అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today September 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సూర్య ఆపరేషన్‌కి డబ్బు ఇచ్చిన మహాలక్ష్మి.. దట్ ఈజ్ సీత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీని వీడియో చూపించి బెదిరించిన సీత సూర్య ఆపరేషన్ కోసం మహా దగ్గరే డబ్బు తీసుకొని మధుకి ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మీ డబ్బు ఇవ్వనని చెప్పిందని రామ్ సీతకు చెప్పి క్షమాపణ చెప్తాడు. ఉదయం అందరూ హాల్‌లో ఉంటారు. మహాలక్ష్మీ సూట్‌ కేస్‌తో వస్తుంది. మహాలక్ష్మీ రామ్, సీతని పిలుస్తుంది. రామ్ చిరాకుగా ఏంటి పిన్ని ఎందుకు పిలిచారని అడుగుతాడు. 

మహాలక్ష్మీ: నిన్ను నువ్వు వచ్చి డబ్బు అడిగావ్ కదా.
రామ్: మీరు ఇవ్వను అన్నారు కదా. 
మహాలక్ష్మీ: అప్పుడేదో మూడ్‌లో ఉండి అలా అన్నాను రామ్. తర్వాత నైట్ అంతా ఆలోచించాను. ఎంతైనా మధు మన సీతకి అక్క కదా తనకి సాయం చేస్తే మంచిదనిపించింది. అందుకే సూర్య ఆపరేషన్‌కి అవసరమైనా డబ్బు ఇస్తున్నాను. వెళ్లి సూర్యకి ఆపరేషన్ చేయించండి.
రామ్: నిజంగా డబ్బులు ఇస్తున్నారా పిన్ని. నైట్ మీరు ఇవ్వనని చెప్పడంతో చాలా ఫీలయ్యాను. సీత కూడా బాధ పడింది. 
సీత: అవును ఇద్దరం డబ్బులు గురించి ఆలోచిస్తూ నైట్ అంతా ఉండిపోయాం.
మహాలక్ష్మీ: ఇకపై మీకు ఆ శ్రమ అవసరం లేదు. ఆ డబ్బుతో సూర్యకి ఆపరేషన్ చేయించండి.

మహాలక్ష్మీని అందరూ పొగిడేస్తారు. వెంటనే ఇద్దరినీ బయల్దేరమని చెప్తుంది. సీత, రామ్ ఇద్దరూ డబ్బు తీసుకొని వెళ్తారు. అర్చన మహాలక్ష్మీని తీసుకొని అర్జెంటుగా మాట్లాడాలని తీసుకెళ్తుంది. సీతకి అంత డబ్బు ఎందుకు ఇచ్చావ్ అని అర్చన మహాని అడుగుతుంది. దాంతో మహాలక్ష్మీ రాత్రి సీత వార్నింగ్ ఇచ్చిందని చెప్తుంది. సీత తన గదికి వచ్చి యాక్సిడెంట్ చేయించింది మీరే అని నాకు తెలుసని చెప్పిందని అంటుంది. నీతో నేను చెప్పిన విషయం సీత వీడియో తీసిందని చెప్తుంది. ఆ వీడియో చూపించి నన్ను బ్లాక్ మెయిల్ చేసిందని చెప్తుంది. అది కూడా రామ్ ఫొన్‌లో రికార్డ్ చేసిందని చెప్తుంది. రామ్ ఫోన్‌లో ఎప్పుడైనా వీడియో చేయించొచ్చని అప్పుడు అరెస్ట్ చేయించొచ్చని లేదంటే మెడ పట్టుకొని బయటకు గెంటేయొచ్చని సీత అంటుంది. సూర్యకి యాక్సిడెంట్ చేయించని మహాలక్ష్మీకే డబ్బు ఇమ్మని చెప్తుంది. 

మరోవైపు శివకృష్ణ మధు, సూర్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. లలిత వచ్చి డబ్బు గురించి ప్రయత్నించారా అని అంటే తెలిసిన వాళ్లు ఎవరూ సాయం చేయడం లేదని ఇళ్లు తాకట్టు పెడితే వారంలో డబ్బు ఇస్తామని అంటున్నారని చెప్తాడు. ఇంతలో మధు, సూర్యలు శివకృష్ణ ఇంటికి వస్తారు. సీత ఫోన్ చేసి ఇద్దరినీ అర్జెంటుగా రమ్మని చెప్పిందని మధు వాళ్లతో చెప్తుంది. ఇంతలో సీత, రామ్‌లు సూట్ కేస్‌తో వస్తారు. 

శివకృష్ణ: ఫోన్ చేసి అక్కా బావలను రమ్మన్నావంటే ఏంటి సీత.
సీత: కంగారు పడాల్సిన పని లేదు నాన్న గుడ్ న్యూసే. 
రామ్: సూర్య కాలు ఆపరేషన్‌కి డబ్బు తీసుకొచ్చాం మామయ్య.
సీత: సారీ అక్క డబ్బు సర్దుబాటుకి కాస్త ఆలస్యం అయింది. ఇందులో పది లక్షలు ఉన్నాయి బావకి ఆపరేషన్ చేయించు.

మధు ఎమోషనల్ అయి సీతని హగ్ చేసుకుంటుంది. నేను నిన్ను ఎన్నో సార్లు ఇబ్బంది పెడితే నువ్వు మాత్రం నా జీవితం కోసం ఇంత పెద్ద సాయం చేశావని అంటుంది. దానికి సీత మనం అక్కాచెల్లెళ్లం సూర్య బావకి బాగు అయితే మనం అందరూ సంతోషంగా ఉంటాం అని అంటుంది. సూర్య కూడా రామ్ సీతలకు సారీ చెప్పి సాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ఇక డబ్బు చిన్నగా ఇస్తామని అంటే రామ్ అదేమీ అప్పు కాదని ఇవ్వాల్సిన అవసరం లేదని అంటాడు. ఇక శివకృష్ణ చాటుగా సీతతో మాట్లాడుతాడు. ఇంత డబ్బు ఎక్కడిది అంటే మా అత్తయ్యని బెదిరించానని జరిగిందంతా చెప్తుంది. దాతె ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాతోనే పూజలో కూర్చొంటానని మొండికేసిన మిత్ర.. పాము పరీక్షలో ఎవరు నెగ్గుతారో!

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 29th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న కుటుంబాన్ని కుదిపేసిన మాలిని ఉంగరం! ఇంటి ద్రోహిని పట్టించిన సూరజ్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 28th: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
నువ్వులేక నేను లేను: బయటపడిన దొంగ చిట్టి నాటకాల బండారం...ఆ గండం నుంచి సుందరి ఎలా తప్పించుకుంది
Podarillu Serial Today July 29th: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
పొదరిల్లు: శైలూ పెళ్లిచూపులు చెడగొట్టబోయి బొక్కబోర్లాపడిన చక్రి...పెళ్లికొడుకుని బెదరగొట్టి పంపిన శైలు
Illu Illalu Pillalu Serial Today July 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు:
ఇల్లు ఇల్లాలు పిల్లలు: "ఐ హేట్ యూ ధీరజ్..!" ఇంటిని వదిలి వెళ్లిపోయిన ప్రేమ..! వేదవతిపై చేయి ఎత్తిన రామరాజు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget