అన్వేషించండి

Salaar Postponed - Release Update : డిసెంబరా? అంత కంటే ముందా? - ప్రభాస్ 'సలార్' విడుదలపై లేటెస్ట్ టాక్!

సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల కావడం లేదనేది కన్ఫర్మ్! డిసెంబర్‌లో విడుదల చేయవచ్చని నిన్న వినిపించింది. అంత కంటే ముందు వస్తుందని లేటెస్ట్ టాక్.

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులు నిన్న భారీ షాక్ తగిలింది. వాళ్ళు ఎంత గానో ఎదురు చూస్తున్న 'సలార్' (Salaar Movie) సెప్టెంబర్ 28న విడుదల కావడం లేదని, వాయిదా పడిందని తెలుసుకుని నిరాశ పడ్డారు. తమ అభిమాన కథానాయకుడిని 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ తాము ఎన్నో రోజుల నుంచి కోరుకున్న విధంగా చూపిస్తారని కోటి ఆశలు పెట్టుకుంటే... వాయిదా విషయం ఉసూరుమని డీలా పడ్డారు.   

డిసెంబరులోనా? అంత కంటే ముందా?
Salaar New Release Date : సెప్టెంబర్ 28న 'సలార్' విడుదల కావడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇంకా చిత్ర బృందం అధికారికంగా అనౌన్స్ చేయలేదు. కానీ, విడుదల వాయిదా పడిందనేది కన్ఫర్మ్! మరి, ఎప్పుడు విడుదల చేస్తారు? అంటే.... నవంబర్ నెలలో అని సమాచారం. 

'సలార్' విడుదల వాయిదా విషయంతో పాటు డిసెంబర్ నెలలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే... నవంబర్ నెలలో విడుదల చేయాలని భావిస్తున్నారట 

సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ అవుతుందా?
ఆల్రెడీ నవంబర్ నెలలో, దీపావళి సీజన్ మీద బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కర్చీఫ్ వేశారు. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' చిత్రాల తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ఆయన నటిస్తున్న తాజా సినిమా 'టైగర్ 3'. ఈ సినిమా లేటెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. 

ఒకవేళ నవంబర్ నెలలో 'సలార్' వస్తే దీపావళి సందర్భంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బడ్జెట్ రికవరీతో పాటు ప్రాఫిట్స్ రావడానికి, క్యాష్ చేసుకోవడానికి ఫెస్టివల్ సీజన్ కంటే మంచిది ఏం ఉంటుంది? మరి, 'సలార్' చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఆలోచన ఎలా ఉందో?

'సలార్' వాయిదా పడిన కారణంగా ఆ తేదీకి ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఓ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన 'మ్యాడ్'ను తీసుకు వస్తున్నారు. ఆ సినిమా సెప్టెంబర్ 28న విడుదల అవుతోంది. మాస్ మహారాజా రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వరరావు'ను సెప్టెంబర్ 29న, యువ హీరో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' సినిమాను సెప్టెంబర్ 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ రాలేదు.   

Also Read : పవన్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన 'ఓజీ' టీజర్... ఆకాశమే హద్దుగా అంచనాలు, సుజీత్ ఏం చేస్తాడో? 

'సలార్'ను ఎందుకు వాయిదా వేస్తున్నారు?
అమెరికాలో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. పలువురు టికెట్స్ కొన్నారు. ఈ తరుణంలో ఎందుకు వాయిదా వేస్తున్నారు? కారణం ఏమిటి? అని చూస్తే... సీజీ వర్క్ సరిగా రాలేదని వినబడుతోంది. యాక్షన్ దృశ్యాలతో పాటు కొన్ని సన్నివేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పట్ల దర్శకుడు ప్రశాంత్ నీల్ అసంతృప్తి వ్యక్తం చేశారట. అందువల్ల, విడుదల వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట. 

Also Read : బాక్సాఫీస్ బరిలో రౌడీ ర్యాంపేజ్ - రికార్డ్ స్థాయిలో 'ఖుషి' ఫస్ట్ డే కలెక్షన్స్!

'సలార్' సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటించారు. ఆమె జర్నలిస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసింది. మన్నార్ పాత్రలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నారు. జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రావు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాను హోంబ‌లే ఫిలింస్ సినిమాను నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మాత.  

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Warangal Crime News: వరంగల్‌లో పేకాడుతూ చిక్కిన రాజకీయ ప్రముఖులు- మాజీ ఎమ్మెల్యే సహా 13 మంది అరెస్టు 
వరంగల్‌లో పేకాడుతూ చిక్కిన రాజకీయ ప్రముఖులు- మాజీ ఎమ్మెల్యే సహా 13 మంది అరెస్టు 
Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో దారుణం - ఇద్దరి పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి 
నల్గొండ జిల్లాలో దారుణం - ఇద్దరి పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి 
Trump on Zelensky: 'పుతిన్ కోరుకుంటే ఉక్రెయిన్‌ను నాశనం చేస్తారు, వైట్ హౌస్‌లో జెలెన్‌స్కీపై ట్రంప్ చిందులు
పుతిన్ కోరుకుంటే ఉక్రెయిన్‌ను నాశనం చేస్తారు, వైట్ హౌస్‌లో జెలెన్‌స్కీపై ట్రంప్ చిందులు
Parineeti Chopra: బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - దీపావళికి గుడ్ న్యూస్ చెప్పిన కపుల్
బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - దీపావళికి గుడ్ న్యూస్ చెప్పిన కపుల్
Advertisement

వీడియోలు

Dr Sivaranjani Battle Againt Fake ORS Drinks | పోరాటాన్ని గెలిచి కన్నీళ్లు పెట్టుకున్న హైదరాబాదీ డాక్టర్ | ABP Desam
Aus vs Ind 1st ODI Highlights | భారత్ పై మొదటి వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఆసీస్ విజయం | ABP Desam
Women's ODI World Cup 2025 | India vs England | ఒత్తిడిలో టీమ్ ఇండియా
Ajit Agarkar Comments on Team Selection | టీమ్ సెలక్షన్‌పై అగార్కర్ ఓపెన్ కామెంట్స్
Suryakumar Comments on T20 Captaincy | కెప్టెన్సీ భాధ్యతపై SKY కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal Crime News: వరంగల్‌లో పేకాడుతూ చిక్కిన రాజకీయ ప్రముఖులు- మాజీ ఎమ్మెల్యే సహా 13 మంది అరెస్టు 
వరంగల్‌లో పేకాడుతూ చిక్కిన రాజకీయ ప్రముఖులు- మాజీ ఎమ్మెల్యే సహా 13 మంది అరెస్టు 
Nalgonda Crime News: నల్గొండ జిల్లాలో దారుణం - ఇద్దరి పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి 
నల్గొండ జిల్లాలో దారుణం - ఇద్దరి పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి 
Trump on Zelensky: 'పుతిన్ కోరుకుంటే ఉక్రెయిన్‌ను నాశనం చేస్తారు, వైట్ హౌస్‌లో జెలెన్‌స్కీపై ట్రంప్ చిందులు
పుతిన్ కోరుకుంటే ఉక్రెయిన్‌ను నాశనం చేస్తారు, వైట్ హౌస్‌లో జెలెన్‌స్కీపై ట్రంప్ చిందులు
Parineeti Chopra: బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - దీపావళికి గుడ్ న్యూస్ చెప్పిన కపుల్
బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - దీపావళికి గుడ్ న్యూస్ చెప్పిన కపుల్
Kolikapudi Srinivas : టీడీపీలో మరోసారి కొలికపూడి కలకలం- ఎంపీ చిన్నిపై సంచలన వ్యాఖ్యలు 
టీడీపీలో మరోసారి కొలికపూడి కలకలం- ఎంపీ చిన్నిపై సంచలన వ్యాఖ్యలు 
Women ODI World Cup 2025: ఇంగ్లండ్‌తో ఓడిపోయిన టీం ఇండియా వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిందా ? పాయింట్స్ టేబుల్ లో ఏ టీం ఎక్కడ ఉంది?
ఇంగ్లండ్‌తో ఓడిపోయిన టీం ఇండియా వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిందా ? పాయింట్స్ టేబుల్ లో ఏ టీం ఎక్కడ ఉంది?
iPhone Air : కొత్తగా విడుదలైన ఈ ఐఫోన్‌కు ఆదరణ కరవు, కీలక నిర్ణయం తీసుకున్న ఆపిల్ !
కొత్తగా విడుదలైన ఈ ఐఫోన్‌కు ఆదరణ కరవు, కీలక నిర్ణయం తీసుకున్న ఆపిల్ !
Womens world cup 2025: మంధానా- హర్మన్‌ప్రీత్ ల కష్టం వృథా?.. భారత్‌పై విజయంతో సెమీఫైనల్లోకి ఇంగ్లాండ్
మంధానా- హర్మన్‌ప్రీత్ ల కష్టం వృథా?.. భారత్‌పై విజయంతో సెమీఫైనల్లోకి ఇంగ్లాండ్
Embed widget