Ammayi garu Serial Today September 19th: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్ ఫ్యామిలీని బాంబ్ బ్లాస్ట్‌లో జీవన్ చంపేస్తాడా.. విరూపాక్షి, రాజు ఏం చేయనున్నారు!
Ammayi garu Today Episode తన తమ్ముడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని విజయాంబిక జీవన్‌తో చేతులు కలిపి బాంబ్ బ్లాస్ట్‌కి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రూప గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. తన తండ్రికి ఇప్పటికే రాజు మీద కోపం ఉందని ఇప్పుడు తల్లి మీద కోపం రెట్టింపు అయిందని ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడుతుంది. రాజుని నాన్న క్షమిస్తారా లేదా అనే నమ్మకం పోతుందని అనుకుంటుంది. మరోవైపు రాజు తన తల్లి శ్వేతని పెళ్లి చేసుకో మని చెప్పడం గురించి ఆలోచిస్తాడు. తన తల్లి ఇలా ఆలోచిస్తుందేంటి అని బాధపడతాడు. అమ్మాయి గారికి తనకు ఈ ఎడబాటు ఇంకా ఎంత కాలమో అని అనుకుంటాడు. ఇంతలో రూప రాజుకి ఫోన్ చేస్తుంది.
రూప: ఎలా ఉన్నావ్ రాజు.
రాజు: అమ్మాయి గారు మీరు లేకుండా నేను ఎలా ఉంటానో తెలుసు కదా. భోజనం లేదు నిద్ర పట్టడం లేదు. అమ్మగారు ఉండి ఉంటే ఏదో ఒక దారి చూపించే వాళ్లు.
రూప: అమ్మ ఇక్కడికి వచ్చింది రాజు. కానీ విజయాంబిక అత్త మొత్తం బయట పెట్టేసింది. జరిగిన దంతా చెప్తుంది. మన టైం మొత్తం రివర్స్ అయింది రాజు. అత్తయ్య అనుకున్నదే జరుగుతుంది. మనం ఏదో ఒకటి చేయకపోతే అత్తయ్య ఇలాగే చేస్తుంది.
రాజు: ఆ విజయాంబిక సంగతి చూడాలి అంటే మనకు రాఘవ ఆచూకి తెలియాలి.
రూప: అవును రాజు మనం ఆ రాఘనని పట్టుకుంటే మనం కలిసి ఉంటాం. అమ్మానాన్నలు కలిసి ఉంటారు. ఇంతకీ అత్తయ్య నా గురించి ఏం అనుకుంటున్నారు.
రాజు: ఆ శ్వేత మా అమ్మ మనసు మార్చేస్తుంది అమ్మాయి గారు. శ్వేతని పెళ్లి చేసుకోమని నన్ను అమ్మ బలవంత పెడుతుంది. అమ్మాయి గారు మీరేం కంగారు పడకండి. నేను మిమల్ని తప్ప ఇంకెవరినీ భార్యగా ఊహించుకోను.
రూప: రాజు నాకు నిన్ను చూడాలని ఉంది.
రాజు: నాకు కూడా అమ్మాయి గారు మొన్నటిలా వస్తా.
దీపక్: ఈ రోజు మామయ్యని చంపాలి అనుకున్నాం ఈ రాజు గాడు వచ్చేలా ఉన్నాడే.
విజయాంబిక: రేయ్ దీపక్ నిన్ను మంత్రిని చేయడానికి మీ మామయ్య ప్రాణ త్యాగం చేయబోతున్నాడు.
దీపక్: మామయ్యే కాదమ్మా ఈ ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే ప్లాన్ చేస్తుంది బాంబ్ కదా మమ్మీ మొత్తం ఫ్యామిలీ అయిపోతారు. ఆ రాజు వచ్చేలా ఉన్నాడమ్మా.
విజయాంబిక: రానివ్వు దీపక్ ఈసారి వాడి టైం బాలేదు అందుకే వాడే వస్తున్నాడు. బాంబ్ బ్లాస్ట్‌లో మీ మామయ్యతో పాటు వాడు ఇరుక్కుంటే వాడు కూడా అయిపోతాడు. ఒకవేళ ఏమైనా తేడా అయితే ఆ బాంబ్ ప్లాన్ వాడిదే అని చెప్తాం. అప్పుడు మీ మామయ్య వాడిని బతకనివ్వరు. ఒకవేళ వాడు రాకముందే బ్లాస్ట్ జరిగితే ప్లాన్ చేసిన వారిని రాజు వదలడు దాంతో ఆ బాంబ్ ప్లాన్ చేసిన జీవన్ అయిపోతాడు.
హర్ష సీఎం ఇంటికి దగ్గరకు వచ్చి దీపక్‌కి కాల్ చేస్తాడు. సెక్యూరిటీ అడ్డు లేకుండా చేయాలని అంటాడు. సెక్యూరిటీ వాళ్లకి మందారం టీ చేస్తుంటే అందులో విజయాంబిక నిద్ర మాత్రలు కలిపేస్తుంది. సెక్యూరిటీ వాళ్లకి టీ ఇవ్వమని మందారాన్ని పంపేస్తుంది విజయాంబిక. ఇక ఇంట్లో వాళ్ల కోసం చేసే పాలలో కూడా నిద్ర మాత్రలు కలుపుతుంది. మరోవైపు విరూపాక్షి రాఘవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన తాళి తెగే టైంకి కాపాడుకుంటుంది. దీంతో ఏదో కీడు శంకిస్తుందని అనుకుంటుంది. ఇక సెక్యూరిటీకి మందారం టీ ఇస్తుంది. ఇంట్లో వాళ్లకి కూడా మత్తు మందు కలిపిన పాలు మందారం ఇవ్వడానికి వెళ్తుంది. ఇక విరూపాక్షి రూపకి కాల్ చేసి నాకు కీడు శంకిస్తున్నట్లుందని మీ నాన్న ఎలా ఉన్నారని అంటుంది. రూప తల్లికి ధైర్యం చెప్తుంది. విరూపాక్షి తన భర్తని చూపించమని రూపని అడుగుతుంది. రూప వీడియో కాల్ చేసి తండ్రికి తెలీకుండా చూపిస్తుంది. ఇంట్లో అందరూ పాలు తాగేస్తారు. విరూపాక్షి భర్తని చూసి చాలా సంతోషిస్తుంది.
దీపక్ జీవన్‌కి కాల్ చేసి అందరూ పడుకున్నారని సూర్యప్రతాప్ గదికి దారి చెప్పి ఫోన్ కట్ చేస్తారు. తాము మాత్రం ఇంట్లో ఉండకూడదని బయటకు వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ని పొడిచేసిన రౌడీలు.. అల్లాడిపోయిన సత్య, రచ్చ రచ్చ!