Karthika Deepam 2 Serial Today December 13th: కార్తీకదీపం 2 సీరియల్: మొగుడుపెళ్లాల ఉగ్రరూపం.. గజగజ వణికిపోయిన జ్యోత్స్న, పారిజాతం.. కార్తీక్‌కి డౌట్!
Karthika Deepam 2 Serial Today Episode దీప మీద అటాక్ చేసిన రౌడీలను దీప, కార్తీక్‌లు చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న పురమాయించిన రౌడీ దీపకి కాల్ చేసి పాప పడిపోయింది స్కూల్ దగ్గరకు రమ్మని చెప్తాడు. ఆ రౌడీ ఆటో డ్రైవర్‌లా గెటప్ వేసుకొని రెడీగా ఉంటే దీప ఆయన్ని స్కూల్ దగ్గరకు వెళ్లాలని చెప్తుంది. ఆ రౌడీ ఆటోలో స్కూల్‌కి బయల్దేరుతుంది. ఆ రౌడీ దీపని చూసి ఇంత అమాయకురాలిని చంపమని చెప్పింది ఏంటి అనుకుంటాడు. దీపని వేరే వైపు తీసుకెళ్తాడు. ఇది రూట్ కాదు కదా అని దీప అంటే తొందరగా తీసుకెళ్లమన్నావ్ అని తీసుకొచ్చా అని ఎవరూ లేని చోటుకు తీసుకెళ్తాడు.
ఓ చోట ఆటో ఆపి దీపని దిగమని చెప్తాడు. పాపకి ఏం కాలేదని నాటకం ఆడింది నేనే అని చెప్పి రౌడీలను పిలిచి నిన్ను తీసుకొచ్చింది చంపడానికి అని అంటాడు. ఆ రౌడీలు దీపని చుట్టు ముడతారు. దరువు వేస్తూ చుట్టూ తిరుగుతారు. జ్యోత్స్న, పారిజాతం దూరం నుంచి చూసి మా బావని పెళ్లి చేసుకున్నందుకు నేను నీకు ఇచ్చే గిఫ్ట్ చావే అని అంటుంది. మరోవైపు పాపకి ఏమైందా అని అనసూయ టెన్షన్ పడుతుంటుంది. కార్తీక్ వచ్చి దీపని పిలిస్తే అనసూయ కార్తీక్‌తో శౌర్య కళ్లు తిరిగి పడిపోయిందని చెప్పి వెళ్లిపోయిందని అంటుంది. శౌర్య సమస్య దీపకి తెలిస్తే దీపని ఓదార్చడానికే మనకి రోజులంతా సరిపోతాయని ఏమైనా ఉంటే నాకు చెప్పాల్సింది కదా అని కార్తీక్ అంటాడు. ఇక కాంచన స్కూల్ నుంచి ఏ ఫోన్ అయినా నీకు రావాలి కదరా దీపకు రావడం ఏంటి అంటాడు. అప్పుడే కార్తీక్‌కి కూడా డౌట్ వస్తుంది. కార్తీక్ స్కూల్ దగ్గరకు బయల్దేరుతాడు. కాంచన, అనసూయలు టెన్షన్ పడతారు.
ఇక దీప ఉగ్రరూపం ఎత్తి రౌడీలను చితక్కొడుతుంది. దీనికి మనం స్కెచ్ వేస్తే ఇదేంటి ఇలా కొడుతుందని జ్యోత్స్న, పారిజాతం అనుకుంటారు. అందరు రౌడీలను దీప కుమ్మేస్తుంది. మెయిన్ రౌడీ దీపని చంపాలని వస్తే ఇంతలో కార్తీక్ ఎంట్రీ ఇచ్చి వాడిని చితక్కొడతాడు. ఇదంతా ప్లాన్‌తోనే జరిగిందని కార్తీక్ అంటాడు. మీ వెనక ఎవరు ఉన్నారని అడుగుతాడు. ఇక కార్తీక్‌ని చంపేస్తామని రౌడీలు పట్టుకుంటే మళ్లీ దీప కార్తీక్ ఇద్దరూ రౌడీలను కొడతారు. దీప ఆ రౌడీలు తాగిన మందు బాటిల్స్‌ని టవల్‌లో చుట్టి కొడుతుంది. మిమల్ని పంపింది ఎవరు అని అడుగుతారు. దాంతో రౌడీ ఇద్దరి కళ్లలో మట్టి విసిరేసి పారిపోతాడు. జ్యోత్స్న వాళ్లు కూడా వెళ్లిపోతారు. దీప వాటర్ తీసుకొచ్చి కార్తీక్‌కి ఇస్తుంది. ఎవరై ఉంటారని దీప అంటే నర్శింహ అయింటాడని మన పెళ్లి గురించి తెలుసుకొని ఇలా చేసుంటాడని అంటుంది. కార్తీక్ ఆలోచనలో పడతాడు.
దీపని తీసుకొని ఇంటికి బయల్దేరుతాడు. ఇక దీప ఫోన్ తీసుకుంటుంది. జ్యోత్స్న పారిజాతం దీప ఉతుకుడుకు కంగుతింటారు. పెళ్లి తర్వాత నర్శింహకి ఇలాగే తగిలుంటాయి అందుకే వదిలేసుంటాడని అంటుంది పారిజాతం. కార్తీక్ వాళ్లు ఎవరై ఉంటారని అనుకుంటారు. ఇక జ్యోత్స్న పారిజాతంతో బావకి మన మీద అనుమానం వస్తే అని అంటుంది. ఇంతలో కార్తీక్‌కి అనుమానం వచ్చి కాల్ చేస్తాడు. పారిజాతం, జ్యోత్స్న ఇద్దరూ భయపడతారు. జ్యోత్స్న కాల్ మాట్లాడమని చెప్తుంది. కార్తీక్ పారిజాతంతో నా భర్య మీద అటాక్ జరిగింది నువ్వు చేశావా జ్యోత్స్న చేసిందా అని అడుగుతాడు. నా భార్యని చంపాల్సిన అవసరం నర్శింహకి రెండోది జ్యోత్స్నకి మాత్రమే అవసరం అని అంటాడు. నీ పక్కనే ఉన్న తనకి చెప్పు నా భార్య సేఫ్ అని అంటాడు. దానికి పారిజాతం రివర్స్ అయిపోతుంది. నీ భార్యని తన మాజీ భర్త లేదంటే వాడి భార్య చంపాలని ప్రయత్నించుంటారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: సత్యభామ సీరియల్: సత్య పుట్టింటికి వచ్చి రచ్చ చేసిన భైరవి.. సత్యకి మహదేవయ్య మాస్ వార్నింగ్!