News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Atlee: హీరో విజయ్ దళపతి నన్ను నమ్మలేదు- దర్శకుడు అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

షారుఖ్ ఖాన్ తో సినిమా చేస్తున్నట్లు హీరో విజయ్ తో చెప్తే మొదట్లో ఆయన నమ్మలేదన్నారు దర్శకుడు అట్లీ. ఆ తర్వాత వెన్నుతట్టి ప్రోత్సహించారని వెల్లడించారు.

FOLLOW US: 
Share:

కొద్ది సినిమాలే చేసినా, పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిపోయారు అట్లీ కుమార్. ‘జవాన్‘ చిత్రంతో కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకున్నారు. షారుఖ్ ఖాన్, నయనతార హీరో, హీరోయిన్లు తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కలెక్షన్ల పరంగానూ ఈ చిత్రం రికార్డుల మోతమోగిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు దర్శకుడు అట్లీ.

హీరో విజయ్ నన్ను నమ్మలేదు!

తమిళ స్టార్ హీరో విజయ్ తో కలిసి అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు చేశారు. విజయ్ తో సినిమా చేస్తున్న సమయంలోనే షారుఖ్ తో సినిమా చేసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని తొలుత విజయ్ దళపతికి చెప్పినట్లు వివరించారు. అయితే, ఈ విషయం విని ముందుగా తను నమ్మలేకపోయారని చెప్పారు. కానీ, ఆ తర్వాత అసలు విషయం తెలిసి ప్రోత్సహించాడని చెప్పారు.“బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనతో సినిమా చేయాలని అడిగినప్పుడు నమ్మలేకపోయాను. ఆయనతో సినిమా చేయడం ఏ దర్శకుడికైనా జీవిత కలగా ఉంటుంది. ఆయన మాటకు నేను చాలా సంతోషించాను. కచ్చితంగా సినిమా చేస్తానని చెప్పాను. ఆ తర్వాత హీరో విజయ్ దళపతి దగ్గరికి వెళ్లి విషయం చెప్పాను. తను మొదట్లో నమ్మలేకపోయారు. సీరియస్ గా చెప్తున్నావా? అని ప్రశ్నించారు. అతడే మీతో సినిమా చేయాలనుంది అని చెప్పారా? అని అడిగారు. అనువును అని చెప్పాను. వెంటనే ఆయన నన్ను భుజం తట్టి ప్రోత్సహించారు. ‘జవాన్’ సినిమాను ప్రాణం పెట్టి తీయాలని చెప్పారు” అని అట్లీ గుర్తు చేశారు. 

షారుఖ్ నుంచి చాలా విషయాలను నేర్చుకున్నా!

ఇక ‘జవాన్’ సినిమా సమయంలో  హీరో షారుఖ్ ఖాన్ దగ్గరి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు అట్లీ వెల్లడించారు. “నేను షారుఖ్ ఖాన్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఓపికగా ఉండటం.  ప్రతిదీ పక్కగా చేయడం. సినిమాను అద్భుతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడం సహా చాలా విషయాలు ఆయ నుంచి తెలుసుకున్నాను. షారుఖ్ ఖాన్ నా స్థాయిని పెంచుకోవడం ఎలాగో నేర్పించారు.  నా తర్వాతి సినిమా మరింత అద్భుతంగా ఉంటుంది. ‘జవాన్’ కంటే పెద్ద హిట్ సాధిస్తాం” అని అట్లీ తెలిపారు.  

షారుఖ్ తో రొమాంటిక్ మూవీ చేయాలి అనుకున్నా!

వాస్తవానికి షారుఖ్ ఖాన్ హీరోగా సరికొత్త రొమాంటిక్ చిత్రాన్ని రూపొందించాలని మొదట్లో అనుకున్నట్లు అట్లీ తెలిపారు.  అయితే, ఆ తర్వాత షారుఖ్ ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకుని ఆయనకు సరిపోయే ప్రాజెక్ట్‌ చేయాలని భావించినట్లు తెలిపారు. “షారుఖ్ ఖాన్ ఇంతకు ముందు టచ్ చేయని కథతో సినిమా చేయాలి అనుకున్నాను. అనుకున్నట్లుగానే ‘జవాన్’ సినిమాను తెరకెక్కించాను. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది” అని సంతోషం వ్యక్తం చేశారు.   

Read Also: అట్లీపై నయనతార అసంతృప్తి, అసలు కారణం దీపికేనా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 21 Sep 2023 11:36 AM (IST) Tags: Shah Rukh Khan Jawan Movie Director Atlee Thalapathy Vijay

ఇవి కూడా చూడండి

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: దొరికిపోయిన శోభ, సారీ చెప్పనంటూ యావర్ మొండి పట్టుదల - క్లాస్ పీకిన నాగార్జున

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: నువ్వేమైనా శివాజీ సేవకుడివా? అతడికి సేవలు చేయడానికే వచ్చావా? - ప్రశాంత్‌పై నాగ్ సీరియస్

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Bigg Boss 7 Telugu: ఆడపిల్లలు అందరికీ నేనెందుకు సారీ చెప్పాలి? నాగార్జునతో శివాజీ వాదన, ‘బిగ్ బాస్’ హిస్టరీలో ఫస్ట్‌టైమ్ ఇలా!

Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!

Krishna Mukunda Murari December 9th Episode కృష్ణతో తాడోపేడో తేల్చుకోవడానికి వెళ్లిన మురారి.. ముకుంద పని ఇక అంతే!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే

Telangana Ministers Portfolios: నాలుగు కేబినెట్‌లలో సభ్యుడిగా తుమ్మల రికార్డు- 11 మందికి కేటాయించిన శాఖల ప్రత్యేకతలు ఇవే