News
News
X

Anasuya: 'జబర్దస్త్' షోకి గుడ్ బై చెప్పిన అనసూయ - ఇదిగో క్లారిటీ 

యాంకర్ అనసూయ 'జబర్దస్త్' షో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 

బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఎన్ని వివాదాలు ఎదురైనా.. ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. దీంతో ఈ షోని కాపీ చేస్తూ చాలా కామెడీ షోలు వచ్చాయి. కానీ 'జబర్దస్త్' ముందు ఏదీ నిలవలేకపోయింది. కానీ ఈ మధ్యకాలంలో 'జబర్దస్త్' రేటింగ్స్ తగ్గుతున్నాయి. రొటీన్ స్కిట్ లతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు. ఒకట్రెండు టీమ్స్ మినహా.. మిగిలిన వాళ్ల స్కిట్ లను చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు. 

యూట్యూబ్ లో ఎపిసోడ్స్ ను బిట్స్ బిట్స్ గా టెలికాస్ట్ చేస్తుండడంతో.. తమకు నచ్చిన స్కిట్ లను చూసుకుంటున్నారు ఆడియన్స్. దీంతో సరైన రేటింగ్స్ రావడం లేదు. ఈ రేటింగ్ ను మరింత ఎఫెక్ట్ చేస్తూ.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి కమెడియన్స్ షో నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు యాంకర్ అనసూయ వంతు వచ్చింది. ఈ షో నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షోతో అనసూయ విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అలాంటిది ఆమె ఈ షోకి గుడ్ బై చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అనసూయ. అయితే 'జబర్దస్త్' షో పేరు ప్రస్తావించకుండా.. తను తప్పుకుంటున్నట్లు చెప్పింది. తన కెరీర్ లో తీసుకున్న పెద్ద డెసిషన్ ను ఈరోజు నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పింది. చాలా జ్ఞాపకాలను నాతో పాటు తీసుకెళ్తున్నాను.. అందులో మంచి, చెడు అన్నీ ఉన్నాయని తెలిపింది. మీరంతా ఎప్పటిలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చింది. 

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటా..? అని ఆరా తీస్తున్నట్లు అభిమానులు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేస్తూనే.. మరోపక్క పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. 

Also Read : విడాకుల వార్తలపై స్పందించిన సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర

Also Read : మగబిడ్డకు జన్మనిచ్చిన 'దిల్' రాజు భార్య తేజస్విని వ్యాఘా రెడ్డి

View this post on Instagram
 
A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Published at : 29 Jun 2022 02:57 PM (IST) Tags: Anasuya Anasuya jabardasth show Anasuya quits jabardasth

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Devatha August 10th Update: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

Devatha August 10th Update: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

టాప్ స్టోరీస్

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం