By: ABP Desam | Updated at : 02 Sep 2023 05:33 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం ( Image Source : Pixabay )
పవన్ కళ్యాణ్ లుక్ & గన్స్ నుంచి కథ వరకు - 'ఓజీ' టీజర్‌లో ఇవి గమనించారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఓజీ'. ఆయన అభిమాని సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇవాళ పవన్ పుట్టినరోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. అభిమానులకు ఆ టీజర్ విపరీతంగా నచ్చింది. సగటు సినీ ప్రేక్షకులను సైతం ఆకట్టుంది. ముఖ్యంగా పవన్ స్టయిలిష్ లుక్, ఆ స్లీక్ యాక్షన్ సీక్వెన్సులు నచ్చాయి. అయితే... యాక్షన్ మాత్రమే కాదు, అంతకు మించి అనేట్లు దర్శకుడు సుజీత్ టీజర్ కట్ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
డిసెంబరా? అంత కంటే ముందా? - ప్రభాస్ 'సలార్' విడుదలపై లేటెస్ట్ టాక్!
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు నిన్న భారీ షాక్ తగిలింది. వాళ్ళు ఎంత గానో ఎదురు చూస్తున్న 'సలార్' సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదని, వాయిదా పడిందని తెలుసుకుని నిరాశ పడ్డారు. తమ అభిమాన కథానాయకుడిని 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ తాము ఎన్నో రోజుల నుంచి కోరుకున్న విధంగా చూపిస్తారని కోటి ఆశలు పెట్టుకుంటే... వాయిదా విషయం ఉసూరుమని డీలా పడ్డారు. ఇప్పుడు ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి లేటెస్ట్ రూమర్లు వినిపిస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా?
కిచ్చా సుదీప్... తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'ఈగ' సినిమాలో విలన్ పాత్ర పోషించి అలరించాడు. ‘బాహుబలి’లో ఆయుధ వ్యాపారి అస్లాం ఖాన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ కన్నడ నటుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులను తన చక్కటి నటనతో మెస్మరైజ్ చేశాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. సినిమా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
బాక్సాఫీస్ బరిలో రౌడీ ర్యాంపేజ్ - రికార్డ్ స్థాయిలో 'ఖుషి' ఫస్ట్ డే కలెక్షన్స్!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలై మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. రొమాంటిక్ ఫ్యామిలీ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 52 కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఖుషి' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ. 30 కోట్లకు పైగా గ్రాస్‌ను ‘ఖుషి’ కలెక్ట్ చేసినట్లు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
చిరుతలా వేటాడిన పవన్ - 'ఓజీ' గ్లింప్స్ చూస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ'. 'దే కాల్ హిమ్ ఓజీ' అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని అర్థం. బహుశా... పవన్ అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకుల్లో పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలతో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఆసక్తి కలిగించిన సినిమా మరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి అవసరం లేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిన 'గేమ్ ఛేంజర్' షూటింగ్ - ఎందుకో తెలుసా..?
‘సలార్’ రిలీజ్ డేట్ రూమర్స్, షారుక్, సల్మాన్‌లపై రామ్ కామెంట్స్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!
Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్
YCP Counter To Purandeswari: ఈ తెలివితోనే మీరు కేంద్రమంత్రిగా పనిచేశారా? - పురందేశ్వరిపై వైసీపీ సెటైర్లు
iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?
TTDP Protest in Hyderabad: చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్‌లో టీడీపీ ఆందోళనలు- నేతల అరెస్ట్
/body>