‘పుష్ప 2’ రిలీజ్ డేట్, ‘పెదకాపు 1’ ట్రైలర్ విడుదల - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
పుష్ప గాడి రూలు మొదలయ్యేది అప్పుడే - మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నిర్మాతలు!
ప్రస్తుతం మనదేశంలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప 2: ది రూల్’ ఒకటి. 2021లో విడుదల అయిన ‘పుష్ప: ది రైజ్’కు డైరెక్ట్ సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ‘పుష్ప 2’ ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తికి తెరదించుతూ రిలీజ్ డేట్‌ను నిర్మాతలు విడుదల చేశారు. 2024 ఆగస్టు 15వ తేదీన ‘పుష్ప 2: ది రూల్’ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'పెదకాపు' ట్రైలర్ - మీకే అంతుంటే మాకెంతుడాలిరా - ఆత్మ గౌరవమా? కొవ్వా?
టాలీవుడ్ లో 'కొత్త బంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', వంటి క్లాస్ మూవీస్ తో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల రీసెంట్ టైమ్స్ లో విక్టరీ వెంకటేష్ తో 'నారప్ప' లాంటి రా అండ్ రస్టిక్ సబ్జెక్టు డీల్ చేసి తాను కూడా మాస్ మూవీస్ ని హ్యాండిల్ చేయగలనని నిరూపించుకున్నాడు. ఈ క్రమంలోనే త్వరలోనే మరో రియాలిస్టిక్ మాస్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెదకాపు'. ఓ సామాన్యుడి సంతకం అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. విరాట్ కర్ణ ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు ఆరంగేట్రం చేస్తున్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రజినీకాంత్ తో లోకేష్ కనగరాజ్ మూవీ - రెగ్యులర్ షూటింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
'విక్రమ్' సినిమాతో సౌత్ లో లోకేష్ కనకరాజ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీ గత ఎడాది విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డిఫరెంట్ ఫిలిం మేకింగ్ తో డైరెక్టర్గా లోకేష్ తనకంటూ సొంత మార్క్ ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ లో తక్కువ సమయంలో సినిమా తీసి విడుదల చేస్తున్న ఘనత కూడా ఈ డైరెక్టర్ కే దక్కుతుంది. కేవలం నెలల వ్యవధి లోనే సినిమా పూర్తి చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం లోకేష్ తలపతి విజయ్తో 'లియో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో మొదలెట్టారు. దసరా సీజన్లో విడుదల చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రీ-రిలీజ్‌కు రెడీగా ఉన్న కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ.. హైదరాబాద్ లో సందడి చేయనున్న '7/G' జోడీ!
ప్రస్తుతం టాలీవుడ్ లో 'రీ-రిలీజ్' ట్రెండ్ నడుస్తోంది. గతంలో క్లాసిక్స్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, కొందరు ప్లాప్ సినిమాలను సైతం రీ రిలీజ్ చేస్తూ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో కల్ట్ క్లాసిక్ మూవీ థియేటర్లలోకి రావడానికి రెడీ అయింది. 2004లో సంచలన విజయం సాధించిన '7/G బృందావన కాలనీ' సినిమా మరో పది రోజుల్లో రీ-రిలీజ్ కాబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రతిక ఏం పీకుతున్నావ్? టేస్టీ తేజ నోటి దురుసు, వాడి వేడిగా ‘బిగ్ బాస్’ నామినేషన్స్
‘బిగ్ బాస్’ సీజన్ 7లో మొదటి వారంలో ఎలిమినేషన్ పూర్తయ్యింది. హౌజ్‌లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్‌లో కిరణ్ రాథోడ్ వెళ్లిపోయింది. ప్రస్తుతం 13 మంది మాత్రమే హౌజ్‌లో ఉన్నారు. ఒకరు వెళ్లిపోయిన వెంటనే హౌజ్‌లో మళ్లీ నామినేషన్స్ మొదలయ్యాయి. ఎప్పుడైనా ‘బిగ్ బాస్’లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గుతున్నకొద్దీ.. ఫైనల్స్‌కు చేరువ అవుతున్నారనే అర్థం. అంటే ఎవరికి వారు తాము హౌజ్‌లో ఎందుకు ఉండాలి, మిగతా కంటెస్టెంట్స్ ఎందుకు ఉండకూడదు అనే విషయంపై నామినేషన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా జరిగిన నామినేషన్స్ మరింత వాడి వేడిగానే జరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే తేజ.. రతికపై సీరియస్ అయ్యాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)