Trivikram: మహేష్ సినిమా కోసం యంగ్ రైటర్స్ - త్రివిక్రమ్ ప్లాన్ ఇదే!
తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో చేయనున్నారు త్రివిక్రమ్. దీనికోసం కొంతమంది యంగ్ రైటర్స్ ను తీసుకున్నారు.
టాలీవుడ్ లో ఉన్న ఫైనెస్ట్ రైటర్స్ లో త్రివిక్రమ్(Trivikram) ఒకరు. తన సినిమాలకు డైలాగ్ వెర్షన్ మొత్తం ఆయనే రాసుకుంటారు. అయితే త్రివిక్రమ్ కి కూడా రైటింగ్ టీమ్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబు(Mahesh Babu)తో చేయనున్నారు త్రివిక్రమ్. దీనికోసం కొంతమంది యంగ్ రైటర్స్ ను తీసుకున్నారు త్రివిక్రమ్. వారు సిద్ధం చేసిన డ్రాఫ్ట్ ఆయనకు నచ్చడంతో.. స్క్రీన్ ప్లే, డైలాగ్ వెర్షన్ రెడీ చేశారు త్రివిక్రమ్.
Trivikram changes team for Mahesh’s film: ఈ యంగ్ రైటర్స్ టీమ్ గతేడాది కాలంగా త్రివిక్రమ్ తో కలిసి పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేశారు. 'అల.. వైకుంఠపురములో' సినిమాకి పని చేసిన టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి పని చేయనున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ వర్క్ అందించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి మహేష్ బాబు, త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట.
ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ.. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో మేకర్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.
తొలిసారి ఈ సినిమా కోసం తనకు అచొచ్చిన ఫ్యామిలీ డ్రామాను పక్కన పెడుతున్నారు త్రివిక్రమ్. పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది.
ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.
Also Read : 'ఒకే ఒక జీవితం' రివ్యూ : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ & మదర్ సెంటిమెంట్ శర్వాకు హిట్ ఇచ్చాయా?