Ammayi garu Serial Today May 8th: అమ్మాయి గారు సీరియల్: రూపకి ట్విన్ సిస్టర్ ఉందా.. ఇదేం ట్విస్ట్ బాబోయ్.. నాయనా అంటూ రుక్మిణీ ఎంట్రీ..!
Ammayi garu Today Episode రూపతో పాటు మరో అమ్మాయి పుట్టిందని రుక్మిణి ఎంట్రీ ఇవ్వడం మేనత్తని కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప శవానికి రాజు అంత్యక్రియలు చేస్తాడు. కొడుకుని పట్టుకొని అంత్యక్రియల్లో పాల్గొంటాడు. సూర్యప్రతాప్, విరూపాక్షి గుండె పగిలేలా ఏడుస్తారు. విజయాంబిక దీపక్‌తో రూప మన జీవితాలు మంట కలిపేయాలి అనుకుంది కానీ తనకే నిప్పు పెట్టేలా చేశాం అని అంటుంది. దీపక్ తల్లితో సూర్యప్రతాప్ వెళ్తూ కొడుకుని పరిచయం చేసింది వాడిని వారసుడిని చేస్తాడేమో బంటీని, రాజుని చంపేయాలి అంటాడు.
సూర్యప్రతాప్ కూతుర్ని తలచుకొని తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని ఏడుస్తాడు. విరూపాక్షి కూడా కూడా కూతుర్ని తలచుకుని చాలా ఏడుస్తుంది. రాజు, బంటీలు రూప శవానికి నిప్పు పెడతారు. అందరూ ఏడుస్తూ కదులుతారు. రాజు రూపతో గడిపిన క్షణాలు తలచుకొని ఏడుస్తాడు. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా అని మూజిక్‌కి రాజు, రూపల సంతోష క్షణాలు చూపిస్తూ ఉంటే ఏడుపు రాక మానదు. ఉదయం ఇంటి దగ్గర రూప ఫొటో పెడతారు. అందరూ నివాళులు అర్పిస్తారు. కార్యకర్తలు, రాజకీయ నాయకులు వస్తారు. రూప మన మధ్య లేదని రూప మనతోనే ఉందని అనిపిస్తుందని సుమ భర్తతో చెప్పి ఏడుస్తుంది.
రాజు రూప తనకి ప్రపోజ్ చేయడం ఇద్దరూ పెళ్లి చేసుకోవడం రూపతో సంతోషంగా ఉండటం ప్రెగ్నెన్సీ బంటీతో సంతోషంగా గడపటం అన్నీ తలచుకొని కుమిలిపోతాడు. అమ్మ నాకు కావాలి నాన్న అమ్మ కావాలి అని బంటీ ఏడుస్తాడు. రాజు బంటీతో నువ్వు ఏడ్వకు బంటీ నువ్వు ఏడిస్తే ఇక్కడే ఎక్కడో ఉంటుంది నీ ఏడుపు చూసి తను ఏడుస్తుందని అంటాడు. రూప చావుకి అర్థం ఉండాలి అంటే బంటీని రాజుని చంపేసి ఆస్తి మన సొంతం చేసుకోవాలని విజయాంబిక, దీపక్‌లు అనుకుంటారు. విరూపాక్షి కూడా రాలేదు అని విజయాంబిక అంటే అత్త రావాలి అంటే రూప ఉండాలి మరి రూప లేకపోతే రావడం కుదరదు అని అంటాడు. ఒక దండ వేసి దొంగ ఏడుపు ఏడ్చి వద్దాం పద అంటాడు. ఇద్దరూ వెళ్లి నీ రుణం తీర్చుకోలేం రూప అనుకుంటారు.
దీపక్, విజయాంబికలు దండ వేస్తూ ఉంటే ఆగండీ అంటూ కొత్త గెటప్‌లో అచ్చం రూపలా ఉన్న రుక్మిణి ఎంట్రీ ఇస్తుంది. అందరూ రూపే వచ్చిందని షాక్ అయిపోతారు. విజయాంబిక, దీపక్‌లకు చెమటలు పట్టేస్తాయి. సూర్యప్రతాప్ మనసులో నిన్నే కదా రూపకి దహన సంస్కారాలు చేసింది ఇది నిజమా కలా అనిఅనుకుంటాడు. అందరూ రూప రూప అని పిలుస్తారు. రుక్మిణి ఆవేశంగా వెళ్లి దీపక్, విజయాంబికల చేతిలో దండ తీసుకొని విసిరేసి విజయాంబికను లాగిపెట్టి కొడుతుంది. తర్వాత దీపక్‌ని కొడుతుంది. అచ్చం రూపలా ఉంది రూప అయ్యే ఛాన్స్ లేదు అనుకుంటారు. అందరూ రూప అని పిలిచి రాజు అమ్మాయిగారు అని బంటీ అమ్మ అనడంతో రూప ఎవరో తెలీనట్లు చూస్తుంది.
రుక్మిణి అందరితో మీరందరూ నన్ను క్షమించాలి మీరు అనుకున్నట్లు నేను రూపని కాదు అని చూపిస్తుంది. విజయాంబిక దీపక్ రూప చనిపోయింది అనిపించడం లేదు పిచ్చి ఎక్కిందేమో అని అంటుంది. ఇక సూర్య రుక్మిణితో నా బిడ్డలా ఉన్నావ్ ఎవరు నువ్వు అని అడుగుతాడు. నేను రూపని కాదు కానీ రూపతో కలిసి పుట్టిన తోబుట్టివుని నాయనా అని సూర్యతో చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. విజయాంబిక మనసులో రూపతో పుట్టిన బిడ్డని ఆరోజే చంపేశా కదా అని అనుకుంటుంది. నాటకాలు ఆడుతుంది తమ్ముడు అని విజయాంబిక అంటే చూడత్తో నాకు నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు నేను మా నాయన రక్తం పంచుకుపుట్టిన బిడ్డనే రుక్మిణిని అని అంటుంది. దీపక్ మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. మంచిగా అడిగావ్ మామ నేను చనిపోయాను అని పేపర్‌లో వేశారు అది చూసి అందరూ నేను అని నాకు చెప్పారు అప్పుడు అర్థమైంది నీ బిడ్డను అని నాయన అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!
Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!





















