Ammayi garu Serial Today September 23rd: అమ్మాయిగారు సీరియల్: కోమాలో రాఘవ! విజయాంబిక మీద కేసు పెట్టిన విరూపాక్షి! సూర్య నిర్ణయమేంటి?
Ammayi garu Serial Today Episode September 23rd రాఘవ కోమాలోకి వెళ్లిపోవడం స్పెషల్ సెక్యూరిటీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలని సూర్యప్రతాప్ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాఘవ సూర్యప్రతాప్‌తో నిజం చెప్తూ ఒక్కసారిగా ఆగిపోతాడు. విరూపాక్షి ఏడుస్తూ రాఘవ ప్లీజ్ రాఘవ నిజం చెప్పు నా మానమర్యాదలు నా జీవితం పసుపుకుంకుమలు అన్నీ నీ చేతిలో ఉన్నాయని అంటుంది. రాఘవ ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో రాజు వాళ్ల డాక్టర్‌ని పిలుస్తారు.
రాఘవకి ఏమైందని అందరూ కంగారు పడతారు. దూరం నుంచి చూస్తే రాఘవ చనిపోతే బెటర్ అని విజయాంబిక, దీపక్ అనుకుంటారు. డాక్టర్ రాఘవని చూసి రాఘవ కోమాలోకి వెళ్లిపోయాడని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మళ్లీ ఎప్పుడు నార్మల్ అవుతాడు అని రాజు అంటే చెప్పలేం సార్ ట్రీట్మెంట్ బట్టి ఒక్కరోజు అయినా నెల అయినా సంవత్సరం అయినా పట్టొచ్చని అంటారు. సూర్యప్రతాప్ మంచి వైద్యం అందివ్వమని అంటారు. రాజు సూర్యప్రతాప్‌తో రాఘవ ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదంలోనే ఉంటున్నారు. దయచేసి రాఘవకి స్పెషల్ సెక్యూరిటీ పెట్టించమని అంటాడు.
సూర్యప్రతాప్ సరే అని స్పెషల్ సెక్యూరిటీ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తాడు. విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్ వెళ్లిపోతాడు. చంద్ర విరూపాక్షితో క్షమించండి వదిన.. మీరు తప్పు చేయరు అని తెలిసినా మేం చెప్పలేకపోయాం ఈ రోజు నుంచి మీ వైపు ఉంటాం.. అన్నయ్యని మిమల్ని ఒక్కటి చేస్తాం అని అంటాడు. రూప చాలా బాధ పడుతుంది. దేవుడా నీకు మనసే లేదు.. మా అమ్మానాన్నలు కలవడం నీకు ఇష్టం లేదా అని అనుకుంటుంది.
విజయాంబిక, దీపక్‌లు గదిలో తెగ ఆలోచించేస్తారు. జస్ట్ మిస్ లేకపోతే మా పని అయిపోయేది అసలు సూర్యప్రతాప్ హాస్పిటల్‌కి రావడానికి రాజు, రూపలు చేసిన ఆ యాక్టింగ్ దానంతటకి కోమలి కారణం అని కోమలిని తిడుతుంది. పెళ్లి రోజు అంటే ఇష్టం లేని నా తమ్ముడికి పెళ్లి రోజు జరిపేలా చేశారు.. ఇప్పుడు అదే అలుసుగా రాజు, రూపలు మా తమ్ముడి మనసు మార్చేశారు.. ఈ సారి గండం తప్పింది అని ప్రతీ సారి ఇలాగే జరగదు.. ఈ సారి నుంచి నేను చెప్పిందే నువ్వు చేయాలి అని చెప్తుంది. నాకు ఏమైనా అయితే మీరు చూసుకోవాలి ఎందుకంటే నేను దొరికితే మన ముగ్గురం దొరికినట్లు కాదు మీ ఇద్దరు మాత్రమే దొరికినట్లే నేను దొరికిపోతే మీ గురించి చెప్పేస్తా.. గుర్తుంచుకోండి అని కోమలి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఇదేంటి ఇలా అడ్డం తిరుగుతుంది అని దీపక్ అంటాడు. వీలైనంత త్వరగా మన పని పూర్తి చేసుకొని దీని సంగతి చెప్తా అని విజయాంబిక అంటుంది.
మరోవైపు ఇంటికి పోలీసులు వస్తారు. ఇన్‌స్పెక్టర్ చంద్రతో మీ ఇంట్లో ఉండే విజయాంబిక గారి మీద అటమ్‌టూ మర్డర్ కేసు కంప్లైంట్ అయింది సార్ అని అంటాడు. విజయాంబిక వచ్చి ఏంటి కామన్ మెన్ ఇంటికి వచ్చినట్లు నట్టింటికి వచ్చేశారు.. అసలు నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో వాళ్లని తీసుకురండి అని అంటుంది. నేనే కంప్లైంట్ ఇచ్చాను అని విరూపాక్షి ఎంట్రీ ఇస్తుంది. విరూపాక్షి పోలీసులతో విజయాంబిక అనే ఈవిడ రాఘవని చంపాలి అని ప్రయత్నించింది బాధితుడు కోమాలో ఉన్నాడు అతన్ని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన ఈమెను అరెస్ట్ చేయండి అంటుంది.
విజయాంబిక పోలీసులతో నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఈవిడ ఎవరు.. ఈవిడకు ఆ బాధితుడికి సంబంధం ఏంటి.. అసలు ఏహక్కుతో కంప్లైంట్ ఇచ్చారు అని అడుగుతుంది. బంధం బంధుత్వం అవసరం లేదు.. మానవత్వంతో ఓ ప్రజాప్రతినిధిగా కంప్లైంట్ ఇచ్చా అని విరూపాక్షి అంటే అవన్నీ ఎందుకు నీకు ఆ రాఘవకి సంబంధం ఉందని ఒప్పుకో అప్పుడు నేను తప్పు చేశానని ఒప్పుకుంటా.. ఇన్‌స్పెక్టర్ గారు ఆ రాఘవ, ఈ విరూపాక్షి కలిసి నా తమ్ముడిని మానసికంగా చంపేశారు.. ఈ రోజు ఏకంగా నా తమ్ముడిని చంపడానికే ప్రయత్నించారు.. అతన్ని అడ్డుకునే ప్రయత్నంలో అతని తలకు గాయం అయిందని అంటుంది. తప్పుగా మాట్లాడకు విజయాంబిక అని విరూపాక్షి అరుస్తుంది.
సూర్యప్రతాప్ వచ్చి ఏమైందని అడుగుతాడు. పోలీసులు విషయం చెప్పగానే.. అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనికి నయం అయ్యేవరకు మా పర్సనల్ మేటర్‌ని పబ్లిక్‌లో పెట్టొద్దు మీరు ఇన్వాల్వ్ అవ్వొద్దు అని సూర్యప్రతాప్ పోలీసుల్ని పంపేస్తాడు. సూర్యప్రతాప్ రాత్రి జరిగింది అంతా గుర్తు చేసుకొని ఆలోచిస్తాడు. విరూపాక్షి గురించి ఆలోచిస్తాడు. బాల్కానీలో సూర్యప్రతాప్ తిరుగుతుంటే వాటర్ బాటిల్‌తో వచ్చిన విరూపాక్షి తమ్ముడిని చూసి విరూపాక్షి ఆ తప్పు చేసిందా లేదా అని ఆలోచిస్తున్నాడా.. తనేం ఆలోచించినా నా కొంప మునిగిపోతుందని కొడుకుని తీసుకొచ్చి చూపిస్తుంది. నిద్ర పోకుండా ఆలోచిస్తున్నాడు అంటే విరూపాక్షి, రాఘవల మీద పాజిటివ్ థింకింగ్ వచ్చిందా అని అంటే కచ్చితంగా అమ్మ అందుకే హాస్పిటల్‌లో సెక్యూరిటీ పెట్టి మరీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడని అంటాడు. రాఘవని చంపేయాలిరా లేదంటే మనం ఈ లోకంలో లేకుండా అయిపోతాం అని విజయాంబిక అంటుంది. త్వరలోనే వాడిని చంపేస్తా అని దీపక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















