అన్వేషించండి

Jailer Movie: ఫ్యాన్సీ అమౌంట్, సూపర్ లగ్జరీ కారు- ‘జైలర్‘ దర్శకుడికి నిర్మాత అదిరిపోయే బహుమతి

‘జైలర్’ మూవీ అద్భుత విజయంతో నిర్మాత కళానిధి మారన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హీరో రజనీకాంత్ తో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు లాభాల్లో వాటా ఇవ్వడంతో పాటు ఖరీదైన కార్లను గిఫ్టుగా అందించారు.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’.  నెల్సన్‌ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళం, తెలుగుతో పాటు  కన్నడ, మలయాళం, హిందీ సహా విడుదలైన ప్రతి చోటా భారీగా కలెక్షన్లు రాబట్టింది. విదేశాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. ‘జైలర్’ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

దర్శకుడికి బహుమతిగా లగ్జరీ కారు

‘జైలర్’ మూవీ సంచలన విజయంతో చిత్రబృందం ఆనందంతో మునిగిపోయింది. ఈ చిత్రం నిర్మాతకు లాభాల పంట పండించింది. అనుకున్న దానికంటే అద్భుతంగా రాణించడంతో ప్రముఖ నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ చిత్ర హీరో రజనీకాంత్ తో పాటు నిర్మాత నెల్సన్ దిలీప్ కుమార్ కు ఊహించని బహుమతులు అందించారు. దర్శకుడు దిలీప్ కుమార్ కు  లాభాల్లో వాటాకు సంబంధించిన చెక్ తో పాటు లగ్జరీ (Porsche) కారును బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు కోట్లల్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. నిర్మాత నుంచి వచ్చిన ఊహించని బహుమతితో దర్శకుడు సంతోషంలో మునిగిపోతున్నారట.

 

కనీవినీ రెమ్యునరేషన్ అందుకున్న రజనీకాంత్  

అంతకు ముందు ‘జైలర్’ హీరో రజనీకాంత్ కు లాభాల్లో వాటాతో పాటు లగ్జరీ కార్లను బహుమతిగా అందించారు కళానిధి మారన్. రజనీకాంత్ కు లాభాల్లో వాటాగా రూ.100 కోట్ల రూపాయల చెక్ ను అందజేశారు. చెక్‌తో పాటు లేటెస్ట్ BMW కారును బహుమతిగా ఇచ్చారు. ‘జైలర్’ కోసం రజనీ రూ. 110 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా, లాభాల్లో వాటాగా మరో రూ. 100 కోట్లు అందుకున్నారు. మొత్తంగా ఈ చిత్రానికి గాను రజనీ  రూ.210 కోట్లు తీసుకున్నారు. ఇప్పటి వరకు భారత్ ఇంత స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న హీరో మరొకరు లేరని చెప్పుకోవచ్చు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ చిత్రాన్ని తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందులో తమన్నా, జాకీష్రాఫ్‌, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, సునీల్‌, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మరో కీలక పాత్రలో నటించింది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ నటించడం బాగా కలిసి వచ్చింది.  అనిరుధ్ సంగీతం అందరినీ ఆకట్టుకుంది.  

Read Also: ఫుల్ స్వింగ్‌లో నేషనల్ క్రష్‌, పాన్ ఇండియా చిత్రాలతో దూసుకెళ్తున్న రష్మిక

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget