అన్వేషించండి

Karthika Deepam 2 Serial September 19th: కార్తీకదీపం 2 సీరియల్: శ్రీధర్ రెండో పెళ్లి గురించి తెలిసి షాక్‌తో నోరెళ్లబెట్టిన జ్యోత్స్న, పారు.. అల్లుడూ ఎంత పని చేశావురా!

Karthika Deepam 2 Serial Episode కాశీ తరఫున స్వప్న తల్లిదండ్రులతో మాట్లాడటానికి వచ్చిన పారు, జ్యోత్స్నలకు శ్రీధర్ రెండో పెళ్లి గురించి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Karthika Deepam Idi Nava Vasantham Serial Episode తన తండ్రి రెండో పెళ్లి గురించి తన తల్లికి నిజం తెలిస్తే తన తల్లి బతకదని కార్తీక్ దీపతో చెప్తాడు. తన తండ్రి తల్లి మీద చూపించే ప్రేమకు తనకే ఈర్ష్య కలిగేదని, ఓ మంచి భర్త ఎలా ఉండాలని నిద్రలో లేపి అడిగినా మీ నాన్నలా ఉండాలని తన తల్లి తడుముకోకుండా చెప్తుంది. తన దృష్టిలో మా నాన్న దేవుడని కార్తీక్ చెప్తాడు. 

కార్తీక్: భరించడానికో సహించడానికో మా నాన్న మామూలు ద్రోహం చేయలేదు దీప. నమ్మకద్రోహం చేశాడు. మనం ఎంత బలంగా నమ్మకం పెట్టుకుంటే జరిగిన మోసానికి అంత బాధ పడతాం. ఇప్పుడు చెప్పు దీప నిజం మా అమ్మకి చెప్పమంటావా. చెప్తే తట్టుకుంటుంది అంటావా.
కాంచన: నువ్వు చెప్పకపోయినా నిజం తెలుస్తుందిరా.
దీప: మనసులో కాంచన గారు మొత్తం వినేసినట్టున్నారు. 
కాంచన: ఏంట్రా ఇద్దరూ అలా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. నిజం ఏదో ఒకరోజు తెలుస్తుంది. కానీ ఆ నిజం ఏంటి. తట్టుకోదు అని తెలిసినా నిజం చెప్పాలి అంటున్నావ్ ఏంటి ఆ నిజం. ఆ విషయం గురించి మీ ఇద్దూ ఎందుకు మాట్లాడుకుంటున్నారు.
దీప: నేను కార్తీక్ బాబుని పెళ్లి గురించి ఆడిగాను. 
కార్తీక్: పెళ్లి ఎలాగూ వాయిదా పడింది కదా పెళ్లి రెస్టారెంట్ పనులు పూర్తయ్యాక చేసుకుంటా అని చెప్తే జ్యోత్స్న తట్టుకుంటుందో లేదో అని చెప్తున్నా.
కాంచన: మళ్లీ మొదటికి వచ్చావ్ ఏంట్రా. ముందు పెళ్లి తర్వాతే ఏమైనా.
కార్తీక్: సరే అమ్మా.
దీప: మీకు ఒక విషయం చెప్పాలి అమ్మా ప్రమాదంలో కాళ్లు పోయినా గుండె ధైర్యంతో బతకాలి అనే ఆశతో కాళ్లు లేకపోయినా ధైర్యంగా ఉన్నారు. అదే గాయం మనసుకి తగిలితే తట్టుకోగలరా అమ్మ
కాంచన: తట్టుకోగలను దీప కానీ నా బలం బలహీనత నా భర్త, కొడుకు. వీళ్ల విషయంలో మాత్రం ఏం జరిగినా నేను తట్టుకోలేను. వాళ్లిద్దరూ నాకు ప్రాణం కంటే ఎక్కువ. 

పారిజాతం: కాశీ ఇక్కడికి రమ్మన్నాడు లేడు ఏంటి. 
జ్యోత్స్న: వాడు నిన్ను రమ్మంటే నన్ను ఎందుకు తీసుకొచ్చావ్. 
పారిజాతం: వాడు నీ సొంత తమ్ముడే వాడికి అవమానం జరిగితే నీకు జరిగినట్లు కదా.
జ్యోత్స్న: ఈ చట్నీ సాంబారు కబుర్లు నా దగ్గర చెప్పకు. వాడికి అవమానం జరిగితే నాకు ఏంటి. వాడికి నాకు సంబంధం ఏంటి. నేను దశరథ్, సుమిత్రల కూతురిని. 
పారిజాతం: ఆ రకంగా అనుకున్నా నీకు వాడు తమ్ముడే.
జ్యోత్స్న: అనుకోవడం ఏంటి నేను వాళ్ల కూతురినే. జరిగింది అంతా మర్చిపో అస్తమానం నువ్వు నా స్థాయిని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇంతలో కాశీ వస్తాడు.
కాశీ: నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ నేను అనామకుడిని కాదు నాకు ఓ మంచి కుటుంబం ఉంది అని స్వప్న వాళ్ల నాన్నకి తెలియాలి.
పారిజాతం: పారిజాతం రంగంలోకి దిగితే యుద్ధం మొదలైనట్లే. నన్ను ఏమీ అనకపోతేనే నాకు సగం కాలుతుంది. అలాంటిది నా మనవడిని పట్టుకొని అనామకుడు అన్నాడు అంటే వాడికి మంట పెట్టాల్సిందే. పారిజాతం స్వప్న ఇంటిలోకి వెళ్లూ శ్రీధర్‌ని చూసి షాక్ అయిపోతుంది. అల్లుడేంటి ఇక్కడున్నాడు. 
జ్యోత్స్న: ఏంటి గ్రానీ ఇక్కడ ఆగిపోయావ్.
పారిజాతం: ఒక్కసారి అటు చూడు.
కాశీ: మా మామయ్య గారిని చూసి మీరు ఎందుకు షాక్ అవుతున్నారు. 
పారిజాతం: మీ మామగారా.
కాశీ: అవును అతనే స్వప్న వాళ్ల నాన్న. 
జ్యోత్స్న: నాకు ఏం అర్థం కావడం లేదు గ్రానీ.
పారిజాతం: నాకు సగం అర్థమైంది. మనవడా పద వెళ్దాం.
కాశీ: ఆవేశం ఏదో అన్నావ్ ముందుకు కాకుండా వెనక్కి వెళ్తున్నావ్.. అదిగో ఆవిడే మా అత్తయ్యగారు.
పారిజాతం: ఇందాక నాకు సగం అర్థమైంది అన్నాను కదా ఇప్పుడు పూర్తి అర్థమైంది. కాశీ నువ్వు వెళ్లరా మేం మాట్లాడుతాం. అని బలవంతంగా కాశీని పంపేస్తుంది. 
శ్రీధర్: సరే బేబీ నేను ఇక వెళ్తా.
కావేరి: నా పరిస్థితి నీకు తెలుసు కదా త్వరగా రా బేబీ.
జ్యోత్స్న: గ్రానీ విన్నావా బేబీ అంట. 
పారిజాతం: మనవడి లవ్‌ స్టోరీ కంటే అల్లుడు లవ్ స్టోర్ అదుర్స్. అల్లుడూ నువ్వు ఇంత గుండెలు తీసిన బంటువి అనుకోలేదు అల్లుడూ. నీకు ఇళ్లు ఆఫీస్ తప్ప వేరే ప్రపంచమే తెలీదు అనుకున్నా అబ్బా..
జ్యోత్స్న: ఇళ్లు ఆఫీస్‌తో పాటు మామయ్యకి ఓ చిన్న ఇళ్లు భార్య కూతురు కూడా ఉన్నారు. మరీ ఇంత మోసమా నాకు అయితే నర్శింహ గాడు గుర్తొచ్చాడు బావ.

పారిజాతం ఈ విషయం ఇంట్లో అందరికీ చెప్పొద్దని అంటుంది. జోత్స్న మాత్రం తాతకి చెప్పేస్తాను అని అంటుంది. పారు ఆపి మీ తాతకి నిజం తెలిస్తే ఊరుకోడని కార్తీక్‌తో నీ పెళ్లి అవ్వదని జ్యోత్స్నని తీసుకొని వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ మెల్లగా నడుస్తాడు. దీప వచ్చి మెల్లగా నడవమని అంటుంది కాంచన కూడా కార్తీక్ నడుస్తుంటే సంతోషంగా ఉంటుంది. కార్తీక్ బాబు పూర్తిగా నడుస్తున్నాడని  ఇక పెళ్లికి సిద్ధమని చెప్పమని కాంచనతో అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: ఈసారి కూడా ఫస్ట్‌నైట్ గో..వింద.. రౌడీలను చూసేసిన క్రిష్, మహదేవయ్య.. రుద్ర దొరికిపోయినట్లేనా?

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today August 8th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌ని ప్రేమిస్తుందా! కన్నీరే సాక్ష్యం..! ఆ స్టాంప్‌ ఎందుకు?
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న సూరజ్‌ని ప్రేమిస్తుందా! కన్నీరే సాక్ష్యం..! ఆ స్టాంప్‌ ఎందుకు?
Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Embed widget