By: Satya Pulagam | Updated at : 02 Sep 2023 12:19 PM (IST)
ఓజీలో పవన్ కళ్యాణ్
'నెత్తురు మరిగిన హంగ్రీ చీతా' - 'ఓజీ' టీజర్ (OG Teaser)లో ఓ సాంగ్ వినిపించింది కదా! అందులో ఓ లైన్ ఇది. 'రక్తం రుచి మరిగిన... ఆకలితో ఉన్న చిరుత' అని ఆ లైన్ మీనింగ్! 'ఓజీ' (OG Movie)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర గురించి మన ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఆ లైన్ రాయించి ఉంటారు.
నిజం చెప్పాలంటే... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఆకలితో ఉన్నారు. చాలా అంటే చాలా! తమ అభిమాన కథానాయకుడి నుంచి 'కెజియఫ్', 'విక్రమ్' వంటి సినిమా ఆశిస్తున్నారు. మాఫియా నేపథ్యంలో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలు అంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇష్టం. గతంలో 'బాలు', 'పంజా' వంటి సినిమాలు చేశారు కూడా! అయితే... ఆశించిన విజయాలు రాలేదు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో యాక్షన్ డ్రామాలకు ఆదరణ బావుంటుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ లోని నటుడిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ హీరోయిజం ఎలివేట్ చేసే సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆకలి తీర్చేలా 'ఓజీ' టీజర్ తీసుకొచ్చారు దర్శకుడు సుజీత్. ఆయన కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానే. అభిమానులు కోరుకునే స్టఫ్ అందించారు. అదే సమయంలో స్ట్రాంగ్ కంటెంట్, టెక్నికల్ వేల్యూస్ ఉండేలా చూసుకున్నారు.
'ఓజీ' టీజర్... హీరో ఎంట్రీయే హైలైట్!
అసలు 'ఓజీ' టీజర్ (OG Teaser Review)లో పవన్ కళ్యాణ్ ఎంట్రీకి ముందు ఇచ్చిన ఎలివేషన్, ఆ డైలాగులకు ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది. 'పదేళ్ళ క్రితం బాంబేలో వచ్చిన తుఫాను గుర్తు ఉందా? అది మట్టి చెట్లతో పాటు సగం ఊరిని ఊడ్చేసింది. కానీ, వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం... ఇప్పటికీ ఏ తూఫాను కడగలేకపోయింది. ఇట్ వాజ్ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్! అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే... దెయ్యం కూడా భయపడుతుంది' - ఈ మాటలో హీరోయిజం పీక్స్ అంతే!
ఆకలితో ఉన్న చిరుత పులిలా పవన్ కళ్యాణ్ సాగించిన వేట మామూలుగా లేదు. ఆ బ్లడ్ బాత్ వర్ణించడానికి మాటలు కూడా లేవు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ కూడా టాప్ క్లాస్!
పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ సూపర్!
ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఆయన అందంగా కనిపించిన సినిమాలు ఉన్నాయి. అయితే... స్టైలిష్ లుక్ అంటే మాత్రం ముందుగా గుర్తుకు వచ్చేది 'పంజా'. ఆ సినిమాలో పవన్ స్టైలిష్ డ్రస్సింగ్ ఇప్పటికీ అభిమానులకు ఫెవరేట్! దాన్ని మించేలా 'ఓజీ'లో ఆయన లుక్ కనిపించింది. ఇక, పవన్ చూపుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
తమన్ నేపథ్య సంగీతం తక్కువేమీ కాదు!
'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో'... పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకు తమన్ సంగీతం అందించారు. ఆ మూడు సినిమాల్లో నేపథ్య సంగీతం ఒక ఎత్తు... ఈ 'ఓజీ' టీజర్ నేపథ్య సంగీతం మరో ఎత్తు!
''నెత్తురు మరిగిన హంగ్రీ చీతా
శత్రువును ఎంచితే మొదలు వేట..
చూపు కానీ విసిరితే ఓర కంట..
డెత్ కోటా.. కన్ఫర్మ్ అంట..
ఎవ్వడికీ అందదు అతని రేంజు..
రెప్ప తెరిచేను రగిలే రివేంజు..
పవరు అండ్ పొగరు..ఆన్ ది సేమ్ పేజ్..
ఫైర్ స్టార్మ్ లాంటి రేజు...'' అంటూ గూస్ బంప్స్ అందించారు.
Also Read : ప్రభాస్ అభిమానులకు షాక్ - 'సలార్'ను ఎందుకు వాయిదా వేస్తున్నారు? అసలు కారణం ఏమిటి?
'ఓజీ' టీజర్ విడుదల తర్వాత అంచనాలు అమాంతం పెరిగాయి. ఆకాశమే హద్దుగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాలో సుజీత్ ఏం చేస్తాడో చూడాలి. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్. ఇమ్రాన్ హష్మీ విలన్. శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రలు చేస్తున్నారు.
Also Read : 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసిన కేసీఆర్, త్వరలోనే ప్రకటన
Telangana BJP : సర్వశక్తులు కూడగట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నం - అగ్రనేతల పర్యటనలు మేలు చేస్తాయా ?
Breaking News Live Telugu Updates: రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పిటిషన్ డిస్పోస్ చేసిన హైకోర్టు- నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లిన సీఐడీ టీం
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
/body>