Cable Reddy First Look: సుహాస్ ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ అదుర్స్, మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
సుహాస్ తాజా చిత్రం ‘కేబుల్ రెడ్డి’ నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. టీవీ సెట్ల మీద హీరో పడుకుని ఉన్న ఫోటో ఆకట్టుకుంటోంది. పనిలో పనిగా మూవీ రిలీజ్ ఎప్పుడనే విషయాన్ని కూడా వెల్లడించారు.

సుహాస్ హీరోగా శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కేబుల్ రెడ్డి’. షాలిని కొండేపూడి సుహాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయాన్ని వెల్లడించారు.
ఆకట్టుకుంటున్న ‘కేబుల్ రెడ్డి’ ఫస్ట్ లుక్ పోస్టర్
ముందుగా చెప్పినట్లుగానే ‘కేబుల్ రెడ్డి’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇవాళ ఉదయం 11.43 నిమిషాలకు విడుదల చేశారు మేకర్స్. ఇందులో సుహాస్ టీవీ సెట్ల మీద పడుకుని కనిపించాడు. కళ్లకు నల్ల కళ్లజోడు పెట్టుకుని, నుదుటిని కుంకుమ బొట్టుపెట్టుకుని నవ్వుతూ ఆకట్టుకున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటేనే సినిమాలో ఫుల్ ఫన్ ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. అటు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ “నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు” అంటూ క్యాప్షన్ పెట్టారు.
Here's the first look poster of #CableReddy
— Suhas 📸 (@ActorSuhas) September 21, 2023
In cinemas Summer 2024. Shooting in progress 💥#ShaliniKondepudi @sridharbobbala #BaluVallu #PhaniAcharya @thefanmadefilms #LittleThoughtsCinemas pic.twitter.com/yv6YeTYsva
‘కేబుల్ రెడ్డి’ విడుదల ఎప్పుడు అంటే?
ఇక ‘కేబుల్ రెడ్డి’ సినిమా విడుదల ఎప్పుడు అనే అంశంపైనా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది(2024) సమ్మర్ కానుగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఇక ఈ సినిమా ఓ పట్ణణంలో జరిగే కథ నేపథ్యంలో కొనసాగుతుందని దర్శకుడు శ్రీధర్ ఇప్పటికే వెల్లడించారు. ఆసక్తికర స్క్రీన్ ప్లేతో, ఆద్యంతం హాస్యరస భరితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. డైరెక్టర్ గా శ్రీధర్ రెడ్డికి ఇదే తొలి చిత్రం. ఈ సినిమాను ఫ్యాన్ మేడ్ ఫిల్మ్స్ పతాకంపై బాలు వల్లు, ఫణి ఆచార్య నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. చిత్రానికి మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా స్మరణ్ సాయి, ఆర్ట్ డైరెక్టర్ గా క్రాంతి ప్రియం వ్యవహరిస్తున్నారు.
యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన సుహాస్
యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టాడు సుహాస్. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. చిన్ని చిన్న పాత్రలు పోషించాడు. ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు. కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ‘రైటర్ పద్మభూషన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిబ్రవరిలో విడుదలైన సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ‘హిట్ 2’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు. అమాయకుడిగా కనిపిస్తూనే క్రూరంగా హత్యలు చేసే వ్యక్తి పాత్ర పోషించాడు. ఇక కామెడీ చిత్రంగా రూపొందుతున్న‘కేబుల్ రెడ్డి’ చిత్రంలో కేబుల్ ఆపరేటర్ గా ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
Read Also: హీరో విజయ్ దళపతి నన్ను నమ్మలేదు- దర్శకుడు అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















