Krithi Shetty First Look : కృతి శెట్టికి బర్త్‌డే బహుమతి - శర్వానంద్ 35లో లుక్ చూశారా?
Sharwanand 35 Movie : శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

శర్వానంద్ (Sharwanand) కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న సినిమా అది. 'భలే మంచి రోజు'తో దర్శకుడిగా పరిచయమై... ఆ తర్వాత 'శమంతక మణి', 'దేవదాస్', 'హీరో' చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్. హీరోగా శర్వానంద్ 35వ చిత్రమిది.
కృతి పుట్టిన రోజు కానుకగా...
శర్వానంద్, కృతి శెట్టి (Krithi Shetty) కలయికలో మొదటి చిత్రమిది. ఇవాళ ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా శర్వా 35 సినిమాలో కృతి శెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మోడ్రన్, న్యూ ఏజ్ అమ్మాయి పాత్రలో కృతి శెట్టి నటిస్తున్నట్లు ఆ లుక్ చూస్తే అర్థం అవుతోంది.
Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?
Wishing Our Incredibly Talented & Ever Gorgeous @IamKrithiShetty a very happy birthday 🎉
— People Media Factory (@peoplemediafcy) September 21, 2023
A Beautiful Surprise awaits you @ 11:07 Am😍
Stay Tuned to https://t.co/FHXnrWACs0 @ImSharwanand @SriramAdittya @vishwaprasadtg @vivekkuchibotla @HeshamAWMusic @VishnuSarmaDOP… pic.twitter.com/lhhiQctosM
బేబీ ఆన్ బోర్డ్ - టైటిల్ అదేనా?
శర్వానంద్, కృతి శెట్టి జంటగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రానికి 'BOB' (Baby On Board) టైటిల్ ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.
'బేబీ ఆన్ బోర్డ్' క్యాప్షన్ ఎక్కువగా కార్ల మీద కనపడుతుంది. కారులో చిన్న పిల్లలు... అంటే జన్మించి కొన్ని నెలలు మాత్రమే అయిన చిన్నారులు కారులో ఉన్నారని రోడ్డు మీద మిగతా వాళ్ళకు సమాచారం ఇవ్వడం కోసం ఆ క్యాప్షన్ పెడతారు. మరి, ఈ సినిమాకు 'బేబీ ఆన్ బోర్డ్' టైటిల్ పరిశీలించడం వెనుక దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కాన్సెప్ట్ ఏమిటో? లండన్ నేపథ్యంలో 'బేబీ ఆన్ బోర్డ్' కథ సాగుతుందని తెలుస్తోంది.
Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
శ్వరా 35కు 'ఖుషి' సంగీత దర్శకుడు
ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మలయాళ హిట్ 'హృదయం'తో తెలుగు ప్రేక్షకులు కొందరిని ఆయన ఆకట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన 'ఖుషి'కి సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు. నాని 'హాయ్ నాన్న', విక్రాంత్ 'స్పార్క్' సినిమాలకు కూడా సంగీతం అందిస్తున్నారు.
'BOB Baby On Board' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : కృతి ప్రసాద్ & ఫణి కె వర్మ, కళా దర్శకుడు : జానీ షేక్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : విష్ణు శర్మ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

