Ammayi garu Serial Today March 11th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి కోసం అక్కని తప్పు పట్టిన విజయాంబిక.. ఎమ్మెల్యే ఎవరో!
Ammayi garu Today Episode దీపక్‌ని విడిపించమని విజయాంబిక సూర్యకి చెప్పడం సూర్య అక్క మీద కోప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి జైలులో దీపక్‌ని లాగిపెట్టి కొడుతుంది. ఏం బతుకులురా మీవి అని ఛీ కొడుతుంది. సింపథీ కోసం కన్న తల్లినే చంపాలి అనుకున్నావ్ నువ్వు ఒక కొడుకువేనా అని తిడుతుంది. దీపక్‌ని ఎవరూ కాపాడలేరని రూప చెప్పి తల్లిని తీసుకొని వెళ్లిపోతుంది. కటకటాల పాలైన దీపక్ మిమల్ని ఊరికే వదలను అని అనుకుంటాడు.
విరూపాక్షి కూతురు, అల్లుడికి థ్యాంక్స్ చెప్తుంది. రూప తల్లితో నువ్వు గెలిస్తే మన జీవితాలు బాగు పడతాయి నువ్వు కచ్చితంగా గెలవాలి అమ్మ అని అంటుంది. ఇక అందరూ ఇళ్లకి బయల్దేరుతారు. రాత్రి సూర్యప్రతాప్ ఇంట్లో అందరూ దీపక్ గురించి ఆలోచిస్తుంటారు. దీపక్‌ని ఎలా అయినా బయటకు తీసుకురావాలని విజయాంబిక అనుకుంటుంది. ఇక రాజు తల్లిదండ్రులు విరూపాక్షికి సపర్యలు చేస్తారు. తాను కష్టాల్లో ఉన్న ప్రతీ సారి రాజు కాపాడుతున్నాడని రాజుకి విరూపాక్షి థ్యాంక్స్ చెప్తుంది. ఇక విరూపాక్షికి ముత్యాలు దిష్టి తీస్తుంది.
విజయాంబిక: మీ కడుపు చల్లగా ఉందా రూప. మీరందరూ కలిసి మీ అమ్మని బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేశారు. బయటకు తీసుకొచ్చారు. మళ్లీ దీపక్‌ని అరెస్ట్ చేయించడం ఎందుకు. అయినా నేను చెప్తున్నా కదా నన్ను పొడిచింది దీపక్ కాదు అని.
సూర్యప్రతాప్: అక్కా ఇందులో నీ తప్పు కూడా ఉంది. నిన్ను పొడిచింది విరూపాక్షి కానప్పుడు విరూపాక్షి పొడవలేదని నువ్వు ఎందుకు చెప్పలేదు అక్క.
రూప: ఎందుకంటే పొడిచింది అమ్మ కాదని చెప్తే దీపక్ పేరు చెప్పాలి కదా నాన్న.
విజయాంబిక: తమ్ముడు నాకు పొడిచింది దీపక్ అని తెలియదు.
మౌనిక: దీపక్ మర్డర్ చేశారు అని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు కదా పెద్దయ్య.
మందారం: అవును పెద్దయ్య.
సుమ: అలా అని దీపక్ ఇలా చేయలేదు అనడానికి కూడా ఆధారాలు లేవు కదా.
దీపక్‌ని విడిపించమని విజయాంబిక అడిగితే సూర్యప్రతాప్ వద్దని ఇప్పుడు ఇలా చేస్తే నెగిటివ్ అవుతుందని అంటాడు. మౌనిక కూడా దీపక్ జైలులోనే ఉంటేనే సంపథీ ఓట్లు వస్తాయని అంటుంది. విజయాంబిక కరెక్టే అనుకుంటుంది. దీపక్ చేసింది తప్పు కాబట్టి ప్రజలు తన అత్తకి ఓటు వేయరని రూప అనుకుంటుంది. ఇక రేపే ఎలక్షన్ అని సిద్ధంగా ఉండమని సూర్యప్రతాప్ చెప్తాడు. రూప విజయాంబికతో అత్తయ్యా అని దీర్ఘాలు తీసి కత్తితో అలా ఎలా పొడిచాడు అత్తయ్య ఒక్క రోజులో లేచి నిల్చొన్నాడని అంటుంది. దీపక్ బయటకు రాలేడని చెప్తుంది. మౌనిక అత్తతో విరూపాక్షికి అంత సీన్ ఉందా మనం ఓడిపోతామా అంటే దానికి అంత లేదు కానీ రాజు గాడికి ఉందని అంటుంది. ఇక విజయాంబిక దీపక్‌నే తనని పొడిచాడని అంటుంది. మౌనిక షాక్ అయిపోతుంది. రాజు వాళ్లు కూడా విరూపాక్షి గెలుస్తుందని అనుకుంటారు. బస్తీ మొత్తం మీ వెనకే ఉందని అంటారు.
ఎలక్షన్ పూర్తయిపోతుంది. నేను లేకుండానే ఎలక్షన్ అయిపోయిందని దీపక్ ఫీలవుతాడు. విజయాంబిక పోలీస్ స్టేషన్‌కి వస్తుంది. సెల్ ఓపెన్ చేయమని విజయాంబిక అంటే పోలీసులు కుదరదు అంటారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వీళ్ల పని చెప్తా అంటుంది. ఎలక్షన్‌లో జీవన్ చాలా సాయం చేశాడని అంటుంది. రూప రాజు ఫొటో చూస్తూ మాట్లాడుతుంటే రాజు కాల్ చేస్తాడు. ఇంటి దగ్గరకు వచ్చాను రమ్మని అంటాడు. రూప టెన్షన్ పడుతుంది. మీరు రాకపోతే నేను వస్తానని రాజు అంటాడు. దాంతో నేనే వస్తాను అని రూప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్ ఇంట్లో ఆస్తి పంపకాల రచ్చ.. కార్తీక్ నిర్ణయానికి కుస్తీలు పడుతున్న తండ్రి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

