Ammayi garu Serial Today September 20th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్ ఫ్యామిలీని కాపాడిన రాజు.. నింద రాజు మీద వేసేసిన విజయాంబిక!
Ammayi garu Today Episode రాజు బాంబ్ బ్లాస్ట్ నుంచి సూర్యప్రతాప్ ఫ్యామిలీని కాపాడితే విజయాంబిక రాజే ఆ బ్లాస్ట్ ప్లాన్ చేశాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode జీవన్ రౌడీలను తీసుకొని సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ మత్తు మందు కలిపిస పాలు తాగి నిద్రలో ఉంటారు. రూప మాత్రం రాజుతో మాట్లాడుతూ ఉంటుంది. సౌండ్ రావడంతో చూట్టానికి వెళ్తుంది. జీవన్ మరో ఇద్దరు రౌడీలు సూర్య ప్రతాప్ గదికి వెళ్తారు. జీవన్ బాంబ్ తీసి టైమర్ ఫిక్స్ చేసి సూర్య ప్రతాప్ గదిలో పెడతాడు. రూప డోర్ తీయడం చూసి వెళ్తుంది. వాళ్లని చూసి ఎవరు మీరు ఎక్కడేం చేస్తున్నారని అరుస్తుంది. ఫోన్ లైన్‌లో ఉన్న రాజు కంగారుగా ఏమైందని కంగారుగా వస్తుంటాడు.
రూపని జీవన్ నోరు నొక్కేసి కిందకి తీసుకెళ్లిపోతాడు. రూప ఫోన్ బయట పడిపోతుంది. జీవన్ రూపని ఓ గదిలో పెట్టేసి తలుపు గడియ పెట్టేస్తాడు. జీవన్ వాళ్ల పారిపోతారు. ఇంతలో రాజు వస్తాడు. సెక్యూరిటీని లేపినా లేవరు. రాజు రౌడీ ముఖానికి ఉన్న మాస్క్ తీయబోతే రౌడీలు పారిపోతారు. విజయాంబిక, దీపక్ ఇద్దరూ బాంబ్ పేలుతుందో పేలదో అని టెన్షన్ పడతారు. రాజు ఇంట్లోకి వెళ్లి రూప ఉన్న గది తలుపులు తీస్తాడు. రూప రాజుతో తన తండ్రి గదిలో ఎవరో బాంబ్ పెట్టారని చెప్తుంది. రాజు రూప ఇద్దరూ సూర్య ప్రతాప్ గదికి పరుగులు తీస్తారు. సూర్యప్రతాప్‌ని ఎంత లేపినా లేవడు. ఇక రాజు, రూప గది మొత్తం బాంబు కోసం వెతుకుతారు. చివరకు రాజు బాంబ్‌ని కనిపెట్టి తీసుకొని కిందకి పరుగులు పెడతాడు. ఇంతలో రూప తన తండ్రిని లేపడానికి ప్రయత్నిస్తుంది. చివరకు సూర్య ప్రతాప్ లేస్తాడు. ఏమైందని రూపని అడిగితే మన ఇంట్లో ఎవరో బాంబ్ పెట్టారని చెప్తుంది. మరోవైపు రాజు బయటకు వెళ్లి బాంబ్ విసిరేస్తాడు. ఇంట్లో అందరికీ మెలకువ వస్తుంది. అందరూ బయటకు పరుగులు తీస్తారు. రాజు వచ్చి తమని కాపాడాడని రూప చెప్తుంది.
ఇంత సెక్యూరిటీ ఉన్నా ఎవరు ఎలా వచ్చారని అడుగుతాడు. ఇంటిళ్ల పాది ఎలా నిద్ర మత్తులో ఉన్నారని అడుగుతాడు. రాజు రూప జరిగింది చెప్తారు. సూర్య ప్రతాప్ కూడా రాజుకి థ్యాంక్స్ చెప్తాడు. ఇంతలో విజయాంబిక వచ్చి ఎవరో వచ్చి మన ఇంట్లోకి వచ్చి బాంబ్ పెట్టారా. అది రాజు వచ్చే వరకు పేలకుండా ఉందా అసలు ఇదంతా రాజు ప్లానే అని అంటుంది. పని మనిషి సాయంతో ఇంట్లో అందరూ మత్తులోకి వెళ్లేలా చేశాడని రూప ఒక్కర్తినే మెలకువలో ఉండేలా చేసి నీ దగ్గర తన గురించి డప్పు కొట్టేలా చేశాడని అంటుంది. అదంతా అబద్ధం అని రూప అంటుంది. రౌడీలను తాను చూశానని వాళ్లు తనని గదిలో బంధించారని చెప్తుంది. ఇక విజయాంబిక తన మాటలతో సూర్య ప్రతాప్‌ని రాజుదే తప్పు అన్నట్లు నమ్మేలా చేస్తుంది.
తానేం తప్పు చేయలేదని విజయాంబిక చెప్పిందంతా అబద్దం అని రాజు చెప్తాడు. రూప కూడా జరిగింది చెప్తుంది. సుమ, చంద్రలు కూడా రూప చెప్పిందే నిజం అయింటుందని అంటారు. సూర్య ప్రతాప్ కూడా రాజుదే తప్పు అయింటుందని అంటాడు. రాజు చేయలేదు అనడానికి ఆధారాలు ఉన్నాయా అని రూపని అడుగుతాడు. రూప ఆలోచించి రాజు చేయలేదని నిరూపిస్తాను అని చెప్పి ల్యాప్‌టాప్ తీసుకొస్తుంది. అందులో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తుంది. జీవన్‌తో పాటు మరో ఇద్దరు రౌడీలు రాజును నట్టేసి పారిపోవడం రూప చూపిస్తుంది. విజయాంబిక మాత్రం రాజు మీదే నేరం నెట్టుతుంది. ఏం జరిగిందో నేను ఎంక్వైరీ చేయిస్తాను అని సూర్య ప్రతాప్ చెప్తాడు దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కావేరితో నిజం చెప్పిన శ్రీధర్, దాసుతో పారు.. దీపని పొడిచేసిన నర్శింహ!