Ammayi garu Serial Today April 29th: అమ్మాయి గారు సీరియల్: దీపక్‌ని చెప్పుతో కొట్టిన తల్లి.. చితక్కొట్టిన మామ.. చాటింగ్ చూపించి ఓ ఆట ఆడుకున్న రాధిక!
Ammayi garu Today Episode దీపక్ తనతో రాత్రి పూట చాటింగ్ చేశాడని రాధిక సూర్యప్రతాప్‌కి చెప్పడం సూర్య దీపక్‌ని చితక్కొట్టడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ తనని పెళ్లి చేసుకుంటానని తన బిడ్డకు తండ్రి అవుతానని చెప్పి నగలు, రింగ్ ఇచ్చాడని రాధిక సూర్యప్రతాప్‌తో సహా అందరికీ చెప్తుంది. విజయాంబిక, దీపక్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. దీపక్ రివర్స్ అయిపోతాడు. మా మామయ్య మీద వేసిన నిందలు సరిపోలేదా ఇప్పుడు నా మీద వేస్తున్నావ్ ఆ రోజు ఈ నగలు మా మామయ్య ఇచ్చారని మీడియాతో చెప్పావు కదా అంటాడు. అందరూ ఆలోచనలో పడతారు. ఇంతలో రాధిక రాత్రి నువ్వు చేసిన చాటింగ్ అబద్ధమా అని అడుగుతుంది.
దీపక్, విజయాంబిక షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్ దీపక్‌ని అనుమానంగా చూస్తారు. రూప, రాజు, మందారం నువ్వుకుంటారు. దీపక్ నేను చాటింగా అని నోరెళ్ల బెడతాడు. రాధిక ఫోన్ ఇచ్చి మెసేజ్‌లు చదవమని అంటుంది. రాజు తాను చదువుతానని అంటాడు. దీపక్ చేసిన చాటింగ్ రాజు, రాధిక చేసిన చాటింగ్ రూప చదువుతారు. హాయ్ స్వీటాహార్ట్.. డార్లింగ్ అంటూ దీపక్ చాట్ చేసినట్లు.. దానికి రాధిక వార్నింగ్ ఇచ్చి తప్పుగా మాట్లాడకు అని చెప్పినట్లు చాటింగ్ ఉంటుంది. ఆ చాటింగ్ విని మందారం ఏడుస్తుంది. ఇదంతా అబద్ధం మామయ్య నేనేం చాటింగ్ చేయలేదు మామయ్య అని అంటాడు.
రూప, రాజులు మెసేజ్‌లు చదువుతూ యాక్టింగ్ కూడా చేస్తారు. దీపక్ రాధికతో మనకు అడ్డు అయితే నా భార్యని చంపేస్తా నీ కొడుకుకి తండ్రి అవడానికి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మెసేజ్ చేశారని చెప్తారు. మందారం నా జీవితం నాశనం అయిపోయిందని పెద్దయ్య అని ఏడుస్తున్నట్లు నవ్వుతుంది. ఐలవ్‌యూ డియర్, ఐమిస్ యూ డియర్ అని ముద్దులు పెట్టాడని చెప్తారు. మందారం ఏడుస్తూ ఏంటి దీపక్ ఇది నేను ఏం తప్పు చేశాను.. మీకేం లోటు చేశాను మీరు ఎన్ని కుట్రలు చేసినా మిమల్ని వదులుకోవాలి అనుకోలేదు మీరేంటి నన్ను చంపాలి అనుకున్నారు అని ఏడుస్తుంది. ఇదంతా అబద్ధం అని దీపక్ అంటాడు. అయితే నీ ఫోన్ ఇవ్వు అని రూప అడుగుతుంది. దీపక్ ఫోన్ ఇవ్వగానే చాటింగ్ మొత్తం రాజు, రూపలు చూపిస్తారు.
దీపక్ ఫోన్‌లో చాటింగ్ చూపించగానే దీపక్ నోరెళ్ల బెడతాడు. సూర్యప్రతాప్ విజయాంబికతో నీ కొడుకు తప్పు చేసినట్లు రుజువు అయింది. నీ కొడుకు తప్పు చేస్తే చెప్పుతో కొడతా వారం తిండి పెట్టను అన్నావ్ నువ్వు కొడతావా నేను కొట్టాలా అని సూర్యప్రతాప్ అడిగితే విజయాంబిక నేనే కొడతాను అని మనసులో దీపక్‌కి సారీ చెప్పి నిన్ను ఎవరో చెప్పుతో కొట్టడం కంటే తల్లిగా నేను కొట్టడం సేఫ్ అనిపించిందని అనుకుంటుంది. ఇక రూప తండ్రితో అత్తయ్య చెప్పుతో కొట్టింది కాబట్టి మీరు తోలు తీయండి అని అంటుంది. రాజు వెంటనే బెల్ట్ తీసుకొచ్చి సూర్యప్రతాప్‌కి ఇస్తాడు. సూర్యప్రతాప్ బెల్ట్‌తో దీపక్‌ని చితక్కొడతాడు. దీపక్ కెవ్వుమంటాడు. దీపక్ని సూర్యప్రతాప్ తిప్పించి తిప్పించి కొట్టడంతో అందరూ నవ్వుకుంటారు.
సూర్యప్రతాప్ రాధికతో ఇక నీకు ఏ ఇబ్బంది ఉండు అని చెప్పి విజయాంబికకు ఛీ కొట్టి వెళ్లిపోతాడు. విజయాంబిక దీపక్‌ని లేపి గదికి తీసుకెళ్తుంది. నేనేం చేయలేదు అని దీపక్ చెప్తాడు. ఇదంతా రూప, రాజులే చేసుకుంటారని ఇద్దరూ అనుకుంటారు. వాళ్లని వదలకూడదు అని అంటారు. ఇంతలో రూప, రాజులు వచ్చి మేం చేసిన ఈ చిన్న దానికే మీరు మమల్ని వదలను అంటే మీరు మా అమ్మానాన్నల్ని చంపాలని ప్రయత్నించినందుకు మిమల్ని మేమేం చేయాలి అంటుంది. షూటర్‌ని ప్లాన్ చేసినందుకు ఏం చేయాలి అని రాజు అంటాడు. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. మీకు బుద్ధి చెప్పాలి అనే ఇలా చేశామని ఇద్దరూ చెప్తారు. మిమల్ని మార్చాలి అని మాత్రమే ఇలా చేశామని మా అమ్మ గురించి నాన్నకి తెలిసే వరకు మీరు జాగ్రత్తగా ఉండాలని అంటారు. ఇక రాత్రి వాళ్లు గదికి వచ్చి చాటింగ్ చేసినట్లు చెప్తారు.
తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. మందారం వచ్చి మీకు తినడానికి ఏం కావాలి మీ చేతులు కాలాయి కాబట్టి నేను తినిపిస్తా అంటుంది. దీపక్ తనకు నాటుకోడి రాగిసంగటి కావాలి ఆకలిగా ఉందని అంటే మీకు ఫుడ్ పెట్టొద్దని పెద్దయ్య గారు చెప్పారు అంటుంది. నా కొడుకు తినకపోతే నేను తినను అని విజయాంబిక అంటుంది. త్వరలోనే మా అమ్మని మా నాన్న తీసుకొచ్చేలా చేస్తామని రూప అంటుంది. విజయాంబిక ఈ గొడవకు కారణమైన రాధికను చంపేయాలి అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర





















