Rashmika Animal Movie : రష్మిక కాదు, గీతాంజలి - రణబీర్ కపూర్ 'యానిమల్'లో నేషనల్ క్రష్ లుక్ చూశారా?
రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'యానిమల్'. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. ఇవాళ ఆమె లుక్ విడుదల చేశారు.
లుక్ చూశారా? ఎలా ఉంది? అందులో ఉన్నది రష్మికా మందన్నా (Rashmika Mandanna) కాదు! మరి, ఎవరు? అనేగా మీ సందేహం! అది గీతాంజలి లుక్! ఆమె ఎవరని అంటారా? అయితే... పూర్తి వివరాల్లోకి వెళ్ళాలి.
రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న సినిమా 'యానిమల్' (Animal Movie). ఈ సినిమాపై హిందీలో మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకుల్లో సైతం భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు కారణం... 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ దర్శకుడి నుంచి వస్తున్న సినిమా కావడం! 'అర్జున్ రెడ్డి' తీసిన తర్వాత ఆ కథతో హిందీలో 'కబీర్ సింగ్' తీసి విజయం అందుకున్నారు సందీప్ రెడ్డి వంగా! ఇప్పుడు కొత్త కథతో 'యానిమల్' తెరకెక్కించారు.
'యానిమల్'లో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదల చేశారు. గీతాంజలి పాత్రలో నేషనల్ క్రష్ కనిపించనున్నారని పేర్కొన్నారు. పెళ్లి తర్వాత రణబీర్ కపూర్ చేసిన చిత్రమిది.
Also Read : శ్రీకాంత్ అడ్డాల గారూ... 'పెదకాపు' కథ ఎక్కడ కాపీ కొట్టారు?
View this post on Instagram
'యానిమల్' టీజర్ ఈ 28న విడుదల
టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా 'యానిమల్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ విడుదల చేసిన ప్రీ టీజర్ చూస్తే... ఒక రేంజ్ వయలెన్స్ ఉంటుందని ఈజీగా అర్థం అవుతుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు టీజర్ కూడా ఈ ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
Also Read : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?
'యానిమల్' కథ చాలా పవర్ ఫుల్‌గా ఉంటుందని, రణబీర్ కపూర్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర బృందం పేర్కొంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం రణ్‌బీర్ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారట. హిందీ సీనియర్ హీరో అనిల్ కపూర్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇటీవల ఆయన లుక్ కూడా విడుదల చేశారు.
'యానిమల్' తర్వాత టీ సిరీస్ సంస్థలో సందీప్ రెడ్డి వంగా మరో రెండు సినిమాలు చేయనున్నారు. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందే 'స్పిరిట్' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేయనున్న 'భద్రకాళి' మరొకటి. ఆ రెండు సినిమాలు సైతం పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూ తెరకెక్కించే సినిమాలే.
ప్రస్తుతం 'యానిమల్' కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'లో సైతం రష్మిక నటిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'రెయిన్ బో' సినిమా ఒకటి ఉంది. మాస్ మహారాజ రవితేజ, గోపీచంద్ మలినేని సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ ఖబర్. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial