అన్వేషించండి

Karthika Deepam 2 Serial September 20th: కార్తీకదీపం 2 సీరియల్: కావేరితో నిజం చెప్పిన శ్రీధర్, దాసుతో పారు.. దీపని పొడిచేసిన నర్శింహ!

Karthika Deepam 2 Serial Episode శ్రీధర్ రెండో పెళ్లి గురించి పారు దాసుతో చెప్పి కాశీ పెళ్లి చేయొద్దని చెప్పడం, శ్రీధర్ కాశీ తన మేనల్లుడని కావేరితో చెప్పడంతొ ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode శ్రీధర్ మందు తాగుతూ పారిజాతం మనవడే కాశి అని గుర్తు చేసుకొని అంతా నా దరిద్రమని అనుకుంటాడు. హ్యాపీగా వైజాగ్‌లో ఉండాల్సిన కావేరి, స్వప్నలు హైదరాబాద్ రావడం ఏంటో, స్వప్న లవ్ చేసిన కాశీ దాసు కొడుకు అవ్వడం ఏంటో అంతా నా ఖర్మ అని అనుకుంటాడు.  

శ్రీధర్: నా కూతురు సొంత అన్నయ్య అని తెలియకుండానే కార్తీక్‌తో స్నేహం చేయడం ఏంటో.. నా కొడుకు జ్యోత్స్నని పెళ్లి చేసుకోకుండా దీప చుట్టూ తిరగడం ఏంటో.. ఆ దీప మొగుడు నా కొడుకుని పొడిచేయడం ఏంటి. దీప నా ఇంట్లో నా కొడుకుకి సేవలు చేస్తుంటే నేను ఏం సంబంధం లేకుండా ఇక్కడుండటం ఏంటి.
కావేరి: బేబీ నేను ఓ ప్రశ్న అడుగుతా సమాధానం చెప్పు.
శ్రీధర్: కాశీ నీకు నచ్చకపోవడానికి కారణం ఏంటి ఇదేగా నీ ప్రశ్న.
కావేరి: అవును బేబీ. స్వప్నకి చెప్పినట్లు కాకుండా సరైన కారణం ఒక్కటి చెప్పండి.
శ్రీధర్: నువ్వు తట్టుకోలేవు బేబీ అందుకే చెప్పడం లేదు. 
కావేరి: తనకు ఆస్తి లేదు అనేదే కారణం కదా కానీ అతను ప్రయోజకుడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక మన ఆస్తి అంతా స్వప్నకే కదా. ఇంకేంటి బేబీ.
శ్రీధర్: కాంచన చచ్చిపోవడం నీకు ఒకేనా.  
కావేరి: అక్కకు ఈ పెళ్లికి సంబంధం ఏంటి బేబీ.
శ్రీధర్: నా కుటుంబం రెండు ముక్కలైపోయి అందరూ నా మీద ఉమ్మేయడం నీకు ఓకేనా.
కావేరి: ఏమైంది బేబీ.
శ్రీధర్: స్వప్న ప్రేమించింది నా మేనల్లుడినే. (ఎలా మేనల్లుడు అవుతాడో వరసలు చెప్తాడు) స్వప్నకి యాక్సిడెంట్ అయితే ఒకరు కాపాడారు చూడు ఆ కార్తీక్ ఎవరో కాదు నా కొడుకు. (కావేరి షాక్ అయిపోతుంది) రెండింటికే కూల బడిపోతే ఎలా బేబీ ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయ్. 
కావేరి: స్వప్న ఎవరో కార్తీక్‌కి తెలుసా.
శ్రీధర్: కార్తీక్ తెలీదు.. దీపకు తెలుసు. 
కావేరి: ఈ పెళ్లి అయితే అందరికీ మన గురించి తెలుస్తుంది.
శ్రీధర్: నేను ఈ పెళ్లి ఎందుకు వద్దు అన్నానో ఇప్పటికైనా తెలిసిందా. కాంచనకు ఉన్న మెంటల్ కండీషన్‌కు వి
విషయం తెలిస్తే కచ్చితంగా చనిపోతుంది. నా కొడుకు నన్ను క్షమించడు. మా మామయ్య బతకనివ్వరు. పోనీ ఇవన్నీ తట్టుకుంటే నా తండ్రి ఇలాంటి వాడా అని స్వప్న నిజం తెలిస్తే నన్ను అసహ్యించుకుంటుంది. ఒక భార్యని పోగొట్టుకొని ఇద్దరి పిల్లలతో ఛీ అనిపించుకొని ఏ తప్పు చేయని నిన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టి నేను అందరి చేత ఛీ అనిపించుకొనే ఈ పెళ్లి చేయడం అవసరమా కావేరి. అందుకే నాకు ఓ ఐడియా వచ్చింది. ఎల్లుండి స్వప్నకి శ్రీకాంత్‌కి పెళ్లి అయిపోయిన తర్వాత మీ ముగ్గురు వైజాగ్ వెళ్లిపోండి. ఇది వరకు ఎలా వచ్చానో అలా క్యాంపుల పేరుతో వస్తుంటాను. ఏదో ఒకటి చేసి స్వప్న మనసు మార్చు. ఏం జరిగినా ఈ నిజం బయట పడటానికి వీల్లేదు.
కావేరి: అలాగే అండీ.

దీప కార్తీక్‌కి కాఫీ ఇస్తే కార్తీక్ స్వప్న, కాశీల గురించి టెన్షన్‌గా ఉందని చెప్తాడు. ఇద్దరూ తన మీదే ఆశలు పెట్టుకున్నారని కాశీని స్వప్న తన చెల్లి అని ఎలా చెప్పాలని అనుకుంటాడు. దీప మాత్రం కాంచనతో నిజం చెప్పమని కార్తీక్‌తో చెప్తుంది. లేదంటే కాశీ, స్వప్నలు పారిపోయి పెళ్లి చేసుకొనే ప్రమాదం ఉందని అంటుంది. నా స్థానంలో నువ్వు ఉంటే ఏం చేసేదానివి అని కార్తీక్ అడిగితే దానికి దీప కాశీ, స్వప్నలకు ఏ గుడిలోనో పెళ్లి చేసి అందరితో నిజం చెప్పేసేదాన్ని అని అంటుంది. ఏం జరిగినా నేనే నష్టపోతానని కార్తీక్ అంటాడు. మరోవైపు పారిజాతం, జ్యోత్స్నలు దాసుకి కలుస్తారు. కాశీకి స్వప్నతో పెళ్లి వద్దని పారిజాతం చెప్తుంది.

దాసు: కుదరదమ్మా నేను ఆ ఆమ్మాయికి మాట ఇచ్చా. ఆమె తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఈ పెళ్లి చేస్తా.
జ్యోత్స్న: ఆమె పేరెంట్స్ ఎవరో తెలీక మాట ఇచ్చినట్లు ఉన్నాడు. ముందు అసలు విషయం చెప్పు.
పారిజాతం: ఓరేయ్ దాసు ప్రేమించింది ఎవరో కాదు మీ శ్రీధర్ బావ కూతురు.
దాసు: అవునా ఇంత శుభవార్త ఏడుస్తూ చెప్తావ్ ఏంటమ్మా అమ్మాయి ఎవరో అనుకున్నా కానీ నా మేనకోడలేనా. అవును బావకి ఒక్క కొడుకే అనుకున్నాకూతురు ఉందని నాతో ఎందుకు చెప్పలేదమ్మా.
పారిజాతం: మాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆ పిల్ల శ్రీధర్ కూతురే కానీ కాంచన కూతురు కాదు. ఆ పిల్ల శ్రీధర్ రెండో భార్య కూతురు. 
దాసు: ఏంటి శ్రీధర్ బావ రెండో పెళ్లి చేసుకున్నాడా.
పారిజాతం: అవునురా మాకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసింది. కానీ కాశీ గాడికి వాడి మామ ఎవరో తెలీదు ఎవరో అనుకుంటున్నాడు. నీకు ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఇంక  ఈ పెళ్లి జరగదని చెప్పేయ్.
దాసు: బావ తప్పు చేస్తే పిల్లలకు శిక్ష ఏంటమ్మా.
పారిజాతం: అది అక్రమ సంతానంరా.
దాసు: రెండో పెళ్లి అని మీరే అంటున్నారు కదా.
పారిజాతం: ఎవరికీ తెలీకుండా దొంగ చాటుగా పెళ్లి చేసుకొని దొంగ చాటుగా కాపురం చేసి పిల్లని కంటే అది అక్రమ సంతానం కాదా. అలాంటి దాన్ని నీ కొడుకుకు ఎలా ఇచ్చి పెళ్లి చేస్తావురా. 
దాసు: పని మనిషి మెడలో తాళి కట్టిన వాడిని నాకు ఇలాంటి అభ్యంతరాలు లేవు.
పారిజాతం: నీకు లేవు నా మొగుడు శివనారాయణకి ఉన్నాయి. ఆ పిల్లకి కాశీకి పెళ్లి జరిగితే శ్రీధర్ రెండో పెళ్లి గురించి బయట పడుతుంది. ఈ విషయం పెద్దాయనకు తెలిస్తే పరువు పరువు అనుకొనే కార్తీక్‌తో జ్యోత్స్నతో పెళ్లికి ఒప్పుకోరు. నీ కూతురి కోసం నువ్వు ఇది కూడా చేయకపోతే ఎలారా.
దాసు: తండ్రి అన్న గౌరవం జ్యోత్స్నకు లేదు కదమ్మా. నేనే నాన్న అని తెలుసు కానీ ప్రేమగా ఒక్కసారి నాన్న అని పిలిచిందా.
పారిజాతం: ఈ కొత్త పిలుపులు అంత మంచిది కాదురా దాన్ని సుమిత్ర కూతురిగానే ఉంచు.
దాసు: నేనేమీ పిలుసు కోసం ఆరాట పడటం లేదు. అయినా పిలుపు గొంతు నుంచి కాదు మనసు నుంచి రావాలి.
జ్యోత్స్న: అందుకే నేను ఇక్కడికి రాను అన్నాను.
పారిజాతం: పెళ్లి వాయిదా వేద్దామని కాశీతో చెప్పరా. నువ్వు ఈ నిజం ఎవరికీ చెప్పకు కాశీకి కూడా.
దాసు: సరే అమ్మా. 

దీప నడుచుకుంటూ వెళ్తుంటే ముసుగు వేసుకొని నర్శింహ దీప వెంట పడతాడు. తన వెంట తెచ్చుకున్న చాకుతో వెనకనుంచి దీపని పొడిచేస్తాడు. దీప కింద పడిపోతే చచ్చిపోయిందని గంతులు వేస్తాడు. తీరా చూస్తే అదంతా నర్శింహ ఊహ. ఈసారి దీప నిజంగానే వస్తుంది. నర్శింహ చాకు పట్టుకొని చంపడానికి వెళ్తే దీప నర్శింహని అడ్డుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సూర్య ఆపరేషన్‌కి డబ్బు ఇచ్చిన మహాలక్ష్మి.. దట్ ఈజ్ సీత!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Telangana News: మన్మోహన్ సింగ్‌‌కు తెలంగాణ శాసనసభ సంతాపం, భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ డిమాండ్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
TDP Mangalagiri Record: నారా లోకేష్ ఎఫెక్ట్ - టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
Tigrer Tension: 21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
21 రోజుల్లో 300 కి.మీ - 3 రాష్ట్రాలను హడలెత్తించిన పులిని బంధించిన అధికారులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
DA Hike News: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! - ప్రభుత్వం కరవు భత్యాన్ని ఎంత పెంచుతుందంటే?
Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Embed widget