By: ABP Desam | Updated at : 02 Sep 2023 10:39 AM (IST)
ఓజీలో పవన్ కళ్యాన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ' (OG Movie). 'దే కాల్ హిమ్ ఓజీ (They Call Him OG)' అనేది ఫుల్ టైటిల్. ఓజీ అంటే 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని అర్థం. బహుశా... పవన్ అభిమానులు, సగటు సినిమా ప్రేక్షకుల్లో పోస్టర్లు, కాన్సెప్ట్ వీడియోలతో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో ఆసక్తి కలిగించిన సినిమా మరొకటి లేదని చెప్పడంలో అతిశయోక్తి అవసరం లేదు.
మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామా!
'ఓజీ' చిత్రానికి పవన్ కళ్యాణ్ వీరాభిమానుల్లో ఒకరైన సుజీత్ దర్శకుడు. మాఫియా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Gangster Movie)కి ఇష్టమైన జానర్ ఇది. దాంతో అంచనాలు పెరిగాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (Pawan Kalyan Birthday) సందర్భంగా 'ఓజీ' వీడియో గ్లింప్స్ విడుదల చేశారు.
'Hungry Cheetah' అంటూ 'ఓజీ' వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. పేరుకు తగ్గట్టు చిరుత పులిలా పవన్ వేట సాగింది. ఓ ఫ్యాన్ బాయ్‌గా ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో ఆ అంశాలను చూపించారు సుజీత్. పవన్ కళ్యాణ్ స్వాగ్ (Pawan Kalyan Swag)కు తోడు థమన్ నేపథ్య సంగీతం, విజువల్స్, సుజీత్ డైరెక్టన్ తోడు కావడంతో ఈ గ్లింప్స్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుందని చెప్పవచ్చు. సాధారణ ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.
Also Read : ప్రభాస్ అభిమానులకు షాక్ - 'సలార్'ను ఎందుకు వాయిదా వేస్తున్నారు? అసలు కారణం ఏమిటి?
ఆల్రెడీ 50 శాతం చిత్రీకరణ పూర్తి!
'ఓజీ' చిత్రీకరణ శరవేగంగా చేస్తున్నారు సుజీత్. ఆల్రెడీ 50 శాతం సినిమా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను దర్శకుడు చకచకా పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ డేట్స్ చూసుకుని మిగతా సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య 'ఓజీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో నిర్మించారు. 'సాహో' తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కూడా ఇదే.
Also Read : 'సలార్' కాదు - ఆ రోజు ఎన్టీఆర్ బావమరిది నితిన్ 'మ్యాడ్'!
'ఓజీ' సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగులో నాని 'గ్యాంగ్ లీడర్', శర్వానంద్ 'శ్రీకారం' సినిమాలు చేశారామె. తమిళ అనువాద చిత్రాలు, శివ కార్తికేయన్ సరసన నటించిన 'వరుణ్ డాక్టర్', 'డాన్'తో తెలుగులోనూ విజయాలు అందుకున్నారు.
'ఓజీ'లో ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ అని ముద్రపడిన ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నారు. ఆయనకు తొలి తెలుగు చిత్రమిది. 'బుట్ట బొమ్మ'తో తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయమైన తమిళ నటుడు అర్జున్ దాస్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : ఏఎస్ ప్రకాష్, ఛాయాగ్రహణం : రవి కె చంద్రన్, సంగీతం : ఎస్. థమన్, నిర్మాత : డీవీవీ దానయ్య, రచన - దర్శకత్వం : సుజీత్.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Month of Madhu: కథ వినకుండానే ఈ సినిమా చేశాను, కనీసం డైలాగ్స్ కూడా ముందు చెప్పలేదు: నవీన్ చంద్ర!
AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు ఆగ్రహం, సర్జన్స్ అసోసియేషన్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా
రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్
'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!
Devil Movie Sequel : కళ్యాణ్ రామ్ 'డెవిల్'కు సీక్వెల్ - డైరెక్షన్ కాంట్రవర్సీకి చెక్ పెట్టడం కోసమా?
విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్ మూసివేత
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
Bandi sanjay on BRS: ప్రధాని టూర్‌తో ప్రగతిభవన్‌లో ప్రకంపనలు- బీఆర్ఎస్‌లో చీలిక ఖాయమన్న బండి సంజయ్
/body>