Ammayi garu Serial Today September 19th: అమ్మాయిగారు సీరియల్: సూర్య ఇంట్లో రాఘవ! తల పగలగొట్టేసిన విజయాంబిక.. చివరి అవకాశం పోయినట్లేనా!
Ammayi garu Serial Today Episode September 19th రాఘవ నిజం చెప్పే టైంకి విజయాంబిక రాఘవ తల పగలగొట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్‌ని ఆనంద్ పట్టుకొని నాకు ఏమైనా పర్లేదు నువ్వు పెద్దయ్యగారికి నిజం చెప్పు పారిపో అని అంటాడు. దీపక్ ఆనంద్‌ని చితక్కొడతాడు. రాజు వచ్చి కాపాడితే రాజుని దీపక్ మనుషులు పట్టుకుంటారు. విజయాంబిక కంగారుగా గుమ్మం ముందు నిల్చొంటుంది.
రూప, విరూపాక్షిలు విజయాంబిక దగ్గరకు వచ్చి చెమటలు పట్టేస్తున్నావ్ నీ ఫ్యూచర్ కనిపిస్తుందా.. కాసేపట్లో రాఘవ వచ్చి మీ దుర్మార్గాల చిట్టా విప్పుతాడు అని అంటుంది. విజయాంబిక చాలా కంగారు పడుతుంది. అత్తయ్యకి ఈ రోజే చివరి రోజు అని తెలిసి బాధగా ఉంది.. చివరి సారి కాఫీ ఇవ్వమని అంటారా అని అంటుంది. ఇంతలో రాఘవ ఇంటికి వస్తాడు. విరూపాక్షి వాళ్లు చాలా సంతోషపడతారు. విజయాంబిక చాలా భయపడుతుంది. రాఘవ ఇంట్లోకి పరుగులు పెడుతూ వస్తాడు. విజయాంబిక పోలీసులతో రాఘవని లోపలికి రాకుండా ఆపమని చెప్తుంది.
పోలీసులు రాఘవని పట్టుకుంటారు. రాఘవ విడిపించుకొని వస్తాడు. విజయాంబికే రాఘవని ఆపాలని చూస్తుంది. రాఘవ విజయాంబికను నెట్టేసి లోపలి వచ్చేస్తాడు. విరూపాక్షిని రెండు చేతులు జోడించి అమ్మా ఈ పాపిష్టోడిని క్షమించండి అని పెద్దయ్యా అని పిలుస్తాడు. సూర్యప్రతాప్ర్ రావడం చూసిన విజయాంబిక రాఘవ తల మీద బలంగా పూలకుండీతో కొట్టేస్తుంది. రాఘవ నేలకొరిగిపోతాడు. సూర్యప్రతాప్ర్‌తో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఏం చేశావో నీకు అర్థమైందా అని సూర్యప్రతాప్ర్ అంటే వీడు నీకు చేసిన అన్యాయానికి ఏం చేసినా పర్లేదు ఇదే పెళ్లి రోజున విరూపాక్షితో కులుకుతూ నీకు దొరికిపోయాడు. నీ పరువు తీసేశాడు.. ఇప్పుడిప్పుడే నువ్వు విరూపాక్షి దగ్గరవుతుంటే వీడు వచ్చాడు అని సూర్యప్రతాప్ర్‌ని రెచ్చగొడుతుంది.
రూప, మందారం రాఘవకి నీరు తాగించినా లేవడు.. ఇంతలో దీపక్ వస్తాడు. విజయాంబిక తన నటన మొదలు పెడుతుంది. మన పరువు తీసిన వాడిని నేనే చంపాలి అనుకున్నా అని అంటుంది. విరూపాక్షి విజయాంబికను లాగిపెట్టి కొట్టి ఇంకా ఎన్ని డ్రామాలు ఆడుతావ్ విజయాంబిక.. సూర్య విజయాంబిక రాఘవని చంపాలి అనుకున్నది నీ పరువు పోతుంది అని కాదు.. తన బండారం బయట పడుతుంది అనే భయంతో అని చెప్తుంది. ఆ రోజు నువ్వు జరిగింది నువ్వు చూసింది తప్పు కాదు ఈ విజయాంబిక ఆడిన నాటకం అని చెప్తుంది. చేసింది అంతా చేసి నా మీద పడుతున్నావా అని విరూపాక్షి మీద నెట్టేస్తుంది.
సూర్యప్రతాప్ర్ కూడా విరూపాక్షిని మాట్లాడొద్దని కోప్పడతాడు. రాజు వచ్చి అమ్మగారికి రాఘవకి సంబంధం ఉందని చెప్పింది ఈ విజయాంబిక కల్పిత కథ ఇందులో రాఘవ తప్పు లేదు.. అమ్మగారి తప్పు లేదు.. సాక్ష్యం లేకపోతే మీరు నమ్మరు అని రాఘవని మీ ముందుకు తీసుకురావాలి ప్రయత్నిస్తూనే ఉన్నాను.. చాలా సార్లు రాఘవ దొరికినట్లే దొరికి మాయం అయిపోయాడు దానికి కారణం ఈ విజయాంబిక, దీపక్‌లే అని అంటాడు. విజయాంబిక మాటలు నమ్మకండి అని చెప్తాడు. అమ్మగారిని చంపాలి అని కూడా చూసిందని.. అమ్మగారి పేరు ఎత్తితేనే మీకు అసహ్యం కలిగేలా చేసింది.. రాఘవ వీడి కొడుకు ఆనంద్ మీ దగ్గరకు వస్తారని తెలిసి దీపక్ కూడా చంపాలి అనుకున్నాడు అని చెప్తాడు.
దీపక్ వెళ్లి మామయ్య వీడు వీడు కొడుకు మీ పరువు తీయాలి అనుకున్నారు అందుకే వీళ్లని ఆపాలి అనుకున్నా అని అంటాడు. నిజం తెలియాలి అంటే రాఘవ లేవాలి.. రాఘవ లేచే వరకు నువ్వు ఏ నిర్ణయానికి రావొద్దు రాఘవ నిజం చెప్పిన తర్వాత నీ నిర్ణయం తీసుకో రాఘవ నిజం చెప్పిన తర్వాత కూడా నువ్వు నన్ను కనిపించొద్దు అంటే నేను జీవితంలో నీకు కనిపించను అని విరూపాక్షి అంటుంది. విజయాంబిక ఏలా అయినా మాయ చేయాలి అని రాఘవ, విరూపాక్షి 20 ఏళ్లగా కలిసి ఉన్నారు.. అందుకు వాడు ఒక్క నింద మీద వేసుకోలేడా అని సూర్యప్రతాప్ర్‌ని ఆలోచించేలా చేస్తుంది. విరూపాక్షి నీతో మంచిగా ఉంటూనే రాఘవతో ఎఫైర్ నడపాలి అని స్కెచ్ వేసిందని అంటుంది.
రూప విజయాంబిక చెంప పగలగొట్టి ఇంకొక్క మాట అంటే చంపేస్తా అంటుంది. రాఘవతో అలా చెప్పించాలి అంటే ఎప్పుడో తీసుకొచ్చి చెప్పించేది కానీ అలా చేయలేదు అంటే తనే తప్పు చేయలేదు అని అర్థం అని అంటుంది. రాఘవ మాత్రమే నిజం చెప్పాలి అప్పుడే మీ నాన్న వింటారు అని రాఘవ లే అని విరూపాక్షి లేపబోతే విజయాంబిక సూర్యప్రతాప్‌తో వాడికి గాయం అయితే తనకు అయినట్లు ఫీలవుతుంది అని అంటే రూప విజయాంబిక ముఖం మీద ఉమ్మేసి నువ్వు అసలు మనిషివేనా అని తిడుతుంది. రాఘవ రాగానే నీ బండారం బయట పడుతుందని మా నాన్న నిన్ను కాల్చి చంపేస్తాడని భయంతో రాఘవని కొట్టావ్ ఇది నీకు తెలుసు మాకు తెలుసు. మా నాన్నకి మాత్రమే తెలీదు.. ఇంకోసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను నేనే చంపేస్తా అని రాజు, రూప వాళ్లు రాఘవని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. రాఘవని ఎలా అయినా చంపేయాలి అని విజయాంబిక దీపక్‌తో చెప్తుంది. రాఘవని హాస్పిటల్‌లో చేర్చుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















