Changure Bangaru Raja: మాస్ మహారాజా 'ఛాంగురే బంగారు రాజా' ట్రైలర్ - రంగురాళ్లతో జీవితాలు మారిపోతాయా?
హీరో రవితేజ నిర్మాణంలో రూపొందిన లేటెస్ట్ మూవీ 'ఛాంగురే బంగారు రాజా'. వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయ్యింది.
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నారు. RT టీమ్ వర్క్స్ అనే బ్యానర్ ను స్థాపించి, న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్న రవితేజ.. ఇప్పటికే పలు చిత్రాలని నిర్మించారు. కొన్ని చిత్రాలకు సమర్పకులుగా వ్యవహరించారు. ఈ క్రమంలో లేటెస్టుగా తన నిర్మాణంలో 'ఛాంగురే బంగారు రాజా' అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీని రూపొందిస్తున్నారు.
‘ఛాంగురే బంగారు రాజా’ సినిమాలో ‘C/o కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటించగా.. గోల్డీ నిస్సీ హీరోయిన్ గా నటించింది. సతీష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ తో కలిసి రవితేజ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని వినాయక చవితి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్లు ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
‘ఛాంగురే బంగారు రాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. దీనికి రవితేజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హీరో శ్రీ విష్ణు, దర్శకులు హరీశ్ శంకర్, అనుదీప్ కేవీ, వంశీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని, చిత్ర బృందానికి విషెస్ అందజేశారు. ఇందులో భాగంగా రిలీజ్ చేసిన ట్రెయిలర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
'నమస్కారం.. ఈరోజు మర్డర్ చేయడం ఎలానో తెలుసుకుందాం' అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్ గా సాగింది. రంగురాళ్ల చుట్టూ తిరిగే కథతో ఒక క్రైమ్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. వర్షం పడినప్పుడు హీరోకి రంగురాళ్ళు దొరకడం, వాటిని అమ్మడానికి అతను ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది ట్రైలర్ లో చూపించారు. ఈ క్రమంలో ఓఆర్డర్ కూడా జరిగినట్లు తెలుస్తోంది.
ఇందులో రవిబాబు, సత్య, నిత్య శ్రీ, ఎస్తర్ నోరోన్హా, అజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ తో పాటుగా రవిబాబు, సత్య లవ్ ట్రాక్స్ కూడా అలరిస్తున్నాయి. 'రంగురాళ్ల పెట్టుకుంటే మన జాతకాలు మారుతాయో లేదో తెలియదు కానీ.. అవి దొరికితే మాత్రం కచ్ఛితంగా మన జీవితాలు మారిపోతాయి' అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ కథలో ఓ కుక్క పాత్రకు సునీల్ వాయిస్ ఓవర్ అందించడం గమనార్హం.
‘ఛాంగురే బంగారు రాజా’ చిత్రానికి కృష్ణ సౌరభ్ సంగీతం సమకూర్చగా, సుందర్ ఎన్‌సి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జనార్ధన్ పసుమర్తి డైలాగ్స్ రాసిన ఈ సినిమాకి కార్తీక్ వున్నవా ఎడిటర్ గా వర్క్ చేశారు. శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రోడ్యూసర్స్ గా వ్యవహరించారు. సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కింగ్ ఖాన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial