Ammayi garu Serial Today October 27th: అమ్మాయిగారు సీరియల్: కోమలిని వశం చేసుకోవాలనుకున్న దీపక్ ! ఆస్తి విషయంలో రాజు మెలిక!
Ammayi garu Serial Today Episode October 27th దీపక్ కోమలికి తాయొత్తు కట్టాలని చూడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ తాయొత్తు తీసుకొచ్చి కోమలికి కట్టి కోమలిని తన వశం చేసుకోవాలని అనుకుంటాడు. వెంటనే మంత్రగత్తె దగ్గరకు వెళ్లి తనది పెద్ద కుటుంబం అని ఇద్దరు పిల్లలు అని తన భార్య తన కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తనని దూరం పెడుతుంది. నా భార్య నాకు ప్రాణం తను నాకు దగ్గరయ్యే ఉపాయం చెప్పండి లేదంటే చచ్చిపోతా అంటాడు.
దీపక్ మాటలు విన్న మంత్రగత్తె దీపక్‌కి తాయొత్తు ఇస్తుంది. అది నీ భార్య చేతికి కట్టు మంచి కోసం ఏ పని చేసినా ఆ భగవంతుడు కూడా తోడు ఉంటాడు అని చెప్తుంది. దీపక్ కోమలికి ఎలా అయినా ఆ తాయొత్తు కట్టి తన వెంట తిప్పుకోవాలి అనుకుంటాడు. రాజు, రూపల కోమలి గురించి మాట్లాడుకొని ఇలా వదిలేయకూడదు కోమలికి చెక్ పెట్టాలి అని అనుకుంటారు. ఆ మాటలు కోమలి వినేస్తుంది. రాజు కోమలిని చూసి రూపకి సైగ చేసి తనకు ఈ జన్మకి అమ్మాయిగారే భార్య అని ఇంకెవరినీ ఆ స్థానంలో చూడను అని అంటాడు. మరి నా పరిస్థితి ఏంటి అని రూప కావాలనే అడిగితే నీ పని నువ్వు చూసుకో రుక్మిణి అని అంటాడు. కోమలి దగ్గరకు వచ్చి మన విషయంలో రుక్మిణికి ఓ క్లారిటీ ఇచ్చాను.. పెద్దయ్యగారితో కూడా మాట్లాడాలి అని అంటాడు.
కోమలి తాను రుక్మిణితో మాట్లాడుతా అని వెళ్తుంది. నన్ను నమ్మిని రాజు నా వెనక ఎలా తిరుగుతున్నాడని జుట్టు పీక్కుంటున్నావా.. త్వరలోనే మీ ఆస్తి కూడా దక్కించుకుంటా అని అంటుంది. త్వరలోనే మీ అందరి అంతు చూస్తా జాగ్రత్త అని అంటుంది. రాజు కోమలిని తీసుకొని సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్తాడు. అమ్మాయి గారి నిర్ణయాలు ముందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నా అని అంటాడు. ఏంటి అని సూర్యప్రతాప్ అడిగితే ఆస్తిని అమ్మాయి గారు ఈ ఆస్తి మొత్తాన్ని దేవాలయ ట్రస్ట్‌కి రాసిస్తా అన్నారు కదా పెద్దయ్యా.. ఆ రోజు అమ్మాయి గారికి జరిగిన ప్రమాదం వల్ల అది చేయలేకపోయాం.. అందుకే ఆ రోజు ఆగిపోయిన కార్యక్రమం ఇప్పుడు చేద్దాం అని అంటాడు.
కోమలి అవేశంతో నేను ఆస్తి రాసివ్వమని ఎప్పుడు చెప్పాను రాజు అని అంటుంది. విజయాంబిక సైగ చేయడంతో కోమలి అప్పుడు అన్నాను ఇప్పుడు కాదు ముందు మన ఇద్దరి గురించి మాట్లాడు అని అంటుంది. ముందు మీరు ఆస్తి ట్రస్ట్‌కి రాసిస్తా అని చెప్పండి అని అంటాడు. సూర్యప్రతాప్ కలుగ జేసుకొని రూప ఎందుకు కాదు అంటుంది అని అంటాడు. నేను కాదు అనను రాసిచ్చేద్దాం అని కోమలి అంటుంది. త్వరలోనే ఆ పని చేద్దాం అని సూర్యప్రతాప్ అంటాడు.
రూప విజయాంబికతో ఆస్తి మొత్తం ట్రస్ట్‌కి పోయే.. మీరు ఎవరితో నాటకం మొదలు పెట్టారో ఆస్తి మొత్తం వాళ్ల చేతే రాయిస్తున్నాం.. ఆస్తి ఉండదు అని తెలిసి మీ చెంచా వెళ్లిపోతుంది. మీరు ఎన్ని నాటకాలు ఆడినా మీ పప్పులు ఉడకవు.. రండిభోజనం చేద్దురు గానీ అని రూప చురకలు వేస్తుంది. విజయాంబిక దీపక్‌లు కోమలి దగ్గరకు వెళ్తే ఆస్తి గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని కోమలి అడుగుతుంది. స్టార్టింగ్‌లో చెప్పాం కదా అని దీపక్ అంటాడు. ఆస్తిని ట్రస్ట్‌కి రాయకుండా నేను చూస్తా అని విజయాంబిక అంటుంది. నాకు ఈ ఆస్తి కంటే అశోక్ ముఖ్యం ఇన్నాళ్లు నేను ఇక్కడ నటించినందుకు డబ్బు ఇవ్వండి చాలు నేనురాత్రికే వెళ్లిపోతా అంటుంది. నువ్వు వెళ్లిపోతే మా తమ్ముడు వదలడు అని విజయాంబిక అంటుంది.
రాత్రి అందరూ పడుకున్న తర్వాత దీపక్ కోమలి గదికి వెళ్లి తాయొత్తు కడతాడు. కోమలి చూసి తాయొత్తు లాక్కొని ఇది నాకు కట్టి వశీకరణ చేయాలి అనుకున్నావా.. నేను మీకు సాయం చేయాలి అనుకుంటే నువ్వు నా జీవితం నాశనం చేయాలి అనుకుంటున్నావా అని తిడుతుంది. నువ్వు నాకు ఇష్టం అని దీపక్ అంటాడు. నీలా నాకు క్యారెక్టర్ లేదు అనుకున్నావా మీ అమ్మ దగ్గరకు పద అని కోమలి తిడుతుంది. దీపక్‌ని బయటకు వెళ్లమని చెప్తుంది. కోమలి దీపక్‌ని లాగిపెట్టి కొడుతుంది. దీపక్ కిందకి వస్తాడు. అప్పుడు మందారం చూసి ఏమైందని అడిగితే దీపక్ మందారాన్ని కొడతాడు. నీ చెండాలం ముఖం నాకు చూపించకు అని అంటాడు. మందారం ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















