‘భక్త కన్నప్ప’లో నయన్, విరాట్ బయోపిక్‌లో రామ్ పోతినేని - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
తమిళ దర్శకుడితో అఖిల్ అక్కినేని సినిమా?
అఖిల్ అక్కినేని (Akhil Akkineni)కి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆయన హ్యాండ్సమ్ అని కాంప్లిమెంట్స్ ఇచ్చే అమ్మాయిలు ఎంతో మంది! ఆయన నటన మెచ్చిన జనాలు ఉన్నారు. అయితే... హీరోగా ఆయనకు ఆశించిన హిట్స్ మాత్రం లేవు. అఖిల్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఐదు అంటే ఐదు. అందులో హిట్స్, ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే... అక్కినేని అభిమానులు అఖిల్ నుంచి ఆశించిన హిట్స్ రాలేదు. 'ఏజెంట్' తర్వాత ఆయన కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. లేటెస్టుగా ఆయన కొత్త సినిమా గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి, టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మధ్య ఓ పోలిక ఉంది. అది ఏమిటో తెలుసా? ఇద్దరి రూపురేఖలు ఒకేలా ఉంటాయ్! ఈ మాట అన్నది ఎవరో తెలుసా? సంకేత్ మాత్రే! తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేస్తారు కదా! అల్లు అర్జున్, రామ్ వంటి తెలుగు హీరోలకు ఇంకా పలువురు హాలీవుడ్ హీరోలకు హిందీలో సంకేత్ మాత్రే (Sanket Mhatre) డబ్బింగ్ చెబుతారు. ఈ నెల 28న 'స్కంద' విడుదల కానున్న నేపథ్యంలో రామ్ పోతినేని (Ram Pothineni)ని సంకేత్ ఇంటర్వ్యూ చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'కన్నప్ప'లో ప్రభాసే కాదు, నయనతార కూడా - ఆమె క్యారెక్టర్ ఏమిటంటే?
యువ కథానాయకుడు, డైనమిక్ స్టార్ విష్ణు మంచు (Vishnu Manchu) టైటిల్ పాత్రలో రూపొందుతున్న సినిమా 'కన్నప్ప' (Kannappa Movie). ఎ ట్రూ ఎపిక్ ఇండియన్ టేల్... అనేది ఉప శీర్షిక. అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ భాషల్లో విడుదల చేసేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విష్ణు తొలిసారి ఆధ్యాత్మిక సినిమా చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రష్మిక కాదు, గీతాంజలి - రణబీర్ కపూర్ 'యానిమల్'లో నేషనల్ క్రష్ లుక్ చూశారా?
రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'యానిమల్' (Animal Movie). ఈ సినిమాపై హిందీలో మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం... 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడం! 'అర్జున్ రెడ్డి' తీసిన తర్వాత ఆ కథతో హిందీలో 'కబీర్ సింగ్' తీసి విజయం అందుకున్నారు సందీప్ రెడ్డి వంగా! ఇప్పుడు కొత్త కథతో 'యానిమల్' తెరకెక్కించారు. 'యానిమల్'లో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. గీతాంజలి పాత్రలో నేషనల్ క్రష్ కనిపించనున్నారని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత రణబీర్ కపూర్ చేసిన చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
పదేళ్ల తర్వాత 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' - హైదరాబాద్‌లో అంజలి, కోన వెంకట్ సినిమా షురూ
రొటీన్ చిత్రాలతో పోల్చితే హారర్, కామెడీ చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటాయి. తెలుగు సినిమా పరిశ్రమలో పలు హారర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. అప్పట్లో ‘మంత్ర’ మొదలు కొని 'కాంచన', 'ప్రేమ కథాచిత్రమ్' వరకు మంచి హిట్ అందుకున్నాయి. అదే తరహాలు తెరకెక్కిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. ఎంవివి సత్యనారాయణ నిర్మించారు. కోనా వెంకట్ ఈ సినిమాకు కథ అందించారు. అంతేకాదు, ఈ సినిమాను ఆయనే సమర్పించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)