News
News
X

Nuvve Nuvve Re Release : గురూజీ ఫ్యాన్స్‌కు బర్త్‌డే గిఫ్ట్ - 'నువ్వే నువ్వే' రీ రిలీజ్

Trivikram Birthday Special : దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి సినిమా 'నువ్వే నువ్వే' మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. గురూజీ పుట్టినరోజు సందర్భంగా ఈ వారం ఆ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు.

FOLLOW US: 

'అమ్మ... ఆవకాయ్... అంజలి... ఎప్పటికీ బోర్ కొట్టవు' అనేది 'నువ్వే నువ్వే'లో ఓ డైలాగ్. దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అది తొలి సినిమా. 'అమ్మ... ఆవకాయ్... అంజలితో పాటు ఆ సినిమా (నువ్వే నువ్వే) కూడా ఎప్పటికీ బోర్ కొట్టదు' అనేది త్రివిక్రమ్ అభిమానులు చెప్పే డైలాగ్. అందులో కామెడీ బోర్ కొట్టదు కాబట్టే... యూట్యూబ్‌లో ఆ సినిమాలో సీన్స్‌కు అన్ని వ్యూస్ వస్తున్నాయి. 'నువ్వే నువ్వే' చిత్రాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు, త్రివిక్రమ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఈ సినిమాను ఈ వారం రీ రిలీజ్ చేస్తున్నారు. 

Nuvve Nuvve Re Release : నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టిన రోజు (Trivikram Birthday). ఈ సందర్భంగా గురూజీ అభిమానులకు కానుక ఇవ్వాలని శ్రీ స్రవంతి మూవీస్ ప్లాన్ చేసింది. దర్శకుడిగా త్రివిక్రమ్ తొలి సినిమా 'నువ్వే నువ్వే'ను రీ రిలీజ్ చేస్తోంది. పుట్టిన రోజుకు మూడు రోజుల ముందు సినిమాను విడుదల చేస్తోంది. ఈ నెల (నవంబర్) 4 నుంచి 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో సినిమాను ప్రదర్శించనున్నారు. ఆల్రెడీ కొన్ని థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. 
   
త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను దర్శకునిగా  పరిచయం చేస్తూ... ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ 'నువ్వే నువ్వే' చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తరుణ్, శ్రియ శరణ్ (Shriya Saran) జంటగా నటించారు. గత నెలలో... అక్టోబర్ 10కి సినిమా విడుదలై 20 ఏళ్ళు పూర్తి  అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. త్రివిక్రమ్, 'స్రవంతి' రవికిశోర్, ప్రకాశ్ రాజ్, తరుణ్, శ్రియ సహా పలువురు యూనిట్ సభ్యులు ఆ షోకి అటెండ్ అయ్యారు.  స్క్రీన్ హౌస్ ఫుల్ కావడమే కాదు, ప్రతి పంచ్, సన్నివేశానికి ఆడియన్స్ నుంచి ఎక్స్‌ట్రాడినరీ రెస్పాన్స్ లభించింది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అదిరిందని అందరూ చెప్పారు.  

ప్రేక్షకులకు ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని...
'నువ్వే నువ్వే' స్పెషల్ షో చూసిన తర్వాత... సినిమా విడుదలై 20 ఏళ్ళు అయినా, తనకు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉందని హీరో తరుణ్ వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ ఫామ్ హౌస్‌కు వెళ్లకుండా షో చూడటం కోసం వచ్చానని తెలిపారు. ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా చాలా మంది ప్రేక్షకులు 'నువ్వే నువ్వే' సినిమాను రీ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళందరి రిక్వెస్ట్ దృష్టిలో పెట్టుకుని 'స్రవంతి' రవికిశోర్ మళ్ళీ 'నువ్వే నువ్వే'ను విడుదల చేస్తున్నారు.  
 
2కె హెచ్‌డి ప్రింట్‌తో...  
'నువ్వే నువ్వే' రీ రిలీజ్ సందర్భంగా చిత్ర నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ (Sravanthi Ravi Kishore) మాట్లాడుతూ ''మా దర్శకుడు త్రివిక్రమ్‌కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే. 'నువ్వే నువ్వే' విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. వెండితెరపై మళ్ళీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతి అని చాలా మంది చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకూ ఆ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. 2కె హెచ్‌డి ప్రింట్‌తో షోస్ వేస్తున్నాం. లిమిటెడ్ స్క్రీన్స్‌లో 'నువ్వే నువ్వే' రీ రిలీజ్ చేస్తున్నాం. త్వరలో థియేటర్ల వివరాలు వెల్లడిస్తాం'' అని  చెప్పారు. 

Also Read : ఒక్క శుక్రవారం - ఐదుగురు అందగత్తెలకు అగ్ని పరీక్ష - హిట్ కొట్టేది ఎవరు? ఛాన్సలు పట్టుకునేది ఎవరు?

News Reels

ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, శిల్పా చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషించిన 'నువ్వే నువ్వే' చిత్రానికి కోటి సంగీతం అందించారు. హరి అనుమోలు ఛాయాగ్రాహకుడు. ఇప్పటికీ 'నువ్వే నువ్వే'లో పాటలు ఎక్కడో ఒక చోట అభిమానుల నోట వినిపిస్తూ ఉంటాయి. 

Published at : 01 Nov 2022 04:23 PM (IST) Tags: Shriya Saran Tarun Nuvve Nuvve Movie Sravanthi Ravi Kishore Trivikram Birthday Special Nuvve Nuvve Re Release

సంబంధిత కథనాలు

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

YS Jagan: అలీ కూతురు మ్యారేజ్ రిసెప్షన్‌ - నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Bigg Boss 6 Telugu: ఇనయాతో శ్రీహాన్ రొమాన్స్, శ్రీసత్యకు ఊహించని షాక్ - టాస్క్ ఇలా కూడా ఆడొచ్చా?

Dejavu - Repeat : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Dejavu - Repeat  : 'రిపీట్' రిలీజుకు ముందు 'డెజావు' సక్సెస్ - ప్రైమ్‌లో పెరిగిన క్లిక్స్

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

Ram Charan NTR : ఎన్టీఆర్, చరణ్ మధ్య నో గొడవ, నథింగ్ - ముందే అంతా మాట్లాడుకుని

టాప్ స్టోరీస్

Bandi Sanjay : భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Bandi Sanjay :  భైంసా పేరు మహిషాగా మారుస్తాం, పీడీయాక్ట్ లు ఎత్తేసి ఉద్యోగాలిస్తాం - బండి సంజయ్

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు