Ammayi garu Serial Today May 9th: అమ్మాయి గారు సీరియల్: వామ్మో విజయాంబిక ఇంత దుర్మార్గురాలా.. గతంలో చేసిన పాపం తెలిస్తే వణుకు పుట్టాల్సిందే!
Ammayi garu Today Episode గతంలో రూపతో పుట్టిన మరో బిడ్డను విజయాంబిక దారుణంగా చంపడం అడ్డు వచ్చిన విరూపాక్షి తండ్రిని కూడా చంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూపతో పాటు పుట్టిన కవల బిడ్డే రుక్మిణి అని సూర్యప్రతాప్‌తో రుక్మిణి చెప్తుంది. పేపర్‌లో యాడ్ చూసి నా తల్లిదండ్రుల్ని నిలదీస్తే నేను వాళ్లకి దొరికిన బిడ్డను అని చెప్తారని ఇంకా దబాయించి అడిగితే నేను నీ బిడ్డే అని చెప్పారని అంటుంది. అందరూ ఆలోచనలో పడతారు. ఇదంతా అబద్ధం అని ఆస్తి కోసమే వచ్చిందని విజయాంబిక అంటుంది. చంద్ర మాత్రం ఆ అమ్మాయి చెప్పింది నిజమే అయిండొచ్చు అని అంటారు.
రుక్మిణి: అయిండొచ్చు కాదు చిన్నాయన. నేను చెప్పిందే నిజం. చూడు నాయనా చుట్టాలు నమ్మకపోవచ్చు ఇక్కడున్న వాళ్లు నమ్మకపోవచ్చు కానీ కన్నతల్లి మాత్రం గుర్తు పడుతుంది కదా నాయనా. అందుకనే నేను ముందు మా అమ్మని కలిశాను నాయనా. మా అమ్మ చెప్తే నమ్ముతారా పిలుస్తాను ఆగు నాయనా. అమ్మా.. విరూపాక్షి లోపలికి వస్తుంది. రాజుతో పాటు అందరూ షాక్ అయిపోతారు.
విజయాంబిక: దీపక్ ఈ విరూపాక్షి ఏదో ప్లాన్ చేసినట్లుంది ఎలా అయినా దీన్ని దెబ్బ కొట్టాలి.
రుక్మిణి: ఆడనే ఆగిపోయావే రామ్మా.. నాయనా కావాలి అంటే ఇప్పుడు అడుగు.
విజయాంబిక: తమ్ముడు ఇప్పటికైనా అర్థమైందా తమ్ముడు ఇదంతా విరూపాక్షి ప్లాన్. విరూపాక్షిని నువ్వు చీ కొడుకుతున్నావ్ అని కూతురిని అడ్డు పెట్టుకొని ఆస్తి కొట్టేయాలి అని రూపని రాజుని పెళ్లి చేసింది ఇప్పుడు ఈ డ్రామా ఆర్టిస్ట్‌ని తీసుకొచ్చింది.
రుక్మిణి: అత్తని కొట్టడానికిచేయి ఎత్తి అత్త డ్రామా ఆర్టిస్ట్ అన్నావ్ అంటే దవడ పళ్లు రాలతాయ్. నాయనా ఉన్నాడు కదా అని ఒక్క దెబ్బతో ఊరుకుంటున్నా నాకు తిక్క రేగింది అంటే నా లెక్క వేరే ఉంటుంది.
విరూపాక్షి: సూర్య ఆస్తి మీద నాకు ఆశ లేదు. మనకు కవలలు పుట్టిన తర్వాత ఇంకో బిడ్డ చనిపోయిందని అందరిలానే బాధ పడ్డాను. మనకు ఒక బిడ్డను దూరం చేసినా ఇంకో బిడ్డ ఉందని సంతోష పడ్డాను. రుక్మిణి చెప్పిన తర్వాత నిజం తెలిసింది. నేను పురుడు పోసుకున్న ఆ హాస్పిటల్‌లోనే రుక్మిణి వేరే వాళ్లకి దొరికిందంట. ఈ అమ్మాయిని తాకగానే నాకు రూప తాకినట్లే అనిపించింది మన రూప మళ్లీ తిరిగి వచ్చినట్లు అనిపించింది.
