Ammayi garu Serial Today November 29th: అమ్మాయి గారు సీరియల్: సూర్య ప్రతాప్‌కి ఆస్తిలో వాటా అడిగిన జీవన్.. పింకీకి టార్చర్.. ఎవరేం చేయలేరా!
Ammayi garu Today Episode బిజినెస్ చేస్తానని జీవన్ సూర్యప్రతాప్‌కి పింకీ తండ్రి వాటా అడగటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode విజయాంబిక దీపక్‌తో రాఘవని ఇంటికి రాకుండా ఆపుతావని తెలుసు కానీ చాలా కంగారు పడ్డానని రాజు నుంచి రాఘవని తప్పించి ఇంటికి రాకుండా మంచి పని చేశావని విజయాంబిక దీపక్‌తో అంటుంది. దాంతో దీపక్ నేను రాఘవని చూడలేదు దాయలేదు అని దీపక్ చెప్తాడు. విజయాంబిక షాక్ అయిపోతుంది. రాఘవ ఇంటికి రాకుండా అడ్డుకున్నది ఎవరు అని ఆలోచిస్తుంది.
ఇదంతా ఎవరు చేసుంటారా అని అని విజయాంబిక ఆలోచిస్తుంది. రాఘవని మనమే పట్టుకొని ప్రాణాలు తీసేయాలని తల్లీకొడుకులు అనుకుంటారు. ఇక చాలా జాగ్రత్తగా ఉండాలని విజయాంబిక దీపక్ అనుకుంటారు. మరోవైపు రాజు రాఘవని తీసుకొచ్చుంటాడని రాఘవ నిజం చెప్పుంటాడని పెద్దయ్యగారు, అమ్మగారు కలిసిపోయి ఉంటారని అప్పలనాయుడు, ముత్యాలు మాట్లాడుకుంటారు. ఇంతలో దిగులుగా అక్కడికి వచ్చిన విరూపాక్షిని చూసి షాకైపోతారు. ఏమైందని అడుగుతారు.
విరూపాక్షి: రాజుని కలవకుండా నేను మిమల్ని ఆపినట్లు మీరు నన్ను ఆపాల్సింది. రాఘవ రాలేదు ముత్యాలు. రాఘవ రాజుకి దొరికాడు కానీ ఇంటికి రాలేదు. ఏమైపోయాడో ఎవరికీ తెలీదు. రాఘవ దొరికిన ప్రతీసారి సూర్యకి నిజం తెలుస్తుందని ఆశ పడటం ఇంతలోనే ఇలా అవ్వడం ప్రతీ సారి నా ఆశలు అడియాశలు అయిపోతున్నాయి. అనవసరంగా నా వల్ల రూప మాటలు పడింది. ఇంకెప్పుడూ ఎవరు పిలిచినా ఆ గడప తొక్కను. సూర్యకు నా గురించి నిజం తెలిసినా తెలియకపోయాని నాకు ఏం బాధలేదు. నా కూతురు, భర్త బాగున్నారు అది చాలు నాకు.
ముత్యాలు: ఏంటయ్యా ఇలా జరిగింది.
అప్పలనాయుడు: అదే నాకు అర్థం కావడం లేదు ముత్యాలు. మనకి మంచి రోజులు వస్తాయి అమ్మగారు బాధ పడొద్దు.
రూప: పాపం అమ్మ రాజు ఎలా అయినా రాఘవ వస్తాడని అమ్మ చాలా ఆశపడింది. పైగా ఇక్కడ నాన్నతో అత్తతో మాటలు పడింది. పాపం అమ్మ ముందే చెప్పింది రాఘవ విషయంలో వచ్చే వరకు నమ్మలేం అని కానీ నేనే బలవంతంగా తీసుకొచ్చా.
రాజు: సారీ అమ్మాయి గారు నా వల్లే ఇదంతా అయింది. అనవసరంగా రాఘవని ఒంటరిగా పంపాను. రాఘవని వెతకాలి అమ్మగారు. విజయాంబిక గారే రాఘవని దాచారని పెద్దయ్యగారికి చెప్పాం కాబట్టి ఈ సారి రాఘవ విజయాంబిక గారికి దొరికితే చంపేస్తారు. అదే జరిగితే అమ్మగారిని పెద్దయ్యగారిని కలపలేం.
జీవన్: మీరిద్దరూ ఇలా ప్రేమ పావురాలులా ఉంటే ఎలా చూస్తూ ఉంటాను అనుకుంటున్నారురా. అస్సలు ఊరుకోను పింకీ పింకీ ఈ ఇంట్లో నన్ను నువ్వు గాలికి వదిలేస్తావా ఇప్పటి వరకు ఎవరూ భోజనం పెట్టరా ఇప్పుడే నా కోసం పాయసం చేసి ఇవ్వు.
పింకీ: నాకు చేయడం రాదు.
జీవన్: ఇలాగే పెంచారా మీ అమ్మనాన్న పాయసం చేయడం రాదా పది నిమిషాల్లో నాకు పాయసం కావాలి అదీ నువ్వే చేయాలి వెళ్లు.
జీవన్ పింకీ మీద అరిస్తే రాజు వచ్చి జీవన్ మీద కోప్పడతాడు దాంతో జీవన్ నేను నా పెళ్లానికి అడిగా నీ పెళ్లానికి కాదు కదా వెళ్లి మూలన కూర్చొ అంటాడు. పింకీ వీడియోలో చూసి పాయసం చేయడానికి రెడీ అవుతుంది. రాజు, రూపలు దూరం నుంచి చూస్తుంటారు. పాయసం చేస్తుండగా వేడి పాల గిన్నె చేతితో దించి పింకీ చేయి కాలిపోతుంది. సుమ, చంద్రలు పింకీ బాధ చూసి ఏడుస్తారు. జీవన్ కోసం పాయసం చేయడానికి వచ్చానని పింకీ చెప్తుంది. జీవన్ నవ్వుకుంటాడు. విజయాంబిక వాళ్లకి మేటర్ అర్థమవుతుంది. సూర్య ప్రతాప్ కూడా అక్కడికి వస్తాడు. జీవన్ పింకీకి పాయసం చేయమని సైగ చేస్తాడు. దాంతో పింకీ మళ్లీ పాయసం చేయడానికి వెళ్తుంది. అందరూ తిడతారు. సూర్య ప్రతాప్ ఏమైందని అడుగుతాడు. జీవన్ ఈ టైంలో పాయసం అడిగి మన పింకీకి ఇబ్బంది పెట్టాడని చెప్తాడు చంద్ర.
ఇక జీవన్ సూర్యతో నేను వచ్చి ఇన్ని రోజులు అయినా ఏం చేస్తున్నావ్ మీ కూతుర్ని ఎలా పెంచుతావని అడగటం లేదని అంటాడు. పింకీ కోసం పని చేయాలని అనుకుంటున్నానని బిజినెస్ చేస్తా నాకు డబ్బు కావాలని అడుగుతాడు. అందరూ షాక్ అయిపోతారు. ఫ్యాక్టరీ కట్టుకోవడానికి భూమి కావాలని అడుగుతాడు. రాజు ఎప్పుడూ ఇలా అడగలేదని రూప అంటే అది చేతకాని వాడి లక్షణం అని జీవన్ అంటాడు. ఇక విజయాంబిక ఇలా నువ్వు అడగాల్సిందిరా ఇప్పుడు మామయ్య వాడికి డబ్బు ఇస్తే జీవన్‌కి ఆస్తి వెళ్లిపోతుందని అనుకుంటారు. ఇక సూర్య ఎంత కావాలని జీవన్‌కి అడుగుతాడు. దాంతో జీవన్ మా మామయ్యకి రావాల్సిన వాటా మొత్తం నా పేరు మీద రాసివ్వమని అడుగుతాడు. దానికి చంద్ర నేను వేరు మా అన్నయ్య వేరు అనే ఆలోచన మాకు లేదు అలాంటిది నువ్వు నా వాటా అడుగుతావా అని కోప్పడతాడు. సుమ కూడా మాకు ఎలాంటి వాటా లేదు మా బావగారి కష్టం మీద బతుకుతున్నామని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.