బాబా.. అమ్మ తప్పు చేయడం నాన్న ఏం అనకుండా వెళ్లిపోవడం మొదటి సారి జరిగింది బాబా ఇదంతా నీ దయే అని తెగ పొంగిపోతుంది.
రాజు వచ్చి అమ్మాయి గారు చాలా సంతోషంగా ఉండటంతో రాజు నాన్నకి ఎంతో ఇష్టమైన షీల్డ్ పోయిన కూడా అమ్మని ఏం అనలేదు అంటే ఇది మామూలు విషయం కాదు అని చెప్తుంది. విజయాంబిక, దీపక్‌తో ఇలా అయింది ఏంట్రా.. మీ మామయ్యలో మార్పు మొదలైందా అని అంటుంది. రాజు రూపతో పెద్దయ్యగారిలో మార్పు మొదలైందో లేదో తెలుసుకోవాలి అంటే ఓ ప్లాన్ ఉందని చెప్పి రూపకి ఐడియా చెప్తాడు.
విరూపాక్షి ఎమ్మెల్యే కావడంతో అసెంబ్లీకి బయల్దేరుతుంది. కారు ఎక్కే టైంకి టైర్ పంక్షర్ అయిపోతుంది. డ్రైవర్ టైర్ మార్చుతా అని అంటే రూప మన ప్లాన్ వేస్ట్ అయిపోతుందని అంటే నేను సెట్ చేస్తా అని రాజు వెళ్లి సతీష్ ముందే చూసుకోవాలి కదా అని అంటాడు. ఇంతలో సూర్యప్రతాప్ వస్తూ ఏమైందని అడిగితే అమ్మగారు అసెంబ్లీకి బయల్దేరుతుంటే కారు టైర్ పంక్షర్ అయింది చూసుకోవాలి కదా వీళ్లు అని అంటాడు. అమ్మగారు ఇప్పుడు ఎలా వెళ్తారు అని రాజు అంటాడు. రూప తండ్రిని చూస్తూ సీఎం గారు అసెంబ్లీకి వెళ్లకముందే ఎమ్మెల్యే వెళ్లాలి.. లేదంటే ఎమ్మెల్యేకి డిసిప్లిన్ లేదని సీఎం గారి భార్య ఆయన అండ చూసుకొని లేటుగా వచ్చిందని తోటి ఎమ్మెల్యేలు అనుకుంటారు ఇప్పుడు ఎలా రాజు అని రూప అంటుంది. మిగతా కారులు సర్వీస్‌కి వెళ్లాయి ఇప్పుడు ఎలా అని రాజు అంటాడు. మొత్తం చూసిన విజయాంబిక కొడుకుతో రాజు, రూపలు విరూపాక్షిని సూర్యప్రతాప్‌తో పాటు పంపాలని అనుకుంటున్నారని అంటుంది.
రాజు సూర్యప్రతాప్‌తో పెద్దయ్య మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు కదా అమ్మగారిని తీసుకెళ్లండి అని అంటాడు. విజయాంబిక వచ్చి ఏం మాట్లాడుతున్నావ్.. మా తమ్ముడి వైవాహిక జీవితం గురించి అందరికీ తెలుసు ప్రతిపక్షాలు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారు. ఇప్పుడు ఇద్దరినీ చూస్తే ఇంకేం ఉందా అని అంటుంది. దానికి రూప మా అమ్మ భార్య స్థానంలో వెళ్తే ఏదో అనుకుంటారు కానీ ఎమ్మెల్యే స్థానంలో వెళ్తే ఎందుకు ఏమనుకుంటారని అంటుంది.
సూర్యప్రతాప్ ఏం మాట్లాడకుండా కారు వరకు వెళ్తాడు. అందరూ సూర్యప్రతాప్ విరూపాక్షిని తీసుకెళ్లడని అనుకుంటారు. కానీ సూర్యప్రతాప్ ఆగి రాజు వచ్చి కారు ఎక్కమని చెప్పు అని అంటాడు. రూప, రాజు, విరూపాక్షి ఆనందానికి అవధులు ఉండవు.. సంతోషంగా విరూపాక్షి వెళ్తుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