రుక్మిణి: ఏంటి నాయనా అట్లా ఆలోచిస్తున్నావు. నన్ను చూడగానే ఎగిరి గంతేస్తాను అనుకున్నానే మీరు ఏంటి ఇలా చూస్తున్నారు. చిన్నాయన మీరు చెప్పండి నేను మీ బిడ్డనే అని.
బంటీ: అంటే నువ్వు మా అమ్మవి కాదా.
రుక్మిణి: ఈ బుడ్డోడు ఎవరు.
విరూపాక్షి: మీ అక్క రూప కొడుకు.
రుక్మిణి: అరే భలే ఉన్నాడే. మీ అమ్మ లేదని నువ్వేం బాధ పడకు నీకు ఈ అమ్మ ఉండాదీ. నన్ను అమ్మా అని పిలు. నువ్వు మా అక్క మొగుడివి కదా. మా అక్క మొగుడు అంటే నాకు బావ అవుతాడు. చూడు బావ మా అక్క లేని లోటు తీర్చలేను కానీ నీ కొడుకుకి తల్లి లేని లోటు తీర్చుతా.
రాజు: అమ్మాయి గారు ఎందుకు ఇలా చేస్తున్నారు మీ రు రుక్మిణి కాదు నా అమ్మాయిగారు.
రుక్మిణి: అయ్యో బావ నువ్వు కూడా పొరపాటు పడుతున్నావ్. నేను రుక్మిణిని.
సూర్యప్రతాప్: నువ్వు చెప్పేవన్నీనిజమా కాదా నాకు అర్థం కావడం లేదు. నా రూప పోయిన బాధలో నేను ఉన్నాను. నా దృష్టిలో రూపనే నా కూతురు. రూప స్థానంలో ఎవరినీ ఊహించుకోలేను.
రుక్మిణి: మీ బాధ నాకు అర్థమైంది నాయనా. ఈ పొద్దు వచ్చుండకూడదు అని నాకు తెలుసు కానీ ఒక బిడ్డ పోయింది అని తెలిసినప్పుడు మరో బిడ్డ బతికుందని తెలిస్తే సంతోష పడతారు అని వచ్చా. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మీ ఇంటి బిడ్డనే నాయనా.
విజయాంబిక: ఈ ఇంట్లో ఇద్దరు బిడ్డలు ఉంటే మనకు ఆస్తి దొరకడం కష్టం అని ఆరోజే ఒక బిడ్డని చంపేశాను.
ఫ్లాష్ బ్యాక్..
విరూపాక్షికి డెలివరీ కోసం హాస్పిటల్‌కి తీసుకొస్తారు. అందరూ హాస్పిటల్ బయట వెయిట్ చేస్తుంటారు. ఈ కాన్పునే విరూపాక్షికి మొదటి చివరి కాన్పు అవుతుందని విజయాంబిక అనుకుంటుంది. సూర్యప్రతాప్ టెన్షన్ పడుతుంటే విరూపాక్షి తండ్రి వచ్చి మీకు వారసుడో వారసురాలో వస్తుంది టెన్షన్ వద్దు అంటారు. దాంతో నాకు టెన్షన్ వారసుల కోసం కాదు విరూపాక్షి కోసం అని సూర్యప్రతాప్ చెప్తాడు. విరూపాక్షికి డెలివరీ అవుతుంది. డాక్టర్ వచ్చి సూర్యప్రతాప్తో మీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్తారు. తల్లి లేచాక చూడొచ్చని చెప్తుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఆస్తి తనకు రాదని అందులో ఒక బిడ్డను చంపేయాలి అని అనుకొని సూర్యప్రతాప్తో బట్టలు తీసుకొస్తా అని చెప్పి విరూపాక్షి గదికి వెళ్తుంది. నర్స్‌కి ఉంగరం ఇచ్చి ఒకరిని చంపేయాలి అంటుంది. స్వయానా విజయాంబికనే ఒక బిడ్డ నోరు నొక్కేసి చంపేస్తుంది. నర్స్ షాక్ అయిపోతుంది. విజయాంబిక చేసిన దుర్మార్గం విరూపాక్షి తండ్రి చూసేస్తాడు. దాంతో విరూపాక్షి షాక్ అయిపోతుంది. ఆయన విరూపాక్షి తండ్రి విజయాంబికను తిడతాడు. సూర్యప్రతాప్తో విషయం చెప్తానని అనడంతో ఆయన తల మీద సిలెండర్‌తో కొట్టి చంపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















