Chiranjeevi Lakshmi Sowbhagyavathi September 18th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్ర, జున్నులకు ఘోర ప్రమాదం.. కాలి బూడిదైన కారు..లక్ష్మీ కాపాడగలదా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్ర, జున్నులకు యాక్సిడెంట్ కావడం లక్ష్మీ వెళ్లి ఇద్దరినీ కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మిత్రతో పిల్లల్ని ఎందుకు పంపించావని దీక్షితులు గారు లక్ష్మీ మీద సీరియస్ అవుతారు. మిత్ర వల్ల పిల్లలకు గండం ఉందని కాపాడమని దీక్షితులు గారు లక్ష్మీకి చెప్తారు. లక్ష్మీ పరుగులు తీస్తుంది. లక్ష్మీ టెన్షన్ చూసి ఇంట్లో వాళ్లు పరుగులు తీస్తారు. దేవయాని, మనీషా కూడా వెళ్లారు.
మరోవైపు మిత్ర డ్రైవ్ చేస్తున్న కారు బ్రేక్ ఫెయిల్ అవుతుంది. మిత్ర పిల్లలతో ఆ విషయం చెప్పి లక్కీని జంప్ చేయమని అంటాడు. లక్కీ భయపడుతుంది. కళ్లు మూసుకొని దూకేయమని చెప్తే లక్కీ దూకేస్తుంది. ఇక మిత్ర జున్నుని కూడా దూకమని చెప్తే జున్ను వెళ్లనని అంటాడు. బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి అని చెప్పి దూకమని అంటే జున్ను దూకడు. ఏమైనా మీతోనే ఉంటానని అంటాడు. మిత్ర ఎంత చెప్పినా వినిపించుకోడు. ఎందురుగా పెద్ద లోయ రావడంతో కారు దూసుకుపోయి పేలిపోతుంది.
ఆటోలో వెళ్తున్న లక్ష్మీ లక్కీని చూస్తుంది. లక్కీ దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకుంటుంది. ఇద్దరూ కారు వెళ్లిన వైపునకు పరుగులు తీస్తారు. ఇక లక్కీ మిత్ర, జున్నులను చూపిస్తుంది. మిత్ర కొండ చరియల్లో వేలాడుతుంటాడు. ఒక చేతితో జున్నుని పట్టుకొని మరో చేత్తో రాయిని పట్టుకుంటాడు. ఇంతలో లక్ష్మీ వెళ్లి మిత్ర చేయి పట్టుకుంటుంది. జున్నుకి లక్ష్మీ ధైర్యం చెప్తుంది. తన చీర కొంగుని మిత్ర చేతికి కడుతుంది. ఇంతలో వివేక్ అరవింద వాళ్లంతా అక్కడికి చేరుకుంటారు. లక్కీని చూసి విషయం తెలుసుకుంటారు. వివేక్, జయదేవ్ వెళ్లి లక్ష్మీకి సాయం చేస్తారు. మనీషా, దేవయాని కూడా అక్కడికి చేరుకుంటారు. మళ్లీ ఏదో గండం గడిచినట్లు ఉందని అనుకుంటారు. జయదేవ్, లక్ష్మీ, వివేక్‌లు కలిసి మిత్ర, జున్నులను కాపాడుతారు.
లక్ష్మీ వల్లే గండం నుంచి తప్పించుకున్నావ్ అని మిత్రతో తల్లిదండ్రులు చెప్తారు. శాంతి పూజ చేయనందుకే ఇలా జరిగిందని అంటారు. మిత్ర, లక్ష్మీలకు కలిసి పూజ చేయమని అంటారు. మనీషా, దేవయాని అడ్డు పడతారు. మిత్ర, లక్ష్మీ భార్యభర్తలని జున్ను, లక్కీ వాళ్ల పిల్లలని అంటారు. పిల్లల కోసం ఆ పూజ చేయాలని అరవింద అంటుంది. మిత్ర పూజ చేయడానికి ఒప్పుకుంటాడు. అయితే తాను లక్కీ మాత్రమే పూజ చేస్తామని లక్ష్మీ, తన కొడుకు ఉండకూడదని అంటాడు. లక్ష్మీ తనని ఏం కాపాడలేదని తన కొడుకుని కాపాడుకుందని మిత్ర అంటాడు. మనసు కట్టుకొని మాట్లాడుతున్నావ్ అని జయదేవ్ అంటాడు. కోపంతో అరవింద నిజం చెప్పబోతే లక్ష్మీ చెప్పకుండా ఆపుతుంది. మిత్ర లక్కీని తీసుకొని వెళ్లిపోతాడు.
అరవింద గుడికి వచ్చి పూజకు ఏర్పాట్లు చేస్తుంది. దీక్షితులు గారితో పూజకు మిత్ర రాను అన్నాడని చెప్తుంది. దేవయాని కూడా గుడికి వస్తారు. మిత్రని ఎలా అయినా తీసుకురమ్మని చెప్పానని దీక్షితులు గారు అంటాడు. లక్ష్మీ జున్నులు కలిసి పూజ చేయొచ్చా అని అడిగితే అలా చేయకూడదని పూజ చేయడం వేస్ట్ అని అంటారు దీక్షితులు గారు. దాంతో అరవింద ఎలా అయినా మిత్రని తీసుకొస్తానని అంటుంది. దేవయాని మనీషాకి కాల్ చేసి పెద్ద కుట్ర జరుగుతుందని అంటుంది. అరవింద మిత్ర కాళ్ల పట్టుకొని అయినా ఒప్పిస్తానని అంటుంది. మిత్ర, మనీషా, లక్కీలు ఒక కారులో వస్తారు. దీక్షితులు గారి పేరును పెట్టుకొని కాబోయే దంపతులు అయిన తనని మిత్రని పూజలో కూర్చొమన్నారని చెప్తుంది. మిత్ర కూడా ఒకే చెప్తాడు. అందరూ గుడికి చేరుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.