Max Title Teaser: మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా?
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మ్యాక్స్’. కెరీర్ లో 46వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్ టీజర్ ను ఆయన బర్త్ డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు.
![Max Title Teaser: మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా? Max movie teaser Kannda Star Kiccha Sudeep's Kichcha 46 gets title, he dons titular role in intense actioner Max Title Teaser: మరణం లేని వాడికి సైతం చావు తథ్యం - కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్‘ యాక్షన్, టీజర్ చూశారా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/02/dd38b5499fbc63850a86b0fdb9ffcba31693637206030544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కిచ్చా సుదీప్... తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'ఈగ' సినిమాలో విలన్ పాత్ర పోషించి అలరించాడు. ‘బాహుబలి’లో ఆయుధ వ్యాపారి అస్లాం ఖాన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఈ కన్నడ నటుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ప్రేక్షకులను తన చక్కటి నటనతో మెస్మరైజ్ చేశాడు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. సినిమా రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఆకట్టుకుంటున్న ‘మ్యాక్స్’ టైటిల్ టీజర్
సుదీప్ పుట్టిన రోజు కానుకగా విజయ్ కార్తికేయ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందుతున్న ‘మ్యాక్స్’ టైటిల్ టీజర్ విడుదల చేశారు. నిమిషంన్నర నిడివి ఉన్న ఈ టీజర్ వాకీటాకీలో పోలీస్ అనౌన్స్ మెంట్ తో మొదలువుతంది. సిటీలోకి పలు వైపుల నుంచి వాహనాలు వస్తున్నట్లు చెప్తారు. ఈ ప్రకటన వింటున్న పోలీసులకు చెమటలు పపడతాయి. “రాబోయే వాళ్లు, అగ్ని పర్వతం నుంచి తప్పించుకోవచ్చు, భూకంపం నుంచి తప్పించుకోవచ్చు. తుఫాన్ నుంచి తప్పించుకోవచ్చు. సునామీ నుంచి కూడా తప్పించుకోవచ్చు. కానీ, వీడితో పెట్టుకుంటే, చావులేని వరంతో పుట్టినోడు కూడా చస్తాడు” అని చెప్తాడు పోలీసు అధికారి. ఆ తర్వాత లాఠీ పట్టుకుని సుదీప్ స్టైలిష్ గా కనిపిస్తాడు. పూర్తి స్థాయిలో యాక్షన్ మూవీగా రూపొందుతున్న ‘మ్యాక్స్’కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రం కళైపులి ఎస్ తను సమర్పణలో వి క్రియేషన్స్, కిచ్చ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించనున్నారు.
చంద్రు దర్శకత్వంలో సుదీప్ గ్లోబల్ ప్రాజెక్ట్
మరోవైపు సుదీప్ బర్త్ డే కానుకగా ఆర్ సి స్టూడియోస్ భారీ బడ్జెట్ తో గ్లోబల్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ‘కబ్జ’ దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించబోతున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించబోతున్నారు. ఈ విషయాన్ని ఆర్ సి స్టూడియోస్ అఫీషియల్ గా ప్రకటించింది. ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్టులో కిచ్చా సుదీప్ హీరోగా నటించబోతున్నారు. ఆర్ సి స్టూడియోస్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అన్నీ మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
A Cinematic Masterpiece is coming,Supervised by V Vijayendra Prasad, Join us in celebrating Baadshah Kichcha Sudeepa's birthday!
— R.Chandru (@rchandru_movies) September 1, 2023
Mission Starts Soon!🎥@KicchaSudeep @RCStudiosOff @VVPrasadWrites#KichchaSudeepa #kicchasudeepaglobalmovie #RCStudios #VVijayendraprasad #RChandru pic.twitter.com/6bi9YMYu9w
Read Also: ఫ్యాన్సీ అమౌంట్, సూపర్ లగ్జరీ కారు- ‘జైలర్‘ దర్శకుడికి నిర్మాత అదిరిపోయే బహుమతి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)