అన్వేషించండి

Satyabhama Serial Today September 18th: సత్యభామ సీరియల్: ఈసారి కూడా ఫస్ట్‌నైట్ గో..వింద.. రౌడీలను చూసేసిన క్రిష్, మహదేవయ్య.. రుద్ర దొరికిపోయినట్లేనా? 

Satyabhama Today Episode రుద్ర పంపిన రౌడీలు ఇంటికి వచ్చి మహాదేవయ్యని చంపడానికి ప్రయత్నించడం క్రిష్, మహదేవయ్య వాళ్లని అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్ సత్య కోసం గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ ముసలి దానికి వయసులో ఉన్న వాళ్ల బాధలు తెలీవని చివరి బస్‌కి టికెట్ చేసినట్లు అర్థరాత్రి ముహూర్తం పెట్టించిందని తిట్టుకుంటాడు. ఊరికే కూర్చొంటే నిద్ర వస్తుందని అటూ ఇటూ తిరిగి నిద్ర పోతాడు. ఇక హర్ష నందిని మీద కోపంతో బయటకు వచ్చేస్తాడు. శాంతమ్మ పడుకొని ఉంటే ఆమె కాలి మీద కూర్చొండిపోతాడు. నా కాలు విరిచేశాడు బాబోయ్ అని శాంతమ్మ అరుస్తుంది.

హర్ష: నానమ్మ నేను ఈ రోజు ఇక్కడే పడుకుంటా.
శాంతమ్మ: ఏమైందిరా నీకు గదిలోకి వెళ్లినప్పుడు బాగానే నవ్వుకుంటూ వెళ్లావ్ కదా.
హర్ష: హా.. మొగుడు నవ్వుని పెళ్లాం ఎక్కువ సేపు భరించలేదు. 
శాంతమ్మ: ఏమైందిరా కొట్టుకు చచ్చారా.
హర్ష: నాకు దాని గురించి మాట్లాడాలి అంటేనే చిరాకు. వదిలేయ్.
శాంతమ్మ: అయితే ఓ పని చేస్తా దాన్ని కూడా ఇక్కడికే తీసుకొస్తా.
హర్ష: ఆ అనుమానం పెళ్లాంతో నేను కాపురం చేయలేను నానమ్మ నా వల్ల కాదు. 

శాంతమ్మ హర్షకి సర్ది చెప్పి లోపలికి పంపిస్తుంది. హర్ష లోపలికి వెళ్లే సరికి నందిని ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటుంది. హర్ష అది చూసి షాక్ అయిపోతాడు. నందిని హర్షని చూసి ఏంటి మళ్లీ వచ్చావ్ బయట దోమలు కుట్టి పెళ్లాం దగ్గరు పొమ్మన్నాయా అని అడుగుతుంది. ఇక కోపం వచ్చిందా అని నందిని అడుగుతుంది. ఒక్క మాటతో ఇంట్రస్ట్ అంతా పొగొట్టేశావ్ అని అంటాడు. ఇలా అయితే మన శోభనం అయినట్లే అని హర్ష అంటే ఎందుకు జరగదు అని నందిని కితకితలు పెడుతుంది. ఇక ఇద్దరూ హ్యాపీగా ఉంటారు. సత్య గదిలోకి వస్తుంది. సత్యని చూసి క్రిష్ సత్య దగ్గరకు వెళ్లి హగ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే సత్య ఒక్కటిస్తుంది. 

సత్య: కరువుతో ఉన్న వాడిలా రాగానే మీద పడిపోవడమేనా. మాటా మంచి ఏం లేవా.
క్రిష్: ఇన్ని దినాలు కలిసే ఉన్నాం కదా కొత్తగా మాట్లాడేది ఏముంది. రోజూ చెప్పుకునే సోల్లు కబుర్లే కదా. నీకు అంత బిల్డప్ అవసరం లేదు. అని సత్య గుడిలో రౌడీలను కొట్టినట్లు తనని టవల్‌తో సత్య కొట్టునట్లు క్రిష్ ఊహించుకుంటాడు. నిద్ర లేచి ఇదంతా కలా అనుకుంటాడు. ఇంతలో నిజంగానే సత్య వస్తుంది. దగ్గరకు వెళ్లి హగ్ చేసుకోబోయి కల గుర్తొచ్చి ఆగిపోతాడు. 
సత్య: అదేంటి నేను ఏదో పరాయి దానిలా అలా దూరంగా ఉన్నావ్. భుజం మీద చేయి వేసుకొని తీసుకెళ్లొచ్చు కదా. 
క్రిష్: తీసుకెళ్లొచ్చా పర్లేదా.

క్రిష్ సత్యని తీసుకెళ్లి బెడ్ మీద కూర్చొపెట్టి పక్కనే ఉన్న టవల్ పడేస్తాడు. క్రిష్ దూరంగా కూర్చొంటే సత్య ఇంత దూరం అవసరమా అని అడుగుతుంది. గుడికి వెళ్లి వచ్చినప్పటి నుంచి నీలో మార్పు కనిపిస్తుందని అంటుంది. తన యాక్షన్‌కి బయపడ్డావ్ అని అంటుంది. గది వరకు వచ్చాను కానీ నీ కౌగిట్లోకి వచ్చేలా నువ్వే చేయాలి అని అంటుంది. ఇక క్రిష్ సత్య వెంట పడుతూ హగ్ చేసుకోవడానికి వెళ్లి అటూ ఇటూ తిరిగి హగ్ చేసుకుంటాడు.

మరోవైపు మహదేవయ్యని చంపడానికి రౌడీలు ఇంటికి వస్తారు. మహదేవయ్య భైరవిని పిలిచి కాళ్లు పట్టమని అంటాడు. భైరవి కాసేపు కాళ్లు పట్టి మహాదేవయ్య పడుకోగానే పడుకుండిపోతుంది. రౌడీలు రాగానే రుద్ర వాళ్లని మహదేవయ్య గది చూపించి వెళ్లి చంపేయ్ మని అంటాడు. ఇక క్రిష్ సత్య ఒడిలో పడుకొని మాట్లాడుతాడు. నువ్వు నాకు అంత ఈజీగా దొరకలేదు సత్య కాలంతో గొడవ చేశానని అంటాడు. క్రిష్ మాటలకు సత్య బాధ పడుతుంది. నీ చేతిని ఇక ఎప్పటికీ వదలను అని క్రిష్ చెప్పి ఐ లవ్‌యూ చెప్తే సత్య కూడా ఐ టూ లవ్‌ యూ అని చెప్తుంది. క్రిష్ తన తల్లి మత్తు ముందు కలిపిన స్వీట్ తినేస్తాడు. 

రౌడీలు మహదేవయ్య గదికి వెళ్లి బెడ్ మీద చాకులతో పొడుస్తారు. సత్య ఆ సౌండ్ విని నీకు ఏమైనా సౌండ్ వినిపించిందా అని అడుగుతుంది. క్రిష్ లేదు అని చెప్తాడు. ఇక రౌడీలు ఎంత పొడిచినా చలనం లేకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. మహాదేవయ్య వేరే చోట నిల్చొని రేయ్ నేను అక్కడ లేను ఇక్కడ ఉన్నానురా అని అరుస్తాడు. దాంతో రౌడీలు దొరికిపోయాంరా అనుకొని పరుగులు తీస్తారు. మహదేవయ్య కేకలు సత్య, క్రిష్ వింటారు. రౌడీలు పరుగులు తీస్తే ఎదురుగా క్రిష్ ఉంటాడు. వెనక్కి తిరిగితే మహదేవయ్య ఉంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, జున్నులకు ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన కారు..లక్ష్మీ కాపాడగలదా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget