News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

‘శర్వా35’లో కృతి శెట్టి లుక్, ‘కల్కి’ లీకు వీరులకు నిర్మాతల వార్నింగ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

FOLLOW US: 
Share:

కృతి శెట్టికి బర్త్‌డే బహుమతి - శర్వానంద్ 35లో లుక్ చూశారా?
శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సినిమా అది. 'భలే మంచి రోజు'తో దర్శకుడిగా పరిచయమై... ఆ తర్వాత 'శమంతక మణి', 'దేవదాస్', 'హీరో' చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. హీరోగా శర్వానంద్ 35వ చిత్రమిది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కల్కి 2898 AD'. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక కామిక్ కాన్ ఈవెంట్ లో ఈ మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేసిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ అదుర్స్, మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
సుహాస్ హీరోగా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి సుహాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు.  ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని వెల్లడించారు. ముందుగా చెప్పినట్లుగానే ‘కేబుల్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ ఉదయం 11.43 నిమిషాలకు విడుదల చేశారు మేకర్స్. ఇందులో సుహాస్ టీవీ సెట్ల మీద పడుకుని కనిపించాడు. కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని, నుదుటిని కుంకుమ బొట్టుపెట్టుకుని నవ్వుతూ ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాలో ఫుల్ ఫన్ ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. అటు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు” అంటూ క్యాప్షన్ పెట్టారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నితిన్‌ 'తమ్ముడు'లో బెంగళూరు బ్యూటీ - 'కాంతార' భామ కాకుండా మరో అమ్మాయి!
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న సినిమా 'తమ్ముడు'. ఈ టైటిల్ వింటే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా. ఇప్పుడీ సినిమా చేస్తున్న హీరో, దర్శకుడు, నిర్మాత కూడా పవన్ ఫ్యాన్స్ కావడం విశేషం. 'తమ్ముడు' చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా సప్తమి గౌడను ఎంపిక చేశారు. ఆమె 'కాంతార'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత హిందీ సినిమా 'వ్యాక్సిన్ వార్' చేశారు. అది ఈ నెలాఖరున విడుదల కానుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు నితిన్ 'తమ్ముడు'తో సప్తమి గౌడ పరిచయం కానున్నారు. ఆమె కాకుండా సినిమాలో మరో కథానాయిక కూడా ఉన్నారని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'దొరసాని' డైరెక్టర్ రెండో సినిమా - పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే కుమారుడు హీరోగా
ఆనంద దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ లను హీరో హీరోయిన్ లుగా పరిచయం చేస్తూ 'దొరసాని' అనే సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర తాజాగా తన రెండవ సినిమాని ప్రకటించారు. పాపులర్ పబ్లిసిటీ డిజైనర్ ధని ఏలే తనయుడు సూర్యాతేజ ఏలే ని తన రెండవ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయం చేస్తూ 'భరతనాట్యం' అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రజకతాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో సూర్య తేజ హీరోగా నటించడమే కాకుండా డైరెక్టర్ కెవిఆర్ మహేంద్ర తో కలిసి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రాశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Published at : 21 Sep 2023 05:17 PM (IST) Tags: Tollywood News Movie News entertainment news TV News CINEMA NEWS

ఇవి కూడా చూడండి

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి  - నేటి టాప్ సినీ విశేషాలివే!

‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్, ‘సలార్’ సెన్సార్ పూర్తి - నేటి టాప్ సినీ విశేషాలివే!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Jamal Kudu Song: బాబీడియోల్ ‘జ‌మల్ కుడు’ సాంగ్‌కు యమ క్రేజ్ - ‘యానిమల్’లోని ఈ పాట ఏ దేశానికి చెందినదో తెలుసా?

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Happy Birthday Nabha Natesh: నభా నటేష్ బర్త్ డే: అందాల నటికి అవకాశాలు నిల్ - పాపం, ఆ యాక్సిడెంట్‌తో!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

Hi Nanna : హాయ్ నాన్న - అక్కడ మహేష్ తర్వాత నానిదే పైచేయి!

టాప్ స్టోరీస్

YSRCP Gajuwaka : వైసీపీకి గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

YSRCP Gajuwaka :  వైసీపీకి  గాజువాక ఇంచార్జ్ గుడ్ బై - వెంటనే గుడివాడ అమర్నాథ్‌కు బాధ్యతలు !

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Hyderabad News: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎండీ సజ్జనార్ - 'మహాలక్ష్మి' పథకంపై పరిశీలన, ఇబ్బందులుంటే ఈ నెంబర్లకు కాల్ చేయాలని సూచన

Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

Whatsapp New Features: మరో మూడు కొత్త ఫీచర్లు తీసుకువస్తున్న వాట్సాప్ - ఈసారి ఛానెల్స్‌లో!

Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !

Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !