Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 19th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మనీషాతోనే పూజలో కూర్చొంటానని మొండికేసిన మిత్ర.. పాము పరీక్షలో ఎవరు నెగ్గుతారో!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రతో పాటు పూజలో లక్ష్మీ, మనీషాల్లో ఎవరు కూర్చొవాలా అని ఇద్దరికీ పరీక్ష పెట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అందరూ గుడి దగ్గరకు చేరుకుంటారు. దేవుడి దర్శనానికి వెళ్లడానికి అందరూ మెట్ల మార్గంలోనే వెళ్లాలి అని అరవింద చెప్తుంది. మనీషా, దేవయానిలు మెట్లు చూసి షాక్ అయిపోతారు. నడిచి వెళ్లడం కష్టమని మనీషా అంటే జయదేవ్ మనీషాని ఇంటికి వెళ్లిపోమని అంటారు.
అరవింద: జాను ఇంటి నుంచి సారె తీసుకొచ్చారు కదా దాన్ని తీసుకొనిరా. పూజలో కూర్చొనే వాళ్లు ఆ సారెతో మెట్లు ఎక్కాలి. లక్ష్మీ ఆ సారె తీసుకొని మెట్లు ఎక్కు.
మనీషా: సారె తీసుకొని నేను వస్తా.
జయదేవ్: నువ్వెందుకు మనీషా.
మనీషా: మిత్ర పక్కన పూజలో నేను కూర్చొంటున్నాను కదా అంకుల్.
అరవింద: మిత్ర పక్కన నువ్వు కూర్చొవడం ఏంటి మనీషా.
దేవయాని: లక్ష్మీ కూర్చొవద్దని మిత్ర చెప్పాడు కదా అక్క.
అరవింద: మిత్ర పక్కన తాళి కట్టిన భార్య కూర్చొకపోతే పెళ్లి కాని మనీషా ఎలా కూర్చొంటుంది.
జయదేవ్: ఏంటి మిత్ర ఇందుకు నువ్వు ఒప్పుకుంటున్నావా.
మిత్ర: ఒప్పుకుంటున్నాను. మీ మాటలు ఒప్పుకొని నేను ఇక్కడి వరకు వచ్చాను కదా అలాగే మీరు కూడా నా మాట ఒప్పుకొని మనీషాని కూర్చొనివ్వండి.
లక్ష్మీ: అత్తయ్య గారు సారె మనీషాకి ఇవ్వండి నాకు వేరే మొక్కు ఉంది. నేను మెట్లకు పసుపు రాసి కర్పూరం వెలిగించి మోకాల మీద వస్తానని మొక్కుకున్నా.
జయదేవ్: అంత కష్టమైన మొక్కు ఎందుకు మొక్కుకున్నావ్ అమ్మా.
మనీషా సారె తీసుకొని గుడి మెట్ల మీద దేవయానిని తీసుకొని వెళ్తుంది. అందరి కంటే ముందు మనమే వెళ్లాలి అంటుంది. ఇక లక్ష్మీ పసుపు బొట్టు పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ మెట్లను దండం పెట్టుకొని రమ్మని మిత్రకు అరవింద చెప్తుంది. జయదేవ్ అరవింద బతిమాలడంతో మిత్ర ఒప్పుకుంటాడు. మనీషా, దేవయానిలు కొన్ని మెట్లకే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు. మనీషా అయితే సారె మోయడం చాలా కష్టమని అంటే దేవయాని నీదీ ఓ కష్టమా కష్టం అంటే లక్ష్మీది అని అంటుంది. అరవింద వాళ్ల వచ్చి ఎందుకు ఇంకా వెళ్లలేదు అని కూడా అడిగితే మీ కోసం ఆగామని మనీషా అంటుంది.. ఇంతలో మనీషా వెళ్తూ తన చేతిలోని పళ్లెం లోని సారె చేయి జారి పడిపోతుంది. అది చూసిన లక్ష్మీ తన కొంగుతో సారెని పట్టుకుంటుంది. అమ్మవారి దయ అని అందుకే నీకే సారె పట్టుకొనే అదృష్టం లభించిందని అరవింద అంటుంది. మనీషా, దేవయాని కోపంతో డిసప్పాయింట్ అవుతారు.
లక్ష్మీ కంటే తానే గ్రేట్ అని మిత్ర అనుకోవాలని అందుకు ఏదైనా ప్లాన్ చెప్పమని మనీషా అంటుంది. ఇంతలో మనీషా దేవుడి గుడిలో ఉన్న పుట్టలో పాము వచ్చి పాలు తాగి వెళ్లడం చూస్తుంది. పూజ కంటే ముందు అందర్ని ఆ పుట్ట దగ్గరకు పిలిచి ఇద్దరిలో ఎవరు పెట్టిన పాలు పాము తాగితే వాళ్లే మిత్ర పక్కన కూర్చొంటారని చెప్దామని అంటుంది. ఇక పాము వచ్చిన పుట్ట దగ్గర తాను పాలు పెడితే పాము వచ్చి తాను పెట్టిన పాలు తాగితే తానే మిత్ర పక్కన కూర్చొంటానని అంటుంది. అరవింద అందరూ దీక్షితులు గారి దగ్గరకు వస్తారు. మిత్ర తన కూతురితో కలిసి పూజ చేస్తానని ఒకవేళ తప్పనిసరిగా భార్య కూర్చొవాలి అంటే నా పక్కన మనీషా కూర్చొంటుందని అంటుంది.
తను నీ పక్కన కూర్చొవడం ఏంటని దీక్షితులు గారు అడగటంతో మనీషా నాకు కాబోయే భార్య అని నా మనసు మనీషాతో ఉందని అంటాడు. మనీషాకి దైవానుగ్రహం లేదని అరవింద వాళ్లు అంటే నాకు దైవానుగ్రహం ఉందని నిరూపిస్తాను అని పుట్ట దగ్గర పాలు పెడితే పాము ఎవరు పెట్టిన పాలు తాగితే వాళ్లే మిత్ర పక్కన కూర్చోవాలని అంటుంది. లక్ష్మీ పరీక్షలో నెగ్గితే తన పక్కన లక్ష్మీని కూర్చొపెట్టుకోవడానికి మిత్ర ఒప్పుకుంటాడా అని అరవింద అంటుంది. అందరూ పుట్ట దగ్గరకు వెళ్తారు. ఇద్దరూ పుట్ట దగ్గర పాలు పెట్టడానికి సిద్ధ పడతారు. ఇంతలో ముందే పాము బయటకు వస్తుంది. నాగదేవత బయటకు వచ్చిందని ఇద్దరూ పాలు పెట్టండని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.