Ram - Virat Kohli Biopic : విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?
విరాట్ కోహ్లీ జీవిత సినిమాలో రామ్ పోతినేని నటిస్తే ఎలా ఉంటుంది? ఆయన నటిస్తే ఎలా ఉంటుందనే ప్రశ్న ఎందుకు వచ్చింది?
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కి, టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మధ్య ఓ పోలిక ఉంది. అది ఏమిటో తెలుసా? ఇద్దరి రూపురేఖలు ఒకేలా ఉంటాయ్! ఈ మాట అన్నది ఎవరో తెలుసా? సంకేత్ మాత్రే! ఆయన ఎవరంటే? వాయిస్ ఆర్టిస్ట్.
తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేస్తారు కదా! అల్లు అర్జున్, రామ్ వంటి తెలుగు హీరోలకు ఇంకా పలువురు హాలీవుడ్ హీరోలకు హిందీలో సంకేత్ మాత్రే (Sanket Mhatre) డబ్బింగ్ చెబుతారు. ఈ నెల 28న 'స్కంద' విడుదల కానున్న నేపథ్యంలో రామ్ పోతినేని (Ram Pothineni)ని సంకేత్ ఇంటర్వ్యూ చేశారు.
రామ్, సంకేత్ మధ్య మాటల మధ్యలో విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది. 'మీరు విరాట్ కోహ్లీలా ఉన్నారని సోషల్ మీడియాలో చాలా మంది చెబుతూ ఉంటారు. ఒకవేళ ఆయన బయోపిక్ చేసే అవకాశం వస్తే?' అని సంకేత్ అడగ్గా... ''నేను 'ఇస్మార్ట్ శంకర్' లుక్ ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా. అప్పటి నుంచి విరాట్ కోహ్లీతో కంపేరిజన్ మొదలైంది. ఒకవేళ కోహ్లీ బయోపిక్ వస్తే తప్పకుండా చేస్తా. ఎగ్జైటింగ్ కదా!'' అని రామ్ సమాధానం ఇచ్చారు. క్రికెట్ నేర్చుకుంటానని కూడా తెలిపారు.
హిందీలో రామ్ ఫెవరేట్ హీరోలు ఎవరంటే?
షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, హృతిక్ రోషన్ అంటే తనకు ఇష్టమని రామ్ పోతినేని చెప్పారు. ఈతరం హీరోల్లో రణబీర్ కపూర్ ఇష్టమని చెప్పారు. రామ్ పోతినేని ఇటీవల షారుఖ్ (Shah Rukh Khan)ని కలిశారు.
''అట్లీ, ప్రియా దంపతులు నాకు ఫ్రెండ్స్. 'జవాన్' చిత్రీకరణకు వెళ్ళా. రూములో ఎక్కువ మంది లేరు. మేం మాత్రమే ఉన్నాం. షారుఖ్ గారికి నన్ను పరిచయం చేశారు. ఆయన చాలా స్వీట్ హార్ట్. నాతో చాలా సేపు మాట్లాడారు. నా సినిమాల గురించి అడిగారు. 'స్కంద' ట్రైలర్ పంపిస్తే చూస్తానని చెప్పారు. ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయన పెద్ద స్టార్. నాతో అంత సేపు మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ, మాట్లాడటం ఆయన గ్రేట్'' అని రామ్ వివరించారు.
సల్మాన్ 'రెడీ' గురించి ఏమన్నారంటే?
'రెడీ'లో రామ్, జెనీలియా జంటగా నటించారు. రితేష్, జెనీలియా దంపతులకు రామ్ ఫ్రెండ్. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక రోజు వేరే సినిమా షూటింగ్ చేస్తుండగా... అక్కడి సల్మాన్ ఖాన్ వస్తే తనను ఆయనకు వాళ్ళు పరిచయం చేశారని రామ్ తెలిపారు.
Also Read : 'స్కంద' క్లైమాక్స్ - 24 రోజులు బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్‌తో!
''నాకు కొంచెం సిగ్గు. సల్మాన్ వస్తున్నారని తెలిసి వెళ్ళిపోతానంటే రితేష్ నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. వెళ్లనివ్వలేదు. సల్మాన్ వచ్చిన తర్వాత పరిచయం చేశారు. 'నువ్వు గుర్తు ఉన్నావ్. 'రెడీ'లో బాగా చేశావ్' అని చెప్పారు. ఆ మాటల్ని మరువలేను. మా స్రవంతి మూవీస్ సంస్థలో 'రెడీ'ని పెదనాన్న 'స్రవంతి' రవికిశోర్ ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా హిందీ రీమేక్ సల్మాన్ భాయ్ చేయడం హ్యాపీగా అనిపించింది'' అని రామ్ చెప్పారు. ఇటీవల 'డబుల్ ఇస్మార్ట్' చిత్రీకరణకు వెళ్ళినప్పుడు జింలో ఉండగా... వరుణ్ ధావన్ వస్తే అనుకోకుండా కలిశామని, అతను కూడా చాలా బాగా మాట్లాడారని చెప్పారు. 'కందిరీగ'ను హిందీలో వరుణ్ ధావన్ రీమేక్ చేశారు.
Also Read : 'కన్నప్ప'లో ప్రభాసే కాదు, నయనతార కూడా - ఆమె క్యారెక్టర్ ఏమిటంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial