Satyabhama Serial Today September 19th: సత్యభామ సీరియల్: క్రిష్‌ని పొడిచేసిన రౌడీలు.. అల్లాడిపోయిన సత్య, రచ్చ రచ్చ!
Satyabhama Today Episode మహదేవయ్యని రౌడీలు పొడిచేయబోతే క్రిష్ అడ్డుకోవడం దాంతో రౌడీలు క్రిష్‌ని పొడిచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్యని చంపడానికి వచ్చిన రౌడీలను క్రిష్, మహదేవయ్య చితక్కొడతారు. గుట్టుగా చేయాల్సిన పని రచ్చరచ్చ అయిపోయిందని దూరంగా ఉంటే తనని అనుమానిస్తారని రుద్ర అనుకుంటాడు. రుద్రకి ఏం చేయాలో తెలియక కర్టెన్ వెనుక నక్కిపోతాడు. ఇక భైరవి, రేణుకలు వచ్చి షాక్ అయిపోతారు. అప్పుడు రుద్ర బయటకు వచ్చి కావాలనే కొడుకుతున్నట్లు నటిస్తాడు. ఇక సత్య కూడా వస్తే దగ్గరకు రావొద్దని క్రిష్ అంటాడు.
భైరవి, రేణుకలు కూరగాయలతో రౌడీని కొడితే వాడు వాళ్ల దగ్గరకు వచ్చి లాక్కెళ్లడానికి ప్రయత్నిస్తాడు. సత్య అడ్డుకుంటే సత్యని నెట్టేసి ఇద్దరినీ గదిలో బంధించేస్తాడు. మళ్లీ ఆ రౌడీని సత్య కొట్టడానికి ప్రయత్నిస్తే సత్య తల మీద కొట్టేస్తాడు. దాంతో సత్య స్ఫృహ కోల్పోతుంది. ఇక మహదేవయ్య, క్రిష్ ఇద్దరూ రౌడీలను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి కొడతారు. రుద్ర రౌడీని కొడుతున్నట్లు నటిస్తూ టైం చూసి తండ్రిని ఎలా అయినా చంపేయాలి అనుకొని తన తండ్రి మీదకు రౌడీని నెట్టేసి పొడిచేయమని చెప్తాడు. రౌడీ మహదేవయ్యని పొడవడానికి వెళ్తే మహదేవయ్య వాడిని చితక్కొడతాడు. ఈ లోపు మహదేవయ్య తల మీద మరో రౌడీ కొట్టేస్తాడు. తర్వాత పొడిచేస్తాడు. దాంతో క్రిష్ బాపు అని పెద్దగా కేక పెట్టడంతో సత్య లేస్తుంది. మహదేవయ్య, రుద్ర షాక్ అయిపోతారు. తండ్రిని పొడవబోతే క్రిష్ అడ్డువెళ్తాడు.
అది చూసిన రుద్ర డిసప్పాయింట్ అవుతాడు. సత్య షాక్ అయి క్రిష్ అని ఏడుస్తూ వస్తుంది. క్రిష్ తనకు ఏం కాలేదని తండ్రిని చూసుకోమని బాపు బాపు అని అంటాడు. మరోవైపు సత్య మహదేవయ్య దగ్గరకు వెళ్లి క్రిష్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి మామయ్య అని ఏడుస్తుంది. మహదేవయ్య రౌడీలను పట్టుకొని మమల్ని ఎవరు పంపారని ప్రశ్నిస్తాడు. తర్వాత రుద్ర దగ్గరకు వెళ్లి క్రిష్‌ని పొడిచేశారు చావు బతుకుల మధ్య ఉన్నాడు రమ్మని పిలుస్తుంది. మరోవైపు క్రిష్ అన్నా బాపు జాగ్రత్త కాపాడు ఎవర్నీ వదలకు అని అంటాడు. సత్య క్రిష్ కడుపులో గుచ్చుకున్న కత్తి తీసి రక్తం పోకుండా టవల్ కడుతుంది. తర్వాత క్రిష్‌ని తీసుకొని కారులో ఎక్కించుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. మహాదేవయ్య సత్య హాస్పిటల్‌కి తీసుకెళ్తుందని మనం కూడా వెళ్దామని అంటాడు.
సత్య క్రిష్‌ని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. నాకు ఏం కాదు నువ్వు టెన్షన్ పడకు సత్య అని క్రిష్ అంటాడు. సంపంగి సంపంగి అంటూ క్రిష్ సత్యతో నీ ఒడిలో తల పెట్టుకొని పడుకోవాలి అని ఉందని అంటాడు. సత్య క్రిష్‌ని నిద్రపోవద్దని తనతో మాట్లాడమని అంటుంది. ఆ టైంలో క్రిష్ కత్తిపోట్లకి ఏమో కానీ నీ చెంప దెబ్బలకు చచ్చిపోయేలా ఉన్నానని అంటుంది. సత్య మాట్లాడమని అంటుంది. మాట్లాడించడానికి కథ చెప్పమని అంటుంది. క్రిష్ అనగనగా ఒక రాజు పది మంది కొడుకులు అని చెప్తాడు. సత్య ఏడుగురు కదా అని అంటుంది.
ఇక సత్య క్రిష్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. క్రిష్‌ని ఆపరేషన్ గదికి తీసుకెళ్తారు. సత్య చాలా ఏడుస్తుంది. క్రిష్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడే ఉన్న దేవుడికి సత్య దండం పెట్టుకుంటుంది. ఇంట్లో వాళ్లంతా వస్తారు. డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేదని సత్య అంటుంది. గొడవలకు పోవద్దని చెప్తే వినలేదు ఇప్పుడు క్రిష్‌కి ఇలాంటి పరిస్థితి వచ్చిందని జయమ్మ ఏడుస్తుంది. మహదేవయ్య చేతికి కూడా గాయం అయితే కట్టుకట్టమని జయమ్మ నర్సుకి చెప్తుంది. మరోవైపు రుద్ర జాగ్రత్త పడాలని అనుకుంటాడు. రౌడీలు తిన్నగా తన రూంకి ఎలా వస్తారని ఇది తెలిసిన వాళ్ల పనే అని మహదేవయ్య అంటాడు. రుద్ర షాక్ అయిపోతాడు. ఇక మహదేవయ్య సిగరెట్ హాస్పిటల్‌లో కాల్చితే నర్సు వద్దని అంటుంది. రుద్ర నర్స్ మీదకు గొడవకు వెళ్లే సత్య అడ్డుకొని అది రూల్ అందరూ పాటించాలి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Before You Go
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
ట్రెండింగ్ వార్తలు






















