అన్వేషించండి

Ammayi garu Serial Today December 13th: అమ్మాయి గారు సీరియల్: సూర్య ఫ్యామిలీకి అవిశ్వాస తీర్మానం షాక్.. తల్లీకొడుకుల్ని బెదిరించిన జీవన్.. ఫాలో అయిన మందారం!

Ammayi garu Today Episode జీవన్, గౌతమ్‌లు ఎమ్మెల్యేలను కొనేయడంతో సూర్య ప్రతాప్‌ కుటుంబం మొత్తం షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode మందారం ఇచ్చిన పాలు ఫస్ట్‌నైట్ గదిలో రూప, రాజులు తాగేస్తారు. తర్వాత ఇద్దరూ ఫస్ట్‌నైట్ వద్దనుకొని చెరో వైపు తిరిగి పడుకుంటారు. కానీ మందారం కలిపిన పౌడర్‌ ఫలితంగా ఇద్దరూ చలి అనుకొని ఒకరిని పట్టుకొని ఒకరు పడుకుంటారు. ఉదయం ఇద్దరూ నిద్ర లేచి తమకు ఫస్ట్‌ నైట్ అయిపోయిందని బిత్తర పోతారు. ఇలా ఎలా జరిగింది అనుకొని కంగారుపడతారు. మనకు తెలీకుండానే ఇలా అయిపోయిందేంటి అనుకొని టెన్షన్ పడతారు. అయిందేదో అయిపోయింది ఇక ఇలాంటివి వద్దని రూప చెప్తుంది. దీని గురించి ఇక్కడే మర్చిపోదాం అంటుంది. 

మందారం విరూపాక్షికి కాల్ చేసి ప్లాన్ సక్సెస్ అయిందని చెప్తుంది. దీపక్, విజయాంబికలు ఆ మాటలు విని మందారాన్ని అంత ఈజీగా వదలకూడదని సమయం చూసి మందారం అంతు చూడాలని అనుకుంటారు. ఇక ముత్యాలు ఇంట్లో అందరూ చాలా సంతోషపడతారు. మందారం వల్లే అంతా సాధ్యమైందని అనుకుంటారు. అందరికీ స్వీట్ చేస్తానని విరూపాక్షి వెళ్తుంది. జీవన్, గౌతమ్, శ్వేతలు మాట్లాడుకుంటారు. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయితే ఓకే లేదంటే సూర్యప్రతాప్‌ ఉంచడని జీవన్ అంటే అంతా మా చిన్న మామయ్య చూసుకుంటాడని గౌతమ్ అంటాడు. ఇక వార్తల్లో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రకటించాయని బ్రేకింగ్ న్యూస్ వస్తుంది.

అది చూసి సూర్యప్రతాప్‌ ఫ్యామిలీ మొత్తం షాక్ అయిపోతారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని రాజు అంటాడు. విరూపాక్షి, ముత్యాలు వాళ్లు కూడా న్యూస్ చూసి బిత్తరపోతారు. ఇదేంటి అని అనుకుంటారు. గౌతమ్ చిన్నాన్నగా పోసాని రెచ్చిపోతాడు. సీఎం వేస్ట్ అని ఆయన అర్హుడు కాదని మీడియాలో రెచ్చిపోతాడు. గౌతమ్ వాళ్లు చూసి సంతోషపడతారు. సీఎంని వ్యతిరేకించి సొంత పార్టీ ఎమ్మెల్యేలే సంతకాలు పెట్టారని చెప్తారు. దాంతో సూర్యప్రతాప్‌ మరీ షాక్ అయిపోతాడు. ఏదో పొరపాటు జరిగిందని ఎమ్మెల్యేలతో మాట్లాడుదామని చంద్ర చెప్తాడు. ఇక రాజు అయితే ఇదంతా జీవన్ పనే అయింటుందని అంటాడు. పింకీ కూడా అవునని వాడు మీ పెద్దనాన్నని సీఎం పదవి నుంచి దించేస్తానని చెప్పాడని అంటుంది. 

ఎలక్షన్‌ టైంలో జీవన్, గౌతమ్ ప్రచారం చేశారని ఇప్పుడు వాళ్ల ఇన్ఫులియన్స్‌తో ఇదంతా చేశారని అంటాడు. ఇక శ్వేత సూర్యప్రతాప్‌ వాళ్లు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలి అంటే విజయాంబిక మన పక్కన ఉండాలని చెప్పడంతో జీవన్ విజయాంబికకు కాల్  చేస్తాడు. తల్లీకొడుకులు ఫోన్ రావడంతో పక్కకు వెళ్తారు. ఇక ఇంట్లో అందరికీ ఈ విషయం మీద కాల్స్ వస్తుంటాయి. జీవన్‌తో మాట్లాడటానికి విజయాంబికి ఒప్పుకోదు కాల్ కట్ చేస్తా అంటే మాతో చేతులు కలపకపోతే కాళ్లు పట్టుకోవాల్సి వస్తుందని అంటాడు. దీపక్ కూడా ఇష్టం వచ్చినట్లు జీవన్‌ని తిడతాడు. దాంతో జీవన్ మీకు కావాల్సిన రాఘవ మా దగ్గర ఉన్నాడని చెప్తాడు. దీపక్ నమ్మకపోతే జీవన్ వీడియో కాల్ చేసి రాఘవని చూపిస్తాడు. దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. జీవన్ దీపక్‌కి లొకేషన్ పంపించి అక్కడికి రమ్మని చెప్తాడు. దీపక్ మాటలు విన్న మందారం వాళ్లని ఫాలో అవుతుంది. రూప తండ్రితో ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి లేదంటే బెదిరించి ఇలా చేసుకుంటారని అంటుంది. వాళ్లతో మాట్లాడుదామని అంటే సూర్యప్రతాప్‌ వద్దని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: మొగుడుపెళ్లాల ఉగ్రరూపం.. గజగజ వణికిపోయిన జ్యోత్స్న, పారిజాతం.. కార్తీక్‌కి డౌట్!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 10th:విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
నువ్వులేక నేను లేను: విక్కీ తన భర్తని చిట్టికి చెప్పేసిన రాధ...ఎందుకు చెప్పావంటూ భార్యను నిలదీసిన విక్రమ్
Podarillu Serial Today August 10th: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?
పొదరిల్లు: మాధవ్‌ జాతకం చూసి పండితులు ఏం చెప్పారు..? నారాయణ కుటుంబానికి ఉన్న శాపం ఏంటి..?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Hushar Pittalu Trailer : ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
ఆడియన్స్ దేవుళ్లకు ప్రత్యేక పూజలు - 'హుషార్ పిట్టలు' మరీ ఇంత హుషారుగా ఉన్నారేంటీ?
పల్సర్‌ 150లో భారీ మార్పులు.. కొత్త ఇంజిన్‌, కొత్త ఫ్రేమ్‌తో వస్తున్న బజాజ్‌ యూత్‌ఫుల్‌ బైక్‌!
కొత్త బజాజ్‌ పల్సర్‌ 150 న్యూ లుక్‌ భలే ఉంది, మీరు చూశారా?.. ఫోటోలు లీక్‌
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
Embed widget