News
News
వీడియోలు ఆటలు
X

పూజా హెగ్డేతో డేటింగ్‌కు వెళ్తా - రాత్రిపూట గోడ దూకేసి వెళ్లిపోయేవాడిని: అఖిల్

తాజాగా ఏజెంట్ మూవీ టీమ్ సుమ అడ్డా షోలో సందడి చేశారు. హీరో అఖిల్ తో పాటూ హీరోయిన్ సాక్షి వైద్య ఈ షోలో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ని తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.

FOLLOW US: 
Share:

బుల్లి తెర టాప్ యాంకర్ సుమ హోస్ట్ చేసే షోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  షోలో పార్టిసిపేట్ చేసే సెలెబ్రిటీలపై అదిరిపోయే పంచులు వేస్తూ షోని రక్తి కట్టిస్తుంది. అలా తాను చేసే షోలలో 'సుమ అడ్డా ' కూడా ఒకటి. ప్రతి వారం సరికొత్త సెలెబ్రిటీలతో ఆడియన్స్ కి ఈ షో ద్వారా మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది సుమ. ఇక తాజాగా ఈ వారం ఎపిసోడ్ లో 'ఏజెంట్' మూవీ టీమ్ సందడి చేసింది. హీరో అఖిల్ ,హీరోయిన్ సాక్షి వైద్య ఈ షోలో పాల్గొని నవ్వులు పూయించారు. ఇక అఖిల్ ఈ షోలో సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్లు ఇచ్చాడు. ఇక తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

అక్కినేని హీరో అఖిల్,సాక్షి వైద్య జంటగా నటించిన తాజా చిత్రం 'ఏజెంట్ '. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28 న విడుదలైంది. ఇక చిత్ర ప్రమోషన్ లో భాగంగా అఖిల్ ,సాక్షి వైద్య 'సుమ అడ్డా ' షోలో పాల్గొన్నారు. మే 6 న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో ని రిలీజ్ చేశారు. ఇక ప్రోమో లో అఖిల్ హీరోయిన్ సాక్షి తో కలిసి స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక అఖిల్ రాగానే సుమ సిసింద్రీ అప్పటినుండి ఎదురుచూస్తున్నా ఎప్పడెప్పుడు వస్తాడా అఖిల్ మన షోకి అని చెప్తుంది. ఇక తర్వాత హీరోయిన్ ని మీరు ఇతనికి ఏమవుతారు అని సుమ అడగగా..'ఐయామ్ అఖిల్స్ లవ్ ఇంట్రెస్ట్’ అని చెప్తుంది.

అలా చెప్పగానే అఖిల్ సాక్షి ని హాగ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత సుమ అఖిల్ ని కొన్ని ప్రశ్నలు అడిగితే అఖిల్ సుమకి పంచులు వేస్తూ ఆన్సర్స్ ఇచ్చాడు. ఇక దాని అనంతరం నాగార్జున శివ సినిమాలో చైన్ లాగె సీన్ ని అఖిల్ రీక్రియేట్  చేశాడు. ఇక సైకిల్ చైన్ లాగి సుమ మేడలో వేశాడు. అలా ప్రోమో అంతా ఎంతో సరదాగా సాగింది. మధ్యలో పోకిరి డైలాగ్ కూడా చెప్పాడు అఖిల్. ఇక ప్రోమో చివర్లో సుమ అఖిల్ ని కొన్ని పర్సనల్ ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా అఖిల్ నీకు ఇష్టమైన హీరో ఎవరని అడగగా.. రామ్ చరణ్ అని అఖిల్ సమాధానం ఇచ్చాడు. ఐతే రామ్ చరణ్ గురించి ఎం చెప్తారు? అంటే 'మై హార్ట్ బీట్ ' అని అఖిల్ బదులిచ్చాడు.

ఇక డేట్ కి వెళ్లాల్సి వస్తే మీరు ఏ హీరోయిన్ తో వెళ్తారు? అని అడగ్గానే.. 'పూజా హెగ్డే' అని ఆన్సర్ ఇస్తాడు. మీరు చేసిన పనుల్లో నాగార్జున గారికి ఇప్పటికి తెలియని పని ఏంటి? అని సుమ అడిగితె.. 'రాత్రి పూట గోడ దూకేసి బయటికి వెళ్లిపోయేవాడ్ని' అని చెప్పాడు. దానికి సుమ కెమెరా ముందుకు వచ్చి .. ‘‘నాగార్జున గారు మీరు చూశారా? మీ అబ్బాయి ఎం చేశాడో.  25 అడుగుల గోడ కట్టించారు మీరు ఏం లాభం? అయినా సరే గోడ దూకేశాడు’’ అని చెప్పింది.

Also Read : ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి... అశ్వినీదత్ వ్యాఖ్యలపై పోసాని కౌంటర్ ఎటాక్

Read:‘రౌడీ బాయ్స్’ హీరో, ‘లవ్‌ టుడే’ బ్యూటీల ‘దిల్ ఖుష్’ పాట చూశారా?

Published at : 02 May 2023 03:18 PM (IST) Tags: Anchor Suma akkineni akhil Suma Adda Acctress Sakshi Vaidhya Agent Movie Team

సంబంధిత కథనాలు

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు, బాలయ్య మూవీ టైటిల్ వచ్చేసింది - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం

హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!

Gruhalakshmi June 8th: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్

Gruhalakshmi June 8th: శేఖర్ కిడ్నాప్, క్లైమాక్స్ కి చేరిన లాస్య కథ- దివ్య మీద రాజ్యలక్ష్మి ఫైనల్ ఎటాక్

Guppedanta Manasu June 8th: వసు పనిచేస్తున్న కాలేజీ బాధ్యతలు తీసుకున్న రిషి సార్, మళ్లీ ప్రేమకథ మొదలు!

Guppedanta Manasu June 8th: వసు పనిచేస్తున్న కాలేజీ బాధ్యతలు తీసుకున్న రిషి సార్, మళ్లీ ప్రేమకథ మొదలు!

Brahmamudi June 8th: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?

Brahmamudi June 8th: రాహుల్ ప్లాన్ తిప్పికొట్టి కావ్య తన అక్క పెళ్లి జరిపిస్తుందా?

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం