అన్వేషించండి

7/G Brindavan Colony: రీ-రిలీజ్‌కు రెడీగా ఉన్న కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ.. హైదరాబాద్ లో సందడి చేయనున్న '7/G' జోడీ!

తెలుగు తమిళ భాషల్లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన '7/G బృందావన కాలనీ' సినిమా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో 'రీ-రిలీజ్' ట్రెండ్ నడుస్తోంది. గతంలో క్లాసిక్స్ గా నిలిచిన చిత్రాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, కొందరు ప్లాప్ సినిమాలను సైతం రీ రిలీజ్ చేస్తూ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో కల్ట్ క్లాసిక్ మూవీ థియేటర్లలోకి రావడానికి రెడీ అయింది. 2004లో సంచలన విజయం సాధించిన '7/G బృందావన కాలనీ' సినిమా మరో పది రోజుల్లో రీ-రిలీజ్‌ కాబోతోంది. 

ఏఎం రత్నం సమర్పణలో సెల్వ రాఘవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ లవ్ స్టోరీ '7/G బృందావన కాలనీ'. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. లవ్ స్టోరీల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిపోయిన ఈ మూవీని 19 ఏళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. సెప్టెంబర్ 22న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రీరిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే రీరిలీజ్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి కానీ, ముందుగా అనౌన్స్ చేసిన తేదీకే సినిమాని విడుదల చేయనున్నట్లు రవికృష్ణ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. 

హీరో రవికృష్ణ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతూ.. '7/G బృందావన కాలని' చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేస్తున్నాం, దయచేసి అందరూ వచ్చి ఈ సినిమాను చూసి హృదయపూర్వకంగా ఆనందించండి. నేను సోనియా అగర్వాల్‌ తో కలిసి హైదరాబాద్‌ కి వస్తాను. ఏ థియేటర్‌లకి వస్తామనేది మరి కొద్ది రోజుల్లో కన్ఫర్మ్ చేస్తాను'' అని పేర్కొన్నారు.  ఈ క్రమంలో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''నేను మ్యాగ్జిమమ్ స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను బ్రదర్. మీరు దీన్ని స్నేహితులు, అభిమానులతో కలిసి విజయవంతం చేయండి'' అని అన్నారు. 

Also Read: మాస్ మహారాజా 'ఛాంగురే బంగారు రాజా' ట్రైలర్ - రంగురాళ్లతో జీవితాలు మారిపోతాయా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravi Krishna (@a.m.ravikrishna)

'7/G బృందావన కాలని' చిత్రాన్ని 4K వెర్షన్ లో డాల్బీ ఆటమ్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రమోహన్‌, విజయన్‌, సుమన్‌ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రలు నటించారు. ఈ చిత్రం తమిళంలో '7/G రెయిన్‌బో కాలనీ' పేరుతో విడుదలైంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్‌ టేకింగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. చార్ట్ బస్టర్ సాంగ్స్ తో పాటుగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాజికల్ లవ్ స్టోరీ మరోసారి ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయనుందని, భారీ వసూళ్లు ఖాయమని సినీ అభిమానులు భావిస్తున్నారు. 
 
'7/G బృందావన కాలనీ'కి సీక్వెల్..
ఇదిలా ఉంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత '7/G బృందావన కాలని' చిత్రానికి సీక్వెల్ తీయడానికి ప్లాన్ చేసున్నారు. ఈ విషయంపై శ్రీ సూర్య మూవీస్‌ అధినేత ఏఎం రత్నం ఇటీవల క్లారిటీ ఇచ్చారు. రవికృష్ణ లీడ్‌ రోల్‌లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మరి ఈ సీక్వెల్‌ ప్రాజెక్ట్ కి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తారా లేదా? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: రోడ్డుపై పడుకున్న పవన్ కల్యాణ్.. ఇది నెల క్రితం రిలీజ్ చేసిన 'వ్యుహం' స్టిల్ అంటూ ఆర్జీవీ ట్వీట్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
HCU Land Dispute: హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్‌- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్‌- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
Trump Tariffs: అన్నంత పనీ చేసిన ట్రంప్‌, భారత్‌ సహా ఏ దేశాన్నీ వదల్లేదుగా!
అన్నంత పనీ చేసిన ట్రంప్‌, భారత్‌ సహా ఏ దేశాన్నీ వదల్లేదుగా!
Salman Khan: 'సికిందర్' మూవీపై బాలీవుడ్ స్టార్స్ మౌనం - స్పందించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనకు సపోర్ట్ కావాలంటూ..
'సికిందర్' మూవీపై బాలీవుడ్ స్టార్స్ మౌనం - స్పందించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనకు సపోర్ట్ కావాలంటూ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
HCU Land Dispute: హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్‌- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్‌- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
Trump Tariffs: అన్నంత పనీ చేసిన ట్రంప్‌, భారత్‌ సహా ఏ దేశాన్నీ వదల్లేదుగా!
అన్నంత పనీ చేసిన ట్రంప్‌, భారత్‌ సహా ఏ దేశాన్నీ వదల్లేదుగా!
Salman Khan: 'సికిందర్' మూవీపై బాలీవుడ్ స్టార్స్ మౌనం - స్పందించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనకు సపోర్ట్ కావాలంటూ..
'సికిందర్' మూవీపై బాలీవుడ్ స్టార్స్ మౌనం - స్పందించిన కండల వీరుడు సల్మాన్ ఖాన్, తనకు సపోర్ట్ కావాలంటూ..
RCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్
RCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్
Singeetam Srinivasa Rao: ముందూ వెనుకా చూసుకోలేదు.. గుడ్డిగా దూకేశారు.. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు
ముందూ వెనుకా చూసుకోలేదు.. గుడ్డిగా దూకేశారు.. ‘ఆదిత్య 369’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన దర్శకుడు
Rajinikanth Movie OTT Release : రజనీకాంత్ సినిమా ఓటీటీ విడుదలకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందా ? - రిలీజై ఏడాది దాటినా ఇంకా సస్పెన్సే
రజనీకాంత్ సినిమా ఓటీటీ విడుదలకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందా ? - రిలీజై ఏడాది దాటినా ఇంకా సస్పెన్సే
US News: ట్రంప్‌ ప్రతీకార సుంకాల వల్ల ప్రభావితమయ్యే ఉత్పత్తులేవి? ధరలు పెరిగే అవకాశం ఉన్న వస్తువులేంటీ? 
ట్రంప్‌ ప్రతీకార సుంకాల వల్ల ప్రభావితమయ్యే ఉత్పత్తులేవి? ధరలు పెరిగే అవకాశం ఉన్న వస్తువులేంటీ? 
Embed widget