Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 23rd: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి ప్రాణాల కోసం ఇద్దరి భార్యల కఠిన దీక్ష.. అమ్మవారి దయ ఉన్నట్టేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode September 23rd విహారి కోసం సహస్ర కఠిన దీక్ష ప్రారంభించడం దాన్ని లక్ష్మీ పూర్తి చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారికి కరెంట్ షాక్ కొట్టడంతో విహారి పరిస్థితి కష్టమని.. విహారి బాడీ ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ కావడం లేదని డాక్టర్ చెప్తారు. అందరూ ఏడుస్తారు. చారుకేశవ ఊరి వాళ్లతో ఒకసారి చెప్దాం ఏదైనా ఊరట వస్తుందేమో చెప్తారని అంటాడు. హాస్పిటల్ బయట ఉన్న ఊరి వారి దగ్గరకు వెళ్తాడు.
వీర్రాజు ఏదో ఉద్దరిస్తాడని అంటే ఇలా పుటుక్కున పడిపోయాడేంటి అని అంటాడు. నీ దిష్టే నా మేనల్లుడికి తగిలిందని చారుకేశవ అంటాడు. దిష్టికే పడిపోయిన వాడు ఊరినే బాగు చేస్తాడు అని వీర్రాజు అంటాడు. ఎక్కువ మాట్లాడొద్దు అని పద్మాక్షి అంటే ఇదంతా నా మాట కాదు పద్మాక్షి ఊరి మాట అని వీర్రాజు అంటాడు. దానికి లక్ష్మీ ఇంత మంది ఉన్నారు కదా మీ ఊరు మారిందా.. మీ కోసం వచ్చిన ఆయనను మీరు ఇన్ని మాటలు అంటారా.. ఇది కచ్చితంగా మీ ఊరి వాళ్ల పనే అని లక్ష్మీ అంటుంది. వీర్రాజుతో పాటు లక్ష్మీ వాళ్ల ఫ్యామిలీ కూడా షాక్ అయిపోతుంది. రైసు మిల్లు దగ్గర ఎవరో వైర్లు రివర్స్‌లో కనెక్ట్ చేశారు ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను. వచ్చి చెప్పేలోపు ఇదంతా జరిగిపోయింది. విహారి గారి తల్లికి అన్యాయం జరిగింది అని తెలిసినా కూడదా మీకు సాయం చేయడానికి వస్తే వాళ్లకి మీరు ఇచ్చిన మర్యాద ఇదేనా అని లక్ష్మీ అంటుంది.
పోచమ్మ విహారి కుటుంబంతో ఇదంతా గండం ప్రభావం.. విహారి బాబు కోసం ఊరు ఊరంతా అమ్మవారికి శరణు వేడుకుందాం.. అని అంటుంది. ఊరి జనం కూడా అందరం దీక్ష ఉండి అందరం కలిసి అమ్మవారికి పూజలు చేద్దాం అని అనుకుంటారు. పోచమ్మ సహస్ర చేత ఉపవాసం ఉంచి నిష్టగా మోకాల మీద అమ్మవారి దగ్గరకు నడిపిద్దాం అంటుంది. బావ కోసం నేను ఏమైనా చేస్తా అని సహస్ర అంటుంది. పద్మాక్షి ఫ్యామిలీని తీసుకొని ఊరి జనంతో పాటు అమ్మవారి గుడికి తీసుకెళ్తుంది. చారుకేశవ, పద్మాక్షిని హాస్పిటల్‌లో ఉంచుతుంది.
సహస్రకు పసుపు బట్టలు కడతారు. సహస్ర అందరితో మీరు బాధ పడకండి.. నా బావని నేను కాపాడుకుంటాను అని అంటుంది. ఇది చాలా కష్టమైన పని అమ్మ.. నువ్వు గుడి మొత్తం మోకాలి మీద దీపం పట్టుకొని నడిచి నిప్పుల మీద నడిచి అమ్మవారికి పసుపుకుంకుమ సమర్పిస్తే నీ భర్తని అమ్మవారు కాపాడుతుందని పోచమ్మ చెప్తుంది. సహస్ర దీక్ష ప్రారంభిస్తుంది. అఖండ దీపంతో మోకాలి మీద నడుస్తుంది. సగం దూరం నడిచి సహస్ర పడిపోతుంది. తర్వాత సహస్ర లేచి అత్తయ్య నన్ను క్షమించండి అని ఏడుస్తుంది. ఇక అందరూ సహస్రకు బాలేదని తీసుకెళ్తారు.
సహస్ర అమ్మవారికి పూజ చేయలేకపోయింది నా కొడుకు పరిస్థితి ఏంటి అని యమున ఏడుస్తుంది. అందరూ అమ్మవారికి మొక్కుకుందామని వెళ్తారు. ఇంతలో లక్ష్మీ సహస్ర వదిలేసిన దీపం పట్టుకొని సహస్ర ఎక్కడ దీక్ష వదిలేస్తుందో అక్కడి నుంచి లక్ష్మీ దీక్ష మొదలు పెడుతుంది. లక్ష్మీ మోకాలి మీద నడుస్తూ అమ్మవారి దగ్గరకు చేరుకుంటుంది. యమున ఏడుస్తూ నా విహారిని కాపాడుకునే మార్గం చూపించమని వేడుకుంటుంది. ఇంతలో లక్ష్మీ మోకాలి మీద అఖండ దీపం తీసుకురావడం చూస్తుంది. అమ్మా దయతలిచావా తల్లీ అని దండం పెట్టుకుంటుంది. అందరూ మొక్కుతారు.
లక్ష్మీ అఖండ దీపం పెడుతుంది. తర్వాత నిప్పుల గుండం తొక్కుతుంది. పోచమ్మ లక్ష్మీకి బొట్టు పెడుతుంది. ఎవరూ పూజ చేయలేని అత్యంత కఠినం అయిన అమ్మవారి దీక్షని పూర్తి చేశావ్ నువ్వు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అమ్మా అని పోచమ్మ అంటుంది. విహారిలో మార్పు వస్తుంది. నర్సు వచ్చి పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారని అంటారు. ఇక లక్ష్మీ హాస్పిటల్‌కి కుంకుమ తీసుకొని వచ్చి విహారికి పెడుతుంది. ఇంతలో అక్కడికి సహస్ర వాళ్లు వస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















